Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో చిత్రగుప్తుడు దగ్గరికి వచ్చి మిస్సమ్మని అనుమానిస్తున్నారు అంటుంది అరుంధతి.


చిత్రగుప్తుడు: ఆ బాలిక అటువంటిది కాదు కదా.


అరుంధతి: ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఇంట్లో డబ్బు ఎవరు తీసి ఉంటారు అని అనుమానంగా నీల పేరు చెప్తుంది.


చిత్రగుప్తుడు: జరిగేది జరగక మానదు నీకెందుకు కంగారు అంటాడు.


అరుంధతి: మీకంటే జరిగేవి జరగబోయేవి అన్ని తెలుస్తాయి అందుకే మీకు ఎలాంటి కంగారు ఉండదు కానీ నా పరిస్థితి అలా కాదు కదా అంటుంది.అంతలోనే మిస్సమ్మ రావడం చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్లి ఏమైపోయావు పొద్దుటి నుంచి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంది.


మిస్సమ్మ: కన్ఫ్యూజ్ అవుతూ మా ఇంట్లో పొద్దుటి నుంచి నేను లేనని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది.


అరుంధతి: ఇందాక నీకోసమే వచ్చాను అప్పుడు వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను ఇంట్లో డబ్బు పోయిందంట అని చెప్తుంది.


డబ్బు పోవడం ఏమిటి అని కంగారుగా ఇంట్లోకి వెళ్ళబోతుంది మిస్సమ్మ.


చిత్రగుప్తుడు: డబ్బు పెట్టినప్పుడు నీవు అక్కడ ఉండటం డబ్బు పోయినప్పుడు ఇంట్లో లేకపోవడం వలన నిన్ను అనుమానించే పరిస్థితులు వచ్చాయి అంటాడు.


అంటే నేను డబ్బు తీసాను అనా మీ ఉద్దేశం అంటుంది.


చిత్రగుప్తుడు : పరిస్థితులు అలా ఉన్నాయి అందుకే ముందే హెచ్చరిస్తున్నాను అంటాడు.


మరోవైపు నేల మనోహరి ని ఆమె గదిలోకి తీసుకు వెళుతుంది.


నీల : కంగారుపడుతూ నాకు చాలా భయంగా ఉంది ఇంట్లో వాళ్ళు ఎవరూ ఆ మిస్సమ్మని అనుమానించడం లేదు మీరు చిన్నమ్మ గారి ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని ఎవరు అనుమానించారు ఇక మిగిలింది నేనే. నన్ను గట్టిగా అడిగితే నిజం చెప్పేస్తాను అందుకే ఆ డబ్బు ఎక్కడ తీసింది అక్కడ పెట్టేద్దాం అంటుంది.


మనోహరి కోపంతో రెచ్చిపోతూ నువ్వు దొంగలా దొరికిపోతే ఉద్యోగం మాత్రమే తీసేస్తారేమో కానీ నువ్వు నిజం చెప్తే నేను నీ ప్రాణం తీసేస్తాను అని హెచ్చరించి అక్కడ నుంచి వచ్చేస్తుంది.


భయంతో నీల కూడా దేవుడిని ప్రార్థించుకుంటూ అక్కడ నుంచి వచ్చేస్తుంది.


ఆ తర్వాత అప్పుడే ఇంటికి వచ్చిన మిస్సమ్మని డబ్బులు ఏం చేశావు అని అడుగుతుంది మనోహరి.


మిస్సమ్మ : నేను డబ్బులు తీయడం ఏంటండీ, దేవుడి తోడు నేను ఏ డబ్బులు తీయలేదు అంటుంది.


మనోహరి : దేవుడి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావేమో అసలు అర్ధరాత్రి ఇంటి నుంచి ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది.


మిస్సమ్మ : మా నాన్నగారి గురించి పీడకలు వచ్చింది భయంతో ఆయన దగ్గరికి వెళ్లాను అంటుంది.


మనోహరి ఇంకా ఏవో ప్రశ్నలు వేస్తుంటే అమర్ తల్లిదండ్రులు మందలించి మిస్సమ్మ తో ఈ డబ్బులు నువ్వు తీయలేదని మాకు తెలుసు నువ్వు ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వు, పిల్లల్ని స్కూల్ కి రెడీ చెయ్యు అని పంపించేస్తారు.


అమర్: డబ్బులు సంగతి నేను చూసుకుంటాను నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని మనోహరిని లోపలికి పంపించేస్తాడు.


అమర్ తల్లిదండ్రులు : ఆ అమ్మాయి అలాంటిది కాదు పోనీలే డబ్బు పోతే పోయింది దీని గురించి  మిస్సమ్మని అడిగి ఇబ్బంది పెట్టొద్దు అంటారు.


అమర్: తప్పు చేసిన వాళ్ళు కచ్చితంగా శిక్ష అనుభవించాలి. డబ్బు ఎవరు తీసారో తెలిస్తేనే మిస్సమ్మ మళ్ళీ ఈ ఇంట్లో ఫ్రీగా తిరగ గలుగుతుంది అంటాడు.


మరోవైపు ఏడుస్తున్న మిస్సమ్మ దగ్గరికి వచ్చి రాథోడ్ ఓదారుస్తాడు.


మిస్సమ్మ: నాకు ఏడవటం చిన్నప్పటినుంచి అలవాటే కానీ నాకే ఎందుకు ఈ బ్యాడ్ లక్ అని అనుకునేదాన్ని కానీ నేనే నా బ్యాడ్ లక్ అని ఇప్పుడు తెలిసింది అని తన కధంతా చెప్పకు వస్తుంది.


బాధతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు రాథోడ్.


ఇదంతా పిల్లలు కూడా వింటారు మిస్సమ్మ గురించి బాధపడతారు.


అరుంధతి కూడా అక్కడే ఉండి అదంతా చూస్తుంది.


అరుంధతి: మిస్సమ్మ నా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. ఆమె కోసం నేను ఏమైనా చెయ్యాలి ఆ డబ్బులు  ఎవరు తీశారో కనిపెట్టాలి అనుకుంటుంది.


అప్పుడే అనుమానాస్పదంగా ఎక్కడికో వెళ్తున్న నీలని చూస్తుంది అరుంధతి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్