Nindu Noorella Saavasam Serial Today Episode: మేజర్‌ వైఫ్‌ ముందు భాగీ ఏవేవో గొప్పలు చెప్పుకుంటుంది. అమర్‌ తనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడని ఈ పార్టీకి కూడా తనను అమరే రెడీ చేశాడని చెప్తుంది. వెనక నుంచి వచ్చి అమర్‌ మొత్తం వింటుంటాడు. అమర్‌ను చూసి భాగీ షాక్ అవుతుంది.

Continues below advertisement

మేజర్‌ వైఫ్‌: ఏమయ్యా అమరేంద్ర నీకు నీ భార్యంటే అంత ఇష్టం ఉంటే మరీ ప్రతిపనీ నువ్వే చేయాలా

అమర్‌: లేదు మేడం..

Continues below advertisement

భాగీ: ( మనసులో) దేవుడా ఇలా బుక్‌ చేశావేంటయ్యా

అమర్‌: భాగీ కొంచెం అటు వెళ్దాం పద..

భాగీ: ఎందుకండి.. ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పండి

అమర్‌: భాగీ ఎందుకు చెప్తున్నానో విను.. అటు వెళ్దాం పద

భాగీ: సరే వెళ్దాం పదండి..

భాగీ  చేయి పట్టుకుని అమర్‌ పక్కకు తీసుకెళ్తాడు.

మేజర్‌ వైఫ్‌: చూశారా ఇప్పుడు కూడా అమర్‌ భాగీ చేయి వదలడం లేదు.. హస్బెంట్‌ అంటే అలా ఉండాలి.

అందరూ  నవ్వుతుంటారు.

అమర్‌: ఏంటి నేను నిన్ను పార్టీకి రమ్మని ఇన్‌వైట్‌  చేశానా..?

భాగీ: లేదండి

అమర్‌: నీకు కొత్త శారీ కొనిపెట్టానా..? నిన్ను కూర్చోబెట్టి ఇంట్లో పనులు చేస్తానా..? ఎందుకు అలా అబద్దాలు చెప్పావు

భాగీ: ఊరికే తమాషాకు జోక్‌ చేశా

మేజర్‌:  అమర్‌ ఒకసారి ఇటు రావా..?అ

అమర్‌: ఆ వస్తున్నాను.. సార్‌.. ఇంటికెళ్లాక నీ పని చెప్తాను

మేజర్:  అమర్‌ ఎనీ ప్రాబ్లమ్‌

అమర్‌: నథింగ్‌ సార్

భాగీ మళ్లీ మేజర్‌ వైప్‌ దగ్గరకు వెళ్తుంది.

మేజర్‌ వైఫ్‌: ఏంటి భాగీ ఏమంటున్నాడు మీ  ఆయన

భాగీ: ఏం లేదు మేడం.. ఈ పార్టీలో నాకు దిష్టి తగులుతుందేమోనని ఇంటికి వెళ్లాక దిష్టి తీస్తా అన్నారు.

మళ్లీ అమర్ వచ్చి వింటుంటాడు. అమర్‌ను చూసి భాగీ కంగారుపడుతుంది.

భాగీ: మీరు సార్ దగ్గరకు వెళ్లారు కదండి..

మేజర్‌ వైఫ్‌: ఏమయ్యా అమరేంద్ర నువ్వు దిష్టి కూడా తీస్తావా..? నీకు దిష్టి తీయడం కూడా వచ్చా..? ఎప్పుడూ చెప్పలేదు.. మీ సార్‌కు కూడా కొంచెం నేర్పవయ్యా.. పదవయ్యా.. నీ దగ్గర చాలా విషయాలు నేర్చోకోవాలి పదవయ్యా.. రా..   

మేజర్‌ దగ్గరకు తీసుకెళ్తుంది. బాగీ కన్పీజ్‌ గా చూస్తుంది.

మేజర్‌ వైఫ్‌: ఏవండి.. అమర్‌ను చూశారా..? వీళ్ళ ఆవిడకు ఇంటికి వెళ్లిన తర్వాత దిష్టి కూడా తీస్తాడట. వాళ్ల భార్యని చాలా బాగా చూసుకుంటున్నాడు

మేజర్‌:  అమరేంద్ర నిజమా

మేజర్‌ వైఫ్‌: ఏవండి భార్యను ప్రేమగా ఎలా చూసుకోవాలో అమరేంద్రకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. ఆ ట్రిక్స్‌ ఏవో అమర్‌ దగ్గర మీరు తెలుసుకోవాలి. అమర్‌ మీ సార్‌కు కూడా కొంచెం చెప్పవయ్యా.. సినిమాలకు షికార్లకు కూడా వెళ్తారట కదా

అమర్‌: అది నేను సరదాగా అన్నాను సార్‌..

మేజర్‌ వైఫ్‌: ఏవండి విన్నారా..? మీరు ఎప్పుడైనా నన్ను తీసుకెళ్లారా..? అమర్‌ను చూసి నేర్చుకోండి..

అంతా గమనిస్తున్న భాగీ భయపడుతుంది.

భాగీ: అయ్యో ఇంటికి వెళ్లాక నన్ను ఏమంటారో ఏమో

అని కంగారు పడుతూ కూల్‌ డ్రింక్స్‌ అనుకుని మందు తాగుతుంది. అమర్‌.. భాగీనే గమనిస్తుంటాడు.

అమర్‌: (మనసులో) తనేంటి కూల్‌ డ్రింక్‌ అనుకుని మందు తాగేస్తుందా..?

మేజర్‌ వైఫ్‌: అమర్‌ ఇంకేంటయ్యా ట్రిక్స్‌ .. ఏమయ్యా అమర్‌ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావేంటి..? భాగీ కోసమా… భాగీ ఎక్కడికి వెల్లిపోదులేవయ్యా.. ఆ ట్రిక్స్‌ ఏవో కొంచెం మా ఆయనకు కూడా చెప్పు

అమర్‌: లేదు మేడం.. తను కూల్ డ్రింక్స్‌ అనుకుని మందు తాగేస్తుంది.

అనగానే అందరూ భాగీని చూస్తారు. మేజర్‌ వెంటనే వెళ్లి ఆపవయ్యా.. వెళ్లు అని చెప్పగానే.. భాగీ మందు తాగడం ఆపడానికి వెల్తాడు అమర్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!