Nindu Noorella Savasam December 1st episode: ఈరోజు ఎపిసోడ్ లో వాచ్మెన్ రావటంతో అతనిని రిసీవ్ చేసుకోవటానికి ఇంట్లో అందరూ బయటికి వెళ్తారు. వాళ్లతో పాటు మిస్సమ్మ కూడా బయటికి వస్తుంటే నువ్వెందుకు పోయి పని చూసుకో అని ఆమెని మందలించి లోపలికి పంపించేస్తుంది మనోహరి.
కారు దిగిన వాచ్మెన్ ని పలకరించి, ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు అమర్.
వాచ్మెన్ : గేటు దగ్గర కాపలా కాచే వాచ్మెన్ ని గేటు వరకు వచ్చి ఆహ్వానిస్తున్నారంటే మీ సంస్కారానికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.
అమర్ తల్లి: మీ మంచితనమే మిమ్మల్ని ఇంతవరకు తీసుకువచ్చింది అని చెప్పి అతనిని లోపలికి తీసుకు వెళ్తారు.
వాచ్మెన్ : మీకు ఒక చిన్న చెల్లి ఉందన్నారు కదా తనేది కనిపించడం లేదు అని అడుగుతాడు.
పిల్లలు: తనకి జ్వరం వచ్చి పడుకుంది.
వాచ్మెన్: మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆ పాపని చూస్తాను.
అమర్ పర్మిషన్ ఇవ్వడంతో పిల్లలతో పాటు వాచ్మెన్ అంజు దగ్గరికి వెళ్తాడు. అంజూని పలకరిస్తాడు, జ్వరం తగ్గిపోతుంది అని ధైర్యం చెప్తాడు.
పిల్లలు: అంజు కూడా మన స్కూల్లోనే చదవాల్సిందే కానీ రేపు రాయబోయే ఎగ్జామ్ జ్వరం కారణంగా రాయదు ఇక మన స్కూల్లో చేరనట్లే.
అంజు: నేను రేపు ఎగ్జామ్ రాస్తాను, ఆ స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకుంటానని అమ్మకి మాట ఇచ్చాను.
వాచ్మెన్ : మీ అందరికీ మీ అమ్మ మీద ఉన్న ప్రేమను చూస్తే చాలా ఆనందంగా ఉంది. తను మిమ్మల్ని ఎంత ప్రేమించకపోయి ఉంటే చనిపోయినా కూడా మీరు ఆమెని ప్రేమిస్తున్నారు. ఏం బాధపడకండి తన ప్రాణాలు మీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది.
అంజు: తను నా దగ్గరే ఉన్నట్లు ఉంది.. నిజం చెప్పాలంటే నా పక్కనే ఉన్నట్లుంది.
ఇదంతా చూస్తున్న అరుంధతి ఆయన పిల్లలతో మాట్లాడితే నాకు ఎందుకు ఆనందంగా అనిపిస్తుంది అనుకుంటుంది.
మరోవైపు ప్రతిసారి మిస్సమ్మ ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది, ఈసారి అలా జరగకూడదు అంటుంది మనోహరి.
నీల: ఈసారి మీరే వడ్డించి అందరి దగ్గర మార్కులు కొట్టేయండి.
మనోహరి: ఆ మిస్సమ్మ ఊరుకుంటుందా.. నేనున్నానంటూ అన్నిట్లోని దూరిపోతుంది.
నీల: మీ బుర్రకి పదును పెట్టి ఏదైనా ఆలోచించండి అని చెప్పటంతో మనోహరి ఒక ఆలోచన చెప్తుంది. సరే అంటూ మిస్సమ్మ దగ్గరికి వెళ్తుంది నీల.
నీల: మిస్సమ్మ దగ్గరికి వెళ్లి అమరేంద్ర అయ్యగారి రూమ్లో ట్యాప్ ఆన్ అయిపోయి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు.
మిస్సమ్మ నేను చూస్తాను అని చెప్పి అమర్ వాష్ రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు మనోహరి ఆ రూమ్ బయట నుంచి క్లోజ్ చేసేసి ఏమీ తెలియనట్లు బయటకు వచ్చేస్తుంది. టాప్ కట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ క్లోజ్ చేసి ఉంటుంది తలుపు తీయండి అంటూ మిస్సమ్మ తలుపు గట్టిగా కొడుతూ ఉంటుంది.
మరోవైపు కిందికి వస్తున్న వాచ్మెన్ పిల్లలతో ఆ గదిలోంచి ఏదో సౌండ్ వస్తుంది అంటాడు.
పిల్లలు: అది మా డాడీ రూమ్ అందులోకి ఎవరు వెళ్ళరు అని చెప్పడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు.
వాచ్మెన్ : ఇంట్లో వాళ్ళందరూ కుర్చీలో కూర్చోమనటంతో కుర్చీలో కూర్చొని పిల్లలకి ఇంత సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాను మీ దగ్గర నుంచే అని అర్థమైంది సార్.
అమర్ తండ్రి: మీరు పిల్లల్ని ఎంతగా ప్రేమించకపోతే వారు మిమ్మల్ని అంతగా ఇష్టపడతారు.
వాచ్మెన్ : నేను జీవితంలో చాలా కోల్పోయాను వాటిని వెతుక్కునే క్రమంలో ఈ పిల్లలు కనిపించారు.
అమర్ తల్లి: ఈ పిల్లలు మీతో కలవడం వెనుక కూడా ఏదో కారణం ఉండి ఉండవచ్చు మనకు తెలియదు అంతే.
అమర్ తండ్రి నీలని పిలుస్తాడు. నేను వడ్డిస్తాను అంటూ మనోహరి ముందుకు వస్తుంది.
అమర్ తండ్రి : నువ్వు వడ్డిస్తున్నావేంటి మిస్సమ్మ ఏది?
అమర్: అవును మిస్సమ్మ కనిపించడం లేదు ఏది?
మనోహరి : ఏమో అమర్ కనిపించడం లేదు బయటికి వెళ్లిందేమో అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.