Chinni Serial Today Episode మధు, మ్యాడీ క్లోజ్‌గా బైక్ మీద రావడం చూసి శ్రేయ వెళ్లి మధుని కోప్పడుతుంది. మ్యాడీ శ్రేయని తిడతాడు. బండి మీద వస్తే తప్పేంటి అని అడుగుతాడు. మధు మ్యాడీతో శ్రేయని బాధ పెట్టొద్దు.. తన పరిస్థితిలో ఎవరు ఉన్నా ఇలాగే అనుకుంటారు. లోహితను చూస్తూ తన పక్కనే ఉన్నా వారు లేని పోనివి చెప్పడం వల్ల తను ఇలా అడిగింది ఏం అనొద్దు తనని బాధ పెట్టొద్దు అంటుంది. 

Continues below advertisement

శ్రేయ వాళ్లతో నన్ను బాధ పెట్టడం సంగతి తర్వాత ఈ ప్రోగ్రామ్‌కి చీఫ్ గెస్ట్‌గా మా మామయ్య అత్తయ్యా వస్తున్నారు. వాళ్ల ముందు మీరు రాసుకొని పూసుకొని తిరిగి వాళ్లని బాధ పెట్టొద్దు అని శ్రేయ చెప్తుంది. శ్రేయ కోపంగా వెళ్లిపోతుంటే శ్రేయ దగ్గరకు సంజు వెళ్లి నిన్ను చూస్తే మా చెల్లిని చూసినట్లు ఉంది.. నీకు మధు, మ్యాడీల విషయంలో ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు అని అంటాడు. ఇలాంటి వాడు మన పక్కన ఉండటం మనకే మంచిది అని లోహిత చెప్తుంది. 

నాగవల్లి, దేవా కాలేజ్‌కి బయల్దేరుతారు. మ్యాడీతో పాటు మధు కూడా పార్టిసిపేట్ చేస్తుందని అనిపిస్తుందని దేవా అంటాడు. ఇక ఆఫ్ టికెట్ బాలరాజు కోసం వెతికిస్తూ ఉంటాడు. అతి త్వరలోనే బాలరాజుని వెతకాలి లేదంటే చిన్నికి ప్రమాదం అని చెప్తుంటాడు. ఇంతలో దేవా అటుగా రావడం ఆఫ్ టికెట్ చూసి దాక్కుంటాడు. త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దేవా వాళ్లని ఆఫ్ టికెట్ ఫాలో అవ్వడం దేవా చూస్తాడు. డ్రైవర్‌కి చెప్పి కారు స్లో చేయమని అంటాడు. దేవాకి అనుమానం వచ్చి కారు ఆపిస్తాడు. ఆఫ్ టికెట్ వాళ్లు దాక్కుంటారు. 

Continues below advertisement

మధు, మ్యాడీ వాళ్లు అందరి ముందు రిహార్సల్స్ చేస్తారు. లోహిత శ్రేయతో రియల్ లవర్స్‌ లా ఎంతలా రాసుకొని పూసుకొని ఉన్నారో చూడు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ చూస్తే వాళ్లు కేవలం ఫ్రెండ్స్ అంటే ఎవరైనా నమ్ముతారా.. అంతకు మించి ఏదో ఉందని అనిపించడం లేదా.. కాబోయే భర్త ఇలా పిచ్చి వేషాలు వేస్తే చూసి తట్టుకోవడం కష్టమే అని అంటుంది. 

శ్రేయ ఆవేశంగా వెళ్లబోతే లోహిత ఆపి.. ఇలా కాదు మధు స్టేజ్ మీద సిగ్గుతో తల దించుకునేలా ఓప్లాన్ ఉంది చెప్తా పద అని తీసుకెళ్తుంది. దేవా, నాగవల్లి కాలేజ్‌కి వస్తారు. స్టాఫ్ ఘనంగా వాళ్లని స్వాగతం పలుకుతుంది. దేవా ఓ ఫోన్ రావడంతో మాట్లాడుతాడు. దేవా తనని ఫాలో అయిన ఆఫ్ టికెట్‌ని చూస్తాడు. దేవా చూడటం చూసేసిన ఆఫ్ టికెట్ పారిపోతాడు. దేవా తన వాళ్లతో ఆఫ్ టికెట్ వచ్చాడు.. ఇలా వచ్చాడు అంటే ఏదో ప్లాన్‌తో వచ్చుంటాడు..వాడిని వదలొద్దు అని చెప్తాడు. 

లోహిత శ్రేయని తీసుకొని కాస్ట్యూమ్ రూంకి వెళ్తుంది. అక్కడ మధు  వేసుకోబోయే డ్రస్ కుట్టు ఊడిపోయేలా చేస్తుంది. మధు, మ్యాడీ మాట్లాడుకుంటూ ఉంటే ఆఫ్ టికెట్ చూస్తాడు. చిన్ని మహి ఇక్కడ ఉన్నారేంటి దేవాకి మధునే చిన్ని అని తెలిస్తే ఇక అంతే అని మధు దగ్గరకు వెళ్తాడు. మధుని చాటుగా తీసుకెళ్లి మాట్లాడుతాడు. పొరపాటున కూడా మినిస్టర్ దగ్గర నాన్న గురించి కానీ నా గురించి కానీ చెప్పొద్దు అని అంటాడు. ఒక వేళ తెలిస్తే నాన్న ప్రాణాలకే ప్రమాదం ఎవరికీ చెప్పకు అంటాడు. ఎవరికీ చెప్పను అని మధు అంటుంది. ఇక దేవా అటుగా రావడం చూసి మ్యాడీ వెళ్లిపోవాలని అనుకుంటారు. ఆఫ్ టికెట్ మధుతో మాట్లాడటం దేవా చూస్తాడు. 

మధు ఏంటి ఆఫ్ టికెట్‌తో మాట్లాడుతుందని అనుకుంటాడు. ఆఫ్ టికెట్ పారిపోయిన తర్వాత దేవా మధు దగ్గరకు వెళ్లి అతను ఎవరు అమ్మా అని అడుగుతాడు. మధు దేవాతో అతను మీ గురించి అడిగాడు అంకుల్.. మీరు ఎక్కడ ఉంటారు.. ఇక్కడ ఎంత సేపు ఉంటారు అని అడిగాడని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.