Nindu Noorella Saavasam Telugu Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో డబ్బుని దొంగలించి తన గదికి తీసుకువచ్చేస్తుంది మనోహరి.


నీల: మీరు నిజంగా గ్రేట్ అండి ఎంత సులువుగా దొంగతనం చేసేసారు ముందు నుంచి మీకు అలవాటు ఉందా అని అడుగుతుంది.


ఆ మాటలకి నీలని కోపంగా చూస్తుంది మనోహరి


నీల : మాట దాట వేస్తూ ఇప్పుడు ఈ డబ్బుకి ఆ మిస్సమ్మకి ఎలా లింకు పెడతారు అని అడుగుతుంది.


మనోహరి : చెప్పేస్తే మజా ఏముంది చూస్తూ ఉండు అంటుంది.


మరోవైపు తండ్రి చనిపోయాడని కలకంటుంది మిస్సమ్మ. కంగారుపడుతూ అర్ధరాత్రి తన ఇంటికి పరుగులు తీస్తుంది. తలుపు తీయమంటూ తలుపు కొడుతూ ఉంటే అర్ధరాత్రి ఎవరు వచ్చారు అనుకుంటూ మంగళ తలుపుతీస్తుంది. ఇంట్లోకి వచ్చిన మిస్సమ్మ తండ్రిని లేపి అతడిని పట్టుకొని ఏడుస్తుంది.


మంగళ: ఏమైంది ఎందుకంత కంగారు, ఏమైనా పీడకలకన్నావా అంటుంది.


రామ్మూర్తి : ఇంకేముంటుంది నేను దగ్గి, దగ్గి చనిపోయానని కలగని ఉంటుంది అంటాడు.


అలా అనొద్దు అంటూ అతని నోరుమూసి తండ్రిని హత్తుకొని ఏడుస్తుంది మిస్సమ్మ.


మంగళ: పంతులు గారు చెప్పిన విషయం భాగీకి చెప్పు అని భర్తతో చెప్తుంది.


రామ్మూర్తి: పంతులుగారు తనతో చెప్పినదంతా మిస్సమ్మకు చెప్తాడు.


మిస్సమ్మ : నీకు జబ్బు నయం అయ్యేవరకు నాకు పెళ్లి వద్దు అంటుంది.


రామ్మూర్తి: నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఈ విషయంలో నేను నిర్ణయం తీసేసుకున్నాను అంటాడు.


మరేమీ మాట్లాడలేక పోతుంది మిస్సమ్మ.


మరోవైపు బీరువాలో ఏదో పెట్టటానికి డోర్ ఓపెన్ చేస్తుంది అమర్ తల్లి. అక్కడ డబ్బు బ్యాగ్ లేకపోవడంతో భర్త దగ్గరికి వచ్చి బ్యాంకులో డబ్బు వేస్తానన్నారు కదా ఇంత పొద్దున్నే ఎందుకు డబ్బులు తీశారు అని అడుగుతుంది.


అమర్ తండ్రి : నేను ఇప్పుడే లేచి పేపర్ చదువుతున్నాను. నువ్వు ఎప్పుడు టీ ఇస్తావా అని వెయిట్ చేస్తున్నాను నేనెప్పుడు డబ్బులు తీసాను అంటాడు.


అయితే డబ్బులు కనిపించడం లేదు అని కంగారుగా భర్తతో చెప్తుంది అమర్ తల్లి. అప్పుడే వచ్చిన రాథోడ్ కి అమర్ కి కూడా విషయం చెప్తుంది.


ఆ మాటలు విన్న మనోహరి మీకు నిన్న డబ్బులు ఎవరు ఇచ్చారు ఆంటీ అని అడుగుతుంది.


అమర్ తల్లి: మిస్సమ్మ అని చెప్తుంది.


మనోహరి : ఇంకేముంది తనే తీసుకొని ఉంటుంది కేర్ టేకర్ గా వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు అంటుంది.


నిజం తెలుసుకోకుండా ఒక మనిషి గురించి అలా మాట్లాడొద్దు అంటూ మందలిస్తారు అమర్ తల్లిదండ్రులు.


రాథోడ్: ఆమె అలాంటిది కాదు అని మిస్సమ్మని వెనకేసుకొస్తాడు.


మనోహరి: కాదు అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు నువ్వు తీసావా అని అడుగుతుంది.


రాథోడ్: ఏం మాట్లాడుతున్నారమ్మ.. నేను ఎందుకు తీస్తాను? నాకేం అవసరం అని అడుగుతాడు.


ఈ మాటలు అన్ని వింటున్న అరుంధతి కూడా మిస్సమ్మని అలా అనొద్దు, మిస్సమ్మ అలాంటిది కాదు అని అంటుంది. కానీ ఆమె మాటలు ఎవరికీ వినబడవు.


మనోహరి : నీకు, నాకు ఆ అవసరం లేదు మరి ఆ మిస్సమ్మకి ఎలాంటి అవసరం ఉందో ఎవరికి తెలుసు అంటుంది.


నీల: పొద్దున్న నుంచి మిస్సమ్మ ఇంట్లో కనిపించడం లేదు అంటుంది.


మనోహరి : ఇంకేముంది తనే ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది అంటుంది.


ఆ మాటలకి కంగారుపడిన అరుంధతి మిస్సమ్మ అలాంటిది కాదు నేను ఇక్కడ ఎంత మాట్లాడినా లాభం లేదు గుప్తా గారి దగ్గరికి వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. 


అమర్: నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషి గురించి అలా మాట్లాడొద్దు అంటూ మిస్సమ్మ కి ఫోన్ చేయమని రాథోడ్ కి చెప్తాడు. రాథోడ్ మిస్సమ్మ కి ఫోన్ చేస్తే ఫోన్ సౌండ్ ఇంట్లోంచి వస్తుంది. మిస్సమ్మ ఫోన్ ఇంట్లోనే వదిలేసినట్లుంది అంటుంది నీల.


మరోవైపు చిత్రగుప్తుడు దగ్గరికి వచ్చిన అరుంధతి లోపల జరిగిందంతా చెప్తుంది.


చిత్రగుప్తుడు: ఆ అమ్మాయి అలాంటిది కాదు కదా మరి ఆ డబ్బు తీయవలసిన అవసరం ఎవరికి వచ్చింది అని అంటాడు. ఆలోచనలో పడుతుంది అరుంధతి అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read: ముందే ఫిక్స్ అయ్యా, చివరి సినిమా ఇదే కావచ్చు - మహేశ్ బాబు