Meghasandesam Serial weekly Episode: గుడిలో ఉన్న తన మనుషులను అపూర్వ బయటకు పిలుస్తుంది. వాళ్లంతా ( బ్యాండ్ మేళం, పూలు కట్టేవాళ్లు అంతా అపూర్వ కిరాయి రౌడీలే ఉంటారు.) అందరూ తన దగ్గరకు వచ్చాక ఓరేయ్ మీరంతా ఎవ్వరికీ అనుమానం రాకుండా జనంలో కలిసిపోండి ఆ భూమి ఇక్కడికి వస్తే నేను చెప్తాను. దాన్ని లేపేయండి.. అని చెప్తుంది అపూర్వ. రౌడీలు అలాగే మేడం మేము చూసుకుంటాము అంటారు. ఏ పొరపాటు జరిగినా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ అవకాశం చేజారిపోతుంది అంటూ అపూర్వ హెచ్చరించగానే.. మేడం ఈరోజు ఆ భూమి చావు రాసిపెట్టి ఉంది. చంపేసి దాన్ని నదిలో కలిపేస్తాం అంటారు.
అందులో కనక తేడా జరిగితే అదే నదిలో మిమ్మల్ని కలిపేస్తా. ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక నక్షత్ర నాట్యం చేస్తూ నివేదన ఇవ్వడానికి వెళ్తుంటే.. తన చేతిలో ఉన్న దీపం కిందపడబోతుంది. వెంటనే అక్కడకు వచ్చిన భూమి ఆ దీపం కింద పడకుండా పట్టుకుంటుంది. దీంతో నక్షత్ర మిగతా దీపాలు కూడా భూమికి ఇస్తుంది. భూమి నాట్యం చేస్తూ నివేదన ఇవ్వడానికి వెళ్తుంది. అపూర్వ మనుషులు పగిలిన సీసా ముక్కలు వేస్తారు. వెంటనే గగన్ వాళ్లను కొట్టి.. సీసా ముక్కలపై పడుకుంటాడు. భూమి, గగన్ మీద నుంచి వెళ్తూ నివేదన పూర్తి చేస్తుంది.
తర్వాత నక్షత్ర మిరపకాయలతో జ్యూస్ చేసి తీసుకొచ్చి చెర్రికి ఇస్తుంది. తనకు జ్యూస్ వద్దని తోసేస్తాడు చెర్రి. ఇద్దరి మధ్య జ్యూస్ గ్లాస్ కింద పడిపోతుంది. దీంతో నక్షత్ర గట్టిగా అరుస్తుంది. అందరూ వస్తారు. తాను జ్యూస్ ఇస్తుంటే.. తాగడం లేదని కింద పడేశాడని చెప్తుంది. అందరూ చెర్రిని తిడతారు. నక్షత్ర నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు భూమి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందున్న తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో పై నుంచి చూసిన గగన్ వెంటనే ఒక బకెట్ లో నీళ్లు తీసుకొచ్చి భూమి మీద పోసి లోపలికి వెళ్లిపోతాడు. నీళ్లు తన మీద పడగానే అటూ ఇటూ చూస్తుంది. ఎవ్వరూ కనిపించరు. పైకి చూస్తుంది. బకెట్ కనిపిస్తుంది. వెంటనే కోపంగా పైకి వెళ్లి గగన్ ను నిద్ర లేపుతుంది. గగన్ తిట్టి పంపిస్తాడు. భూమి కిందకు వచ్చి శారదకు చెప్తుంది. అందరూ నవ్వుకుంటారు.
తర్వాత గగన్ రూంలో సర్దుతున్న శారదకు కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరా ఓపెన్ చేసిన అందులో అపూర్వ, శోభాచంద్రను చంపిన వీడియో చూస్తుంది. దీతో శారద షాక్ అవుతుంది. వెంటనే విషయం భూమికి చెప్పాలనుకంటుంది. అంతా గమనించిన రత్న, శారద దగ్గరకు వచ్చి కెమెరా ఇవ్వమని అడుగుతుంది. శారద ఇవ్వనని చెప్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. దీంతో శారద, రత్న నుంచి తప్పించుకుని పైకి రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. రత్న వెంటనే అపూర్వకు ఫోన్ చేసి చెప్తుంది. అపూర్వ ఒక కిరాయి రౌడీని శారదను చంపైనా ఆ వీడియో కెమెరా తీసుకురమ్మని చెప్తుంది. సరేనని రౌడీ బయలుదేరుతాడు.
పైన రూంలో ఉన్న శారద బాధపడుతుంది. ఇంతలో భూమి ఇంటికి వస్తుంది. అత్తయ్యా అంటూ శారదను పిలుస్తూ పైకి రూంలోకి వెళ్తుంది. భూమి వచ్చిందని శారద కిందకు వస్తుంది. అప్పుడే డోర్ బెల్ మోగగానే.. భూమే వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేస్తుంది శారద. డోర్ ముందు ముసుగులో అపూర్వ పంపిన రౌడీ ఉంటాడు. వాడు కెమెరా ఇవ్వమని శారదను అడుగుతాడు. శారద ఇవ్వనని వెళ్లబోతుంటే.. వాడు శారదను కాల్చేస్తాడు. బుల్లెట్ తగిలిన శారద కింద పడుతుంటే చేతిలో ఉన్న కెమెరా సోపా కిందకు పడిపోతుంది.
ఇంతలో భూమి కిందకు వస్తుంది. శారదను చూసి ఏడుస్తూ రౌడీని వెనక నుంచి కొడుతుంది. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. దీంతో రౌడీ పారిపోతాడు. భూమి, శారదను హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. దీంతో ఈ వారం మేఘసందేశం చివరి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!