Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నువ్వు మంచం మీద పడుకో నేను సోఫాలో పడుకుంటాను అని పిల్లో తీసుకొని సోఫాలో పడుకుంటాడు అమర్. ఇదంతా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది అరుంధతి.


చిత్రగుప్తుడు: వెనుక నుంచి వచ్చి నీ భర్త మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు.


అరుంధతి: నా భర్త నిజంగానే శ్రీరామచంద్రుడు కానీ మిస్సమ్మ ఇబ్బంది పడుతుందేమో అని చూస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


చిత్రగుప్తుడు: ఒక రాత్రికి తను ఈ గదిలో ఉంటే ఇలా అయిపోతున్నావు.. రేపు శాశ్వతంగా తను ఈ గదిలోనే ఉంటుంది.. అప్పుడు ఏమైపోతావో ఏమో అని అనుకుంటాడు.


ఆ తర్వాత పూజ చేస్తూ ఉన్న ఘోరకి ఏకాగ్రత కుదరదు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడుగుతాడు.


ఘోర : నేను ఆత్మని బంధించలేకపోతున్నాను.. ఏదో శక్తి నన్ను అడ్డుకుంటుంది.. ఓడిపోతానేమో అనిపిస్తుంది అంటాడు.


స్వామి: చాలామంది ఆత్మను బంధించే శక్తులు వశం చేసుకోవాలనుకున్నారు కానీ మధ్యలోనే ప్రయత్నాన్ని ఆపేశారు కానీ నువ్వు మాత్రం ఈ పని పూర్తి చేస్తావ్ అనుకున్నాను ఎందుకు అంటే నీకు ఉన్న పట్టుదల అలాంటిది. మరి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.


ఘోర : ఇప్పటికీ మూడుసార్లు ప్రయత్నించాను కానీ ఆత్మని బంధించలేకపోయాను అంటాడు.


స్వామి: వెనకడుగు వెయ్యొద్దు నీ కార్యం సిద్ధించే సమయం దగ్గర పడింది.. నీకు ఇద్దరు మానవులు సాయం చేస్తారు.


ఘోర : ఆనంద పడుతూ ఎవరు ఆ మానవులు ఆ ఆత్మకి కానివారా..


స్వామి: కాదు అయినవారు.


ఘోర : అంటే ఆత్మను ఆ ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తున్నారా అని ఆనందంగా నవ్వుకుంటాడు.


మరోవైపు ఒకే గదిలో పడుకున్న అమర్ మిస్సమ్మ ఇద్దరూ కలిసిపోయినట్లు కలకంటుంది మనోహర్. చెమటలు కక్కుకుంటూ, అలా జరగకూడదు అంటూ నిద్రలేస్తుంది.


నీల : నిద్రలేచి.. ఏమ్మా వాళ్ళిద్దరూ కలిసిపోయినట్లు కలగన్నారా అంటుంది.


మనోహరి: నీకెలా తెలుసు.


నీల: వాళ్ళిద్దరూ గదిలో ఉన్నారు కదమ్మా ఇంక మీకు నిద్ర ఏం పడుతుంది అంటుంది.


వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో చూడడం కోసం రూమ్ వెనుక నుంచి వెళ్లి చూస్తుంది మనోహరి. ఒకరిని బెడ్ మీద ఒకరిని సోఫాలోని చూసి శాంతిస్తుంది.. రేపు కీ మేకర్ వస్తే సరే లేదంటే నేనే తలుపులు బద్దలు కొట్టేస్తాను అని కోపంగా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


నీల: ఇదేదో ఇప్పుడు సొంత భర్త అయినట్లు ఫీల్ అయిపోతుంది.. అనవసరంగా బంగారంలాంటి నిద్ర చెడగొట్టింది అని మనోహరిని తిట్టుకుంటుంది.


మరుసటి రోజు పొద్దున్నే నిద్ర లేచిన చిత్రగుప్తుడు ఈ బాలిక ఏమి చేస్తుందో అనుకొని అరుంధతిని వెతకడానికి వెళ్తాడు. అమర్ రూమ్ కిటికీ దగ్గరే ఉంటుంది అరుంధతి.


చిత్రగుప్తుడు: చూస్తుంటే రాత్రంతా ఇక్కడే ఉన్నట్టున్నావు.. ఎందుకు అంత బాధ అంటాడు.


అరుంధతి: మరి తాళాలు రఎక్కడ ఉన్నాయో రాథోడ్ కి చెప్పమంటే చెప్పడం లేదు కదా అంటుంది.


చిత్రగుప్తుడు : నువ్వు అంగుళీకము నాకు ఇచ్చి వేయవచ్చును కదా.. నాకు అంగుళీకం ఇస్తే నిన్ను మా లోకానికి తీసుకు వెళ్ళను నేను మాత్రమే వెళ్తాను నాకు మా తల్లిని చూడాలనిపిస్తుంది. అలాగే నిండుకుండ రత్తడికి తాళం ఎక్కడ ఉందో కూడా చెప్తాను అంటాడు.


సరే అని అంగుళీకము తీసుకురావడానికి వెళ్తుంది అరుంధతి. తన మాటలు అరుంధతి నమ్మినందుకు ఆనందపడతాడు చిత్రగుప్తుడు


మరోవైపు తనకి సపర్యలు చేస్తున్న భార్య బావమరిదిని చూసి ఆశ్చర్యపోతాడు రామ్మూర్తి.


రామ్మూర్తి : ఈరోజు ఏమైంది మీ ఇద్దరికీ, ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతాడు.


మంగళ: ఇన్నాళ్లు ఏదో దయ్యం పట్టింది అందుకే అలా ప్రవర్తించాము.. కానీ మా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు అందుకే ఇదంతా చేస్తున్నాము.


రామ్మూర్తి : నిజంగా మీలో మార్పు వస్తే నాకంటే సంతోషించేవాడు ఎవడు ఉండడు అని అంటాడు.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 



Also Read: పరారీలో పల్లవి ప్రశాంత్ - క్లారిటీ ఇచ్చిన రైతు బిడ్డ