Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమం లోపలికి వెళ్లాక భాగీకి వాళ్ల అక్క గుర్తుకు వస్తుంది. ఎమోషనల్ గా ఫీలవుతుంది. అమర్ వచ్చి ఏంటి ఇక్కడే నిలబడిపోయావు అని అడగ్గానే మా అక్క కూడా ఇలాంటి ఆశ్రమంలోనే ఉండేది కదా అని మా నాన్న ప్రాణాలన్నీ మా అక్క మీదేనని బాధపడుతుంది. దీంతో సరేలే మిస్సమ్మ లోపలికి వెళ్దాం పద అని తీసుకెళ్తాడు. దూరం నుంచి చూస్తున్న ఆరు కూడా బాధపడుతుంది. ఇంతలో గుప్త వస్తాడు. ఆరును వెళ్దాం పద అనగానే..
ఆరు: ఆగండి గుప్త గారు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడు ఈ ఆశ్రమం, ఈ గ్రౌండ్ ఇదే మా ప్రపంచం. నేను మనోహరి ఎంత ఆనందంగా ఉండేవాళ్లమో తెలుసా? ఆరోజులే బాగుండేది గుప్తగారు.
గుప్త: నీ తండ్రి గుండెలపై పెరగాల్సిన నువ్వు ఇట్ట అయిపోవడానికి కారంణం నీ నాయనమ్మ భయం. నీ పతిదేవునితో సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇటుల అవుటకు కారణం ఆ బాలిక స్వార్థం. నీకా భగవంతుడు అప్పుడు ఇప్పుడు అన్యాయం చేస్తూనే వచ్చాడు బాలిక
అని గుప్త మనసులో అనుకుంటాడు. మరోవైపు మనోహరి ఇరిటేటింగ్ గా ఆశ్రమంలోకి వెళ్లి ఒక దగ్గర కూర్చుని చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఈ ఆశ్రమం మారలేదు, ఈ మనుషులు మారలేదు, నా బ్రతుకు మారలేదు. కొన్నాళ్ల క్రితం మొదలైన నా పగ తీరలేదు. అని అరుంధతి, అమర్ లకు పెళ్లి అయిన రోజులు గుర్తు చేసుకుంటుంది. మరోవైపు రణవీర్ కూడా తాను ఫస్ట్ టైం మనోహరిని కలిసిన రోజులు గుర్తు చేసుకుని లాయర్ తో బాధపడుతుంటాడు. మనోహరిని ప్రేమించింది. పెళ్లి చేసుకున్నది గుర్తు చేసుకుంటాడు. మరోవైపు ఆశ్రమం లోపలికి వెళ్లిన అంజు ఒక దగ్గరకు వెళ్లి ఒంటరిగా కూర్చుంటుంది.
భాగీ: అయ్యో అంజు డల్లుగా వెళ్లి కూర్చుండి. వెళ్లి చూడండి..
అమర్: నేను చూస్తాను.. ఏమైంది నాన్నా..
అంజు: నాకెందుకో ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది డాడ్. మరి వాళ్లకు మమ్మీ డాడ్ ఇద్దరూ లేరు కదా ఎలా ఉంటున్నారు డాడ్. నేను చాలా లక్కీ డాడ్. వాళ్ల లాగా అనాథను కాదు. నాకు మీరు నాన్నమ్మ, తాతయ్య రాథోడ్ అందరూ ఉన్నారు.
అని అంజు బాధపడుతుంటే దూరం నుంచి చూస్తున్న ఆరు వెళ్లిపోతుంది.
భాగీ: ఆయనుక ఏమైంది రాథోడ్ అంజలి మాటలు వినగానే అలా అయిపోయారు.
రాథోడ్: ఏం లేదు మిస్సమ్మ అరుంధతి అమ్మా గుర్తొచ్చి ఉంటారు.
అమర్: డాడీ ఉండగా నువ్వు ఎప్పటికీ అనాథవు కాదు. నేనున్నానుగా ఎప్పటికీ నీ చేయి పట్టుకునే ఉంటాను పద..
అని చెప్పగానే అంజు హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు పక్కకు వెళ్లిన ఆరు, అంజు మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తుంది. గుప్త వచ్చి ఓదారుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నీ మనసులో ఏదో సందేహం ఉంది అది చెప్పుకుని నీ మనసును తేలిక చేసుకో అని అడగ్గానే ఏం లేదని ఆరు చెప్తుంది. దీంతో గుప్త నిజం చెప్తాడు. అంజు మీ కూతురు కాదన్న విషయం గుర్తుకు వచ్చిందా? అని అడగ్గానే ఆరు షాక్ అవుతుంది. అంజును ఎలా దత్తత తీసుకున్నది. తాను ఎవరి కూతురన్న రహస్యం గుప్తకు చెప్తుంది ఆరు. మరోవైపు తన కూతురు దుర్గ గురించి చెబుతూ ఏడుస్తుంటాడు రణవీర్ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వతో చాలెంజ్ చేసిన భూమి – చెర్రీని అనుమానించిన అపూర్వ