Nindu Noorella Saavasam Telugu Serial Today Episode: అరుంధతి కోప్పడ్డాన్ని ఫీల్ అవుతారు మనోహరి, నీల. భయంతో నీల కిందికి పరుగులు తీస్తుంది.
మనోహరి: అంజు నీకు ఇష్టమైన పిల్లో నీ దగ్గర లేదు, అది నీ తల కింద పెడదామని వస్తే ఏదో వైబ్రేషన్ వస్తుంది ఏంటది అని అమాయకంగా అడుగుతుంది.
అరుంధతి: నువ్వు అంజు మీద కోపం పెట్టుకున్నావేమో అనుకున్నాను, సారీ అంటుంది.
మనోహరీ పిల్లోని అంజు తల కింద పెట్టి బయటకి వెళ్ళిపోతుంది. కంగారుగా తన గదిలోకి వచ్చి అక్కడ అరుంధతి ఉంది ఇప్పుడు తనని ఘోరకి అప్పజెప్పడం ఎలా అని టెన్షన్ పడుతుంది.
నీల : మొదటిసారి ఆత్మ తాలూకా వైబ్రేషన్ చూశానమ్మా కళ్ళతో చూడలేదు కానీ ఆ భయం తెలుస్తుంది అని భయంతో వణికి పోతుంది.
మరోవైపు తమ్ముడిని చీపురు కట్టతో కొడుతూ ఉంటుంది మంగళ.
రామ్మూర్తి: ఏం జరిగింది ఎందుకు కొడుతున్నావు.
మంగళ: నువ్వే అడుగు ఏం చేశాడో.
రామ్మూర్తి: మీ అక్క కోప్పడేంతగా నువ్వు ఏం చేశావు అని అడుగుతాడు.
చేతి మీద భాగీ పేరుని పచ్చబొట్టు గా చూపిస్తాడు కాళీ.
మంగళ: పెళ్ళికాని పిల్ల పేరు పచ్చబొట్టు వేయించుకుంటే నలుగురు ఏమనుకుంటారు ముందు ఆ పేరు తీయించేయ్.
కాళీ : నాకు కాబోయే పెళ్ళాం పేరు వేయించుకున్నాను ప్రాణమైనా తీసుకుంటాను కానీ ఈ పేరు తీయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మంగళ: వాడు భాగీ కోసం ఎంత తపన పడుతున్నాడో చూడండి. మీకు ఇష్టం లేదని తెలుసు అందుకే నేను ఏమీ అనలేకపోతున్నాను. భాగి మన ఇంట్లోనే ఉంటే బాగుండేది పరాయి ఇంట్లోకి వెళ్తే తరుచుగా మనం చూసుకోలేము కదా అని భాగిని తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని రామ్మూర్తిని బుట్టలో వేయాలని చూస్తుంది.
రామ్మూర్తి ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
కాళీ : ఏంటక్కా నేను ఇన్ని దెబ్బలు తిన్నా పని జరిగేటట్టు కనిపించడం లేదు అనుకుంటూ ఇంట్లోకి వస్తాడు.
మంగళ: ఇది కాకపోతే ఆఖరి అస్త్రం ప్రయోగిస్తాను దీనికి ఒప్పుకొని తీరాల్సిందే అని కసిగా తమ్ముడుతో చెప్తుంది.
మరోవైపు స్కూల్ కి ఎర్లీగా బయలుదేరుతారు అంజలి వాళ్ళు. ఇంత ఫాస్ట్ గా ఎందుకు అంటుంది మిస్సమ్మ.
అంజు : కొంతమంది పిల్లలు చాలా ఎర్లీగా వస్తారు కదా వాళ్ళని ఓట్లు అడగటం కోసం మేము కూడా ముందే వెళ్లాలి అంటుంది.
అంజు నానమ్మ : చదువు తప్పితే మిగతా తెలివితేటలు అన్నీ ఎక్కువే అని అంజు ని ఆట పట్టిస్తుంది.
అంజు కూడా సరదాగా మాటకు మాట సమాధానం చెబుతుంది.
మనోహరి : ఆత్మను బయటకు పంపించడానికి ఇదే మంచి సమయం అనుకొని పిల్లలతో మీ అమ్మ మీతో ఉన్నంతవరకు మీకు ఓటమి అనేది ఉండదు అందుకే మీరు మీ అమ్మ మీ పక్కనే ఉందని గట్టిగా నమ్మండి విజయం మీదే అంటుంది.
ఈ మాటలు అన్నీ బయటనుంచి వింటున్న అరుంధతి అయితే నేను వీళ్ళతో పాటు స్కూల్ కి వెళ్లి పిల్లల్ని గెలిపించుకోవాలి అనుకుంటుంది.
ఆరోజు పిల్లల్ని అమర్ డ్రాప్ చేయడానికి రెడీ అవుతాడు. కార్ లో ఓరగా కూర్చుంటున్న అంజుతో ఎందుకలా కూర్చుంటున్నావ్ అని అడుగుతాడు.
అంజు: మమ్మల్ని గెలిపించడానికి అమ్మ మాతో పాటు వస్తున్నట్లయితే తనకి ప్లేస్ ఉండాలి కదా అందుకే ఇలా కూర్చుంటున్నాను అంటుంది. ఆ మాటలకి బాగా ఎమోషనల్ అవుతాడు అమర్. అయితే నిజంగానే అరుంధతి అక్కడ ఉంటుంది.
మరోవైపు నీల ఘోర దగ్గరికి వచ్చి ఆత్మ స్కూల్ దగ్గర ఉంటుంది మిమ్మల్ని అమ్మగారు అక్కడికి వెళ్ళమన్నారు అని చెప్తుంది. ఆత్మని బంధించాక ఏం చేస్తారు అని అడుగుతుంది.
ఘోర : ఆత్మ ని చిత్రహింసలు పెడతాను చివరికి ఆ బాధ భరించలేక నేను చెప్పినట్లు చేస్తుంది అప్పుడు ఈ లోకాన్ని శాసిస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అరుంధతి మీద నీల జాలి పడుతుంది.
మరోవైపు భాగీ ఇంటికి రావడాన్ని గమనించి డ్రామా మొదలుపెడతారు అక్క తమ్ముళ్లు. కాళీ ఏడుస్తూ ఉంటే మావయ్య ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది భాగీ.
మంగళ: మా సంగతి నీకు ఎందుకు లేమ్మా.
భాగీ :నాన్న ఏడి కనిపించడం లేదు.
మంగళ : పనికి పోయాడు అని నోరు జారుతుంది, ఆ తర్వాత సర్దుకొని ఏదో పని ఉంటే బయటికి వెళ్ళాడు అంటుంది. అయినా నీకు పెళ్లి అయిపోతే నీ భర్త మమ్మల్ని పోషించడానికి ఒప్పుకోడు కదా అందుకే నేను పనికి పోదామని చూస్తున్నాను అంటుంది.
భాగీ : నాన్న ఆరోగ్యం బాగయ్యే వరకు నాకు పెళ్లి ఆలోచన లేదు అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: మాది ‘ఆదిపురుష్‘ కాదు, ఓం రౌత్ వీఎఫ్ఎక్స్‌పై ‘కల్కి‘ ఎడిటర్ సెటైర్లు