Nindu noorella savaasam Serial weekly Episode:  అంజుకు బ్లడ్‌ అరగంటలో దొరుకుంతుందని భాగీ చెప్పడంతో రామ్మూర్తి షాక్‌ అవుతాడు. ఎలా దొరుకుందమ్మా అల్లుడు గారేమో పిల్లల కోసం వెళ్లారు. మీరు ఇక్కడే ఉన్నారు ఎలా దొరుకుంతుంది అని అడుగుతాడు. దీంతో మనోహరి చేత బ్లడ్‌ ఇప్పించే ప్లాన్‌ గురించి రామ్మూర్తికి చెవిలో చెప్తుంది. అయితే భాగీ ప్లాన్‌ చెప్తుంటే వినడానికి ఆరు వెళ్తుంటే గుప్త ఆపేస్తాడు. నువ్వు అక్కడికి వెళితే నీ సహోదరికి కనిపిస్తావు అంటాడు. దీంతో ఆరు ఆగిపోతుంది. ఇక ప్లాన్‌ మొత్తం విన్న రామ్మూర్తి సరే నవ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు. దీంతో భాగీ, రాథోడ్‌ పక్కకు వెళ్లి చాటు నుంచి చూస్తుంటారు. ఇంతలో అక్కడకు మనోహరి రాగానే రామ్మూర్తి నాటకం మొదలు పెడతాడు. 

Continues below advertisement

అంజు చావు బతుకుల్లో అంటూ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. ఎవరు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు అంటూ అందిరినీ తిట్టినట్టు నటిస్తాడు. దీంతో మను మనసులో చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో అక్కడే దాక్కున్న రాథోడ్‌, భాగీ వస్తారు. వాళ్లను రామ్మూర్తి తిట్టినట్టు నటిస్తాడు. బ్లడ్‌ ఏమైందని అడుగుతాడు. మేము అందరం టెస్ట్‌ చేసుకున్నాం అంజుకు మా బ్లడ్‌ మ్యాచ్‌ కావడం లేదని చెప్తుంది భాగీ. అయితే మనోహరిని చెక్‌ చేయండి అని రామ్మూర్తి చెప్తాడు. దీతో మను షాక్‌ అవుతుంది. తర్వాత మను బ్లడ్‌ చెక్‌ చేయగానే తనది అంజుకు సరిపోతుందని తెలుస్తుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

ఇక ఆరు పునర్జన్మకు సమయం ఆసన్నమైందని గుప్త ఆరుకు చెప్తాడు. ఎలాగని అడుగుతుంది ఆరు. నువ్వు చూస్తూ ఉండు ఎలా జరుగుతుందో అని గుప్త చెప్పి స్వామిజీ రూపంలోకి మారిపోయి అమర్‌ ఇంట్లోకి వెళ్తాడు. అందరికీ ఆరు ఆత్మ గురించి చెప్తాడు. గుప్త మాటలకు అందరూ షాక్‌ అవుతారు. మీకెలా తెలుసని అడుగుతారు. దీంతో గుప్త తాను త్రికాలజ్ఞానినని చెప్తాడు. అలాగే ఆరుకు పునర్జన్మ ఎత్తే టైం వచ్చిందని ఆమె తిరిగి మీ ఇంట్లో మళ్లీ మీ కడుపున పుట్టాలంటే.. ఆమె ఆస్థికలు నదిలో నిమజ్జనం చేయండి అని చెప్తాడు గుప్త. గుప్త మాటలకు మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. అమర్‌ మాత్రం ఆలోచనలో పడిపోతాడు. అయితే ఆస్థికలు నిమజ్జనం చేయడం వల్ల మీ ఇంటికి శుభం జరుగుతుందని చెప్తాడు గుప్త. దీంతో అమర్‌ ఆస్థికలు నిమజ్జనం చేస్తానని చెప్తాడు.

Continues below advertisement

తర్వాత అమర్‌ తమ  మేజర్‌ ఇంట్లో జరిగే ఫంక్షన్ కు వెళ్తుంటే.. తాను వస్తానని భాగీ వెళ్తుంది. అందుకోసం భాగీ రెడీ అవుతుంటే.. వెనక నుంచి అమర్‌ వెళ్లి హగ్‌ చేసుకుంటాడు. అంతా గమనించిన మనోహరి ఇరిటేటింగ్‌ గా తన రూంలోకి వెళ్తుంది. ఇంతలో అమర్‌, భాగీ ఫంక్షన్‌కు వెళ్తారు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా అలా వెళ్లడం చూసిన మనోహరి వెంటనే నాగుకు కాల్‌ చేస్తుంది. భాగీని చంపాలని చెప్తుంది. అమర్‌ వాళ్లు వెల్లిన మేజర్‌ ఇంటి అడ్రస్‌ చెప్తుంది.  

అందరూ పార్టీలో ఉండగా నాగు అక్కడికి వెళ్లి అమర్‌ వాళ్లు బయటకు రాగానే చంపాలని రెడీ ఉంటారు. ఇంతలో అమర్‌, భాగీ రాగానే వాళ్ల మీద ఆటాక్‌ చేస్తాడు. వాళ్లు రౌడీల నుంచి తప్పించుకుని పారిపోతాడు. దూరంగా ఒక గుడిసెలోకి వెల్లిపోతారు. దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!