Brahmamudi Serial Weekly Episode:  వినాయక చవితి సంబరాల్లో భాగంగా చీటీలు తీసి ఒక్కోక్కరుగా వచ్చి తమ ఫర్మామెన్స్‌ చేసి వెళ్తుంటారు. ఇంతలో రుద్రాణి రాజ్‌ దగ్గరకు వెళ్లి చీటీ తీయిస్తుంది. అందులో తన మొదటి ప్రేమ గురించి చెప్పాలి అని వస్తుంది. దీంతో  వెళ్లండి నిజాయితీగా మీ మొదటి ప్రేమను చెప్పండి.. నేను అని మాత్రం అబద్దం చెప్పకండి. ఎందుకంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంది మా అక్కను.. ఆ విషయం మర్చిపోకండి అంటుంది కావ్య. అయితే రాజ్‌ మాత్రం సరే నిజాయితీగానే నా ప్రేమను చెప్తాను.. నిజాయితీగా నా ప్రేమను చెప్పమంటున్నారు. చెప్తాను.. కానీ దానికంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.. ప్రేమ గొప్పదా..? పెళ్లి గొప్పదా..?

Continues below advertisement

అంటూ అడిగిన తర్వాత కావ్య గురించి తను మొదటి సారి ఎలా కావ్యను చూసింది చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. కావ్య కూడా నిజమే కదా అనుకుంటుంది. తర్వాత రేవతిని చీటీ తీయమంటుంది రుద్రాణి తీయనని చెప్పినా వినకుండా బలవంతంగీ చీటి తీయిస్తుంది. అందులో డాన్స్‌ చేయాలని వస్తుంది. తన వల్ల డాన్స్‌ కాదని రేవతి చెప్పినా వినకుండా రుద్రాణి బలవంతంగా రేవతి చేత డాన్స్‌ చేయిస్తుంది. డాన్స్‌ చేస్తుంటే కావాలనే రేవతి ముసుగు తీసేస్తుంది. ముసుగు పోయిన రేవతిని చూసిన దుగ్గిరా ఫ్యామిలీ మొత్తం షాక్‌ అవుతుంది. రేవతి భయంగా చూస్తూ నిలబడుతుంది.

ఇక రుద్రాణి రేవతిని చూసి ఎంత మోసం చేశావు మా వదిన అమాయకురాలిని చేసి ఇంత తెగించావా..? అంటూ తిడుతుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. ఇందిరాదేవి కూడా రేవతిని ఆరోజు రెచ్చగొట్టింది నువ్వు కాదా అంటూ నిలదీయగానే.. రుద్రాణి సైలెంట్‌ అవుతుంది. ఇంట్లో వాళ్లు అందరూ అపర్ణను కన్వీన్స్ చేయాలని చూస్తారు. రేవతిని క్షమించమని చెప్తారు. అయితే ముసుగులో వచ్చింది రేవతి అని తనకు ముందే తెలుసని అందరికి షాక్‌ ఇస్తుంది అపర్ణ. దీంతో రేవతి ఏడుస్తూ అపర్ణ కాళ్ల మీద పడుతుంది. అపర్ణ కూడా రేవతికి సారీ చెప్తుంది. దీంతో ఇద్దరూ కలిసిపోతారు. అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో కావ్యకు అబార్షన్‌ చేయాలన్న విషయం ఎలా చెప్పాలని అప్పు బాధపడుతుంది. తర్వాత జగదీష్‌ రావడంతో అందరూ కలిసి ఇక్కడే ఉందామని ఇందిరాదేవి చెప్తుంది. అయితే తాను జగదీష్‌తో అక్కడే ఉంటానని.. పండగకో.. పర్వదినానికో వస్తానని అప్పుడే తనకు గౌరవం ఉంటుందని రేవతి, జగదీష్‌తో వెళ్లిపోతుంది.

Continues below advertisement

తర్వాత కళ్యాణ్‌ కావ్య అబార్షన్‌ గురించి రాజ్‌కు చెప్తాడు. రాజ్‌ మరోసారి డాక్టర్‌ ను కలిసి ఏదైనా చిన్న చాన్స్‌ ఉందేమో కనుక్కుందామని చెప్తాడు. ఇద్దరూ డాక్టర్‌ దగ్గరకు వెల్లి అడగ్గానే.. డాక్టర్‌ రాజ్‌ను తిడుతుంది. దీంతో రాజ్‌ కూడా డాక్టర్‌ ను తిట్టి బయటకు వస్తాడు. ఆ బాధతో ఇంటికి వచ్చిన రాజ్‌ కోపంగా సుభాష్‌తో గొడవ పెట్టుకుంటాడు.  రాజ్‌లో ఆ మార్పును చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్‌ అవుతుంది. ఏమైందని రాజ్‌ను అడుగుతారు. రాజ్ కోపంగా పైకి వెళ్లిపోతాడు. రూంలో బాధపడుతున్న అప్పు దగ్గరకు వెళ్లి కళ్యాన్‌ జరిగిన విషయం చెప్తాడు.  ఇంతటితో గడిచిన వారం బ్రహ్మముడి అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!