Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అరుంధతిని చంపించిన వాళ్ళు హంతకుల్ని తప్పించేలా చేశారు అంటాడు అమర్.


అరుంధతి: నన్ను ప్లాన్ చేసి చంపించే అంత కక్ష ఎవరికి ఉంది అని మనసులో అనుకుంటుంది.


ఆ తర్వాత హంతకుడు తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు.


హంతకుడు: ఆమె డబ్బుతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది, నేను అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సొంత ఫ్రెండ్ ని లేపేసింది నన్ను లేపటం ఎంతసేపు అంటాడు.


ఫ్రెండ్: అలా చెప్తే నువ్వు భయపడతావని చెప్పి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది చేయడం చెపితే ఆమెకి వేరే ఆప్షన్ లేదు ఎన్నాళ్ళని చిల్లర బతుకులు బతుకుతాము దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి అంటాడు.


అతని మాటలకి అగ్రీ అవుతాడు హంతకుడు. మరోవైపు నీరసంగా ఇంటికి వస్తాడు రామ్మూర్తి. అప్పుడు అక్క తమ్ముళ్లు ఇద్దరు డ్రామా మొదలు పెడతారు.


కాళీ : వెళ్లేటప్పుడు అంత హుషారుగా వెళ్ళావు వచ్చేటప్పుడు ఎందుకు బావ ఇలా ఉన్నావు అని అడుగుతాడు.


మంగళ : నీ దిష్టే తగిలినట్టుగా ఉంది.


రామ్మూర్తి: నేను ఎంత స్వార్ధపరుడునో నాకు అర్థమైంది ఇన్నాళ్లు భాగీ కి మంచి ఉద్యోగం రావాలని ఆశపడ్డాను కానీ తనకి పెళ్లి చేయాలని ఆలోచన లేకుండా పోయింది. తన పెళ్లి గురించి బయట వాళ్ళు గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని బాధపడతాడు.


మంగళ: అవునండి మనం ఇన్నాళ్లు అసలు భాగి పెళ్లి గురించి ఆలోచించనేలేదు అయినా ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాము అంటుంది.


కాళీ : ఎంత డబ్బు అవుతుంది అక్క.


మంగళ: ఎంత లేదన్న 30 లక్షలు వరకు అవుతుంది. డబ్బు చేతిలో లేదు కదా అని ఏ ముసలాడికో రెండో పెళ్లాడికో ఇచ్చి పెళ్లి చేయలేము అంటుంది


కాళీ : వద్దక్క అవసరమైతే నా కిడ్నీ అమ్మయినా భాగీ కి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అంతేగాని ముసలాడికి, రెండో పెళ్ళాడికి చేయొద్దు అంటాడు


రామ్మూర్తి అతడిని వింతగా చూస్తాడు.


మంగళ: ఏంటయ్యా అలా చూస్తున్నావు వాడు ఇంతకుముందులా కాదు ఇప్పుడు మారిపోయాడు కావాలంటే చూడు పనికి కూడా వెళ్తున్నాడు అని బొబ్బలెక్కిన తమ్ముడు చేతుల్ని చూపిస్తుంది.


రామ్మూర్తి ఏమి మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు.


కాళీ : ఏంటి అక్క మనం ఇంత పెర్ఫార్మన్స్ చేసినా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు.


మంగళ: కూతురికి పెళ్లి చేయలేని నిస్సహాయత, ఏం పర్వాలేదు ఈ రోజు కాకపోతే రేపైనా మన దారిలోకి వస్తాడు అని తమ్ముడికి నచ్చ చెప్తుంది.


మరోవైపు అమర్ ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు.


మనోహరి : మిస్సమ్మని చూస్తూ నువ్వు అరుంధతి అక్క చెల్లెలు కావడం ఏంటి, తను చెల్లెలు అని తెలియక ముందే అరుంధతి చనిపోవటం ఏమిటి, తన పిల్లల్ని చూసుకోవడానికి నువ్వు రావటం ఏమిటి. ఎక్కడ నేను ఉండవలసిన ప్లేస్ లో నువ్వు వచ్చేస్తావేమో అని భయంగా ఉంది అని మనసులో అనుకుంటుంది.


మరోవైపు పిల్లలు తనతో ఏదో చెప్పటానికి సంకోచిస్తున్నారని గ్రహించిన అమర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అంటాడు.


అంజు : అమ్ము ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది అని అక్క మీద తోసేస్తుంది.


అమ్ము : కంగారుపడుతూ నేను వద్దనే చెప్పాను కానీ మంజు ఏ పేరు ఇచ్చేసింది.


అమర్: పాటిస్పేట్ చేయడంలో తప్పులేదు అలా చేయటం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోని చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు.


మనోహరి : అసలే చాలా సిలబస్ మిస్ అయిన తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అవి అవసరమా అంటుంది.


అంజు: మా డాడీ ఒప్పుకున్నారు అయినా మధ్యలో మీరు ఎందుకు దూరుతారు, మీకు అవసరమా అంటుంది.


ఆ మాటలకి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా మాట్లాడకూడదు అంటూ అంజూని మందలిస్తాడు అమర్. తర్వాత మనోహరి తో చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అప్పుడే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి అని చెప్తాడు.


అమర్ తల్లిదండ్రులు : కోడలు పిల్లకి కూడా ఇలాంటివి అంటే చాలా ఇష్టం తను చదువుకునేటప్పుడు క్లాస్ కి లీడర్ గా ఉండేదాన్ని అని చెప్పింది.


అంజు : అమ్మకి అన్ని నా పోలికలే అంటుంది


రాథోడ్: అమ్మగారు చాలా మంచివారు అంజు పాపా దయచేసి మీతో పోల్చుకోకండి అనటంతో అందరూ సరదాగా నవ్వుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.