Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రామ్మూర్తి అంజుతో మాట్లాడుతుంటే సూపర్వైజర్ వచ్చి అతనిని మందలిస్తాడు. రామ్మూర్తిని  వెనకేసుకొస్తాడు అమర్. వెళ్ళిపోతాను సార్ అని సూపర్వైజర్ కి చెప్పి అంజు కి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రామ్మూర్తి.

మిస్సమ్మ : అప్పుడే అక్కడికి వచ్చిన మిస్సమ్మ మంజు మొహానికి ఉన్న బొట్టు చూసి ఎవరో బొట్టు పెట్టినట్లుగా ఉన్నారు అంటుంది.

తాతయ్య పెట్టారు అంటారు పిల్లలు.

మిస్సమ్మ: నేను బొట్టు పెడదామని తెచ్చాను అంటుంది.

నువ్వు కూడా పెట్టు అంటారు పిల్లలు దాంతో మిస్సమ్మ అంజుకి బొట్టు పెడుతుంది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కంగారు పడకు నేను నీ పక్కనే ఉంటాను  అవసరమైతే పిలు అంటుంది.

ఇదంతా చూస్తున్న అరుంధతి పిల్లలకి, ఈ మిస్సమ్మకి ఆ పెద్దాయనకి ఏంటి సంబంధం వాళ్లకి ఈ పిల్లలు అంటే ఎందుకు అంత అభిమానం అనుకుంటుంది. ఇంతలో ఘోర అటువైపుగా వెళ్తూ వాసన చూసి స్కూల్లోకి రావడానికి ప్రయత్నిస్తాడు. అతనిని అడ్డుకుంటాడు రామ్మూర్తి.

ఘోర : లోపల నాకు కావలసింది ఉంది తీసుకొని పోతాను.

రామ్మూర్తి: నీ వేషం చూస్తే పిల్లలు జడుచుకుంటారు అయినా నీకు కావలసిన వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు అంటూ అతనిని బయటికి గెంటేస్తాడు. అయినా ఘోర లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. నేను ఉండగా లోపలికి రానివ్వను అని అతనిని తరిమేస్తాడు రామ్మూర్తి.

మరోవైపు ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేశాను ప్రిన్సిపల్ కి చూపిస్తాడు సార్.

ప్రిన్సిపల్ : వెరీ గుడ్ తీసుకొని రూమ్ కి పదండి అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు.

స్టాఫ్ రూమ్ లో ఉన్న అంజుని చూసి నిజంగానే ఒంట్లో బాగోలేనట్లుగా ఉంది అనుకుంటుంది ప్రిన్సిపల్. తర్వాత ఫామ్ ఫీల్ చేసి సంతకాలు పెట్టమంటుంది. అమర్ అంజు సైన్ చేసిన తర్వాత మదర్ కూడా సైన్ చేయాలి అనడంతో మనోహరి సైన్ పెట్టాలనుకుంటుంది. కానీ

అంజు : నన్ను మోటివేట్ చేసింది ఎగ్జామ్ రాయటానికి ప్రిపేర్ చేసింది మిస్సమ్మ అందుకే సంతకం మిస్సమ్మ చేత పెట్టించాలనుకుంటున్నాను అనటంతో అవమాన పడుతూ కుళ్ళుకుంటూ అక్కడ నుంచి వెనక్కి వెళ్తుంది మనోహరి. మిస్సమ్మ సైన్ చేసిన తరువాత అంజూని తీసుకుని ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్తారు అందరూ.

అమర్ : అంజు దగ్గర కూర్చొని నువ్వు ఎగ్జామ్ రాయటం ఇంపార్టెంట్ కాదు నువ్వు ట్రై చేసావు అదే చాలు అయాం ప్రౌడ్ అఫ్ యు అంటాడు.

పిల్లలందరూ కూడా అంజుకి ధైర్యం చెప్తారు. ఇంతలో ఘోర అడ్డదారిలో గోడ దూకి స్కూల్లోకి ప్రవేశిస్తాడు. అరుంధతిని బంధించాలనుకుంటాడు. కానీ పక్కనే ఉన్న అమర్ వాళ్ళని చూసి భయంతో వెనకడుగు వేస్తాడు. టైం అవటంతో ఎగ్జామ్ హాల్ లోకి అంజుని తీసుకువెళ్తారు.

అంజు : మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించండి అని ప్రిన్సిపల్ కి చెప్తుంది.

ప్రిన్సిపల్ : ఎగ్జామ్ బాగా రాలేకపోయినా అడ్మిషన్ తీసుకోవడానికి ఇలాంటి కబుర్లు చెప్తున్నావా అని చిరాకు పడుతుంది. బెల్ అయ్యేలోపు ఎగ్జామ్ రాయాలి అని చెప్తుంది. సార్ ఎగ్జామ్ పేపర్ అంజు కి ఇస్తారు. కుటుంబ సభ్యులందరూ బయటనే టెన్షన్తో కిటికీలో నుంచి అంజూనే చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: బ్రహ్మముడి సీరియల్ - కావ్య చేతుల్లో కాలిపోయిన కల్యాణ్, అనామికల మొదటి శుభలేఖ!