Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఆవేశంగా గ్యారేజ్‌కి వెళ్లి.. పోస్టర్ ఎందుకు వేశారని అడుగుతాడు. ఏం పోస్టర్ మాకు ఏం తెలీదు అని వాళ్లు అంటే ఇలా కాదు.. ఇలా అడిగితే మీరు చెప్పరు అని వాళ్లని కొడతాడు. మాకేం తెలీదు అన్న నువ్వు వదిన విడిపోయారని మాకు బాధగా ఉంది కానీ ఓ ఆడపిల్ల పరువు ఎందుకు తీస్తాం అన్నా.. అంతే కాదు రిషి కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్ మరి ఈ విషయం తెలిసేలా మేం ఎందుకు చేస్తామన్నా అని అంటారు.
దేవా కోపంగా మీరు కాకపోతే ఇది మరి ఎవరు చేశారు.. ఇదంతా చేసే ధైర్యం ఇంకెవరికి ఉంది అని అంటాడు. ఇది చిన్ని విషయంలా లేదు అన్న దీని వెనక ఏదో పెద్ద కుట్రలా అనిపిస్తుందని అంటారు. దేవా కూడా ఆలోచనలో పడతాడు. ఆ కనిపించని శత్రువు ఎవరై ఉంటారా అని దేవా అంటాడు. ఆ శత్రువుని నేనే.. పోస్టర్ రూపంలో నేను పెట్టిన మందు పాత్ర పేలడానికి రెడీ అయింది.. హరివర్థన్ ఏ క్షణం అయినా దేవా ఇంటికి వెళ్లి గొడవ పడతారు. వాళ్లలో వాళ్లు కొట్టుకొని మిథున నాకు సొంతం అయిపోతుంది.. యుద్ధం మొదలైందని ఆదిత్య అనుకుంటాడు.
హరివర్థన్ తన కూతురి జీవితం మరోసారి గోడెక్కిందని ఇలా ఎవరు చేసుంటారు తన పరువు పోయిందని బాధ పడతాడు. రాహుల్ తండ్రితో రిషికి నిజం చెప్పలేదు.. పైగా ఇంటి నుంచి వెళ్లకుండా ఆపారు.. రిషికి అనుమానం పెరిగిపోతుంది ఎందుకు ఆపారు నాన్న అని అడుగుతాడు. దానికి హరివర్థన్ పోస్టర్ తీసుకొచ్చి చూపించి ఇందుకు అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. సిటీలో చాలా చోట్ల ఈ పోస్టర్లు ఉన్నాయి.. రిషి వీటిని చూస్తే త్వరలోనే పీటలెక్కనున్న పెళ్లి ఆగిపోదా అని అంటాడు.
అలంకృత తండ్రితో ఈ పోస్టర్లు ఎవరు వేయించుంటారు అని అంటే దానికి త్రిపుర దేవానే ఇలా చేయించుంటాడు. మిథున పెళ్లి ఆపాలనే ఇలా చేశాడని అంటుంది. మిథున పెళ్లి ఆపాల్సిన అవసరం అతనికి ఏంటి అని లలిత అంటే మిథునకు మనస్శాంతి లేకుండా చేయడమే ఆ రౌడీ గాడి లక్ష్యం అని అంటుంది త్రిపుర. దేవాని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ వదిన. దేవా ఎప్పటికీ అలా చేయడు అని మిథున చెప్తుంది. దేవా ఏంటో ఎలాంటి వాడో నాకు తెలుసు.. కచ్చితంగా ఈ పని దేవాని కాదు.. ఒక ఆడపిల్లని మానసికంగా హింసించేలా దేవా ఎప్పటికీ దిగజారి పని చేయడు అని అంటుంది.
వాడిని ఇంకా వెనకేసుకురావడానికి సిగ్గులేదా అని రాహుల్ మిథునని తిడతాడు. దేవా గురించి తెలుసు కాబట్టి ఇలా చెప్పానని మిథున అంటుంది. ఆడపిల్లని నలుగురిలో నవ్వుల పాలు చేయడా మరి బలవంతంగా నీ మెడలో తాళి కట్టడాన్ని ఏమంటారు అని అడుగుతుంది. అది వేరు ఇది వేరు అని మిథున అంటుంది. హరివర్థన్ ఏం మాట్లాడొద్దు అని చెప్పి మిథునని లోపలికి తీసుకెళ్లమని లలితతో చెప్తాడు.
రాహుల్ తండ్రితో దేవాని అలా వదిలేయకూడదు ఏదో ఒకటి చేయాలి.. ఏదో పెద్ద ప్లాన్‌తోనే ఉన్నాడని అంటాడు. కొడుకు అలా చెప్పడంతో హరివర్థన్ ఆవేశంగా గన్ తీస్తాడు. కాంతం భర్తతో ఆ పోస్టర్లు వేయించింది మిథునా, దేవా అని అడిగి రెండు వేళ్లు చూపించి పట్టుకోమని చెప్తుంది. అందులో దేవా పోస్టర్లు వేయించినట్లు వచ్చిందని అంటుంది. దేవా అలా చేయడు అని రంగం అంటాడు. ఇక తన కన్ను అదురుతుందని ఇంటికి సునామీ రానుందని అంటుంది.
రాహుల్, హరివర్థన్ ఆవేశంగా దేవా ఇంటికి వస్తారు. సత్యమూర్తి కాలర్ పట్టుకొని దేవాని పిలవమని హరివర్థన్ అంటాడు. ఇంతలో దేవా వచ్చి నాన్న షర్ట్ వదులు అంటాడు. జడ్జి కోపంగా నా కూతురి జీవితం ఏం చేయాలి అనుకుంటున్నావ్‌రా.. తనని ప్రశాంతంగా బతకనివ్వవా.. ఇలా పోస్టర్లు వేసి ఏం చేయాలి అనుకుంటున్నావ్‌రా అని అడుగుతాడు. ఈ పోస్టర్ల గురించి నాకు తెలీదు అని దేవా అంటే హరివర్థన్ గన్ గురి పెట్టి నువ్వు కాకపోతే ఎవరు వేయిస్తారురా అని అంటాడు. నా కొడుకు వేయించలేదు అని సత్యమూర్తి అడిగితే వీడు కాకపోతే ఈ పోస్టర్లు వేయించే అవసరం ఇంకెవరికి ఉంది అని అడుగుతాడు. నా కూతురి పెళ్లి ఆపాలి అనే ఇదంతా చేశావని అంటాడు. నా కొడుకు మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని సత్యమూర్తి అంటారు. నా కొడుకు రౌడీనే కానీ ఇలాంటి పనులు చేసి ఆడపిల్ల జీవితం నాశనం చేసే వాడు కాదు అంటాడు. వీడు నిజంగా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకపోతే నా కూతురి మెడలో బలవంతంగా తాళి కడతాడా అని అడుగుతాడు. వాడు చేసిన తప్పు అదే అందుకు వాడు ఎంత పశ్చాత్తాపపడ్డాడో నాకు మాత్రమే తెలుసు అని సత్యమూర్తి అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.