Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ పిక్నిక్‌  వెళ్లబోతుంటే మనోహరి ఆకాష్‌ను కింద పడేయబోయి.. తానే కింద పడిపోతుంది. దీంతో అమర్‌ పిక్నిక్‌ క్యాన్సిల్‌ చేసి మనోహరిని తీసుకుని హాస్పిటల్‌ కు వెళ్లబోతుంటే భాగీ, రాథోడ్‌ కు సైగ చేస్తుంది. దీంతో రాథోడ్‌ నేను మనోహరిని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తానని.. మీరంతా పిక్నిక్‌ కు వెళ్లండని చెప్తాడు. ఇదేంటి కథ అడ్డం తిరగింది. వీళ్లిద్దరిని కలవకుండా చేద్దామని అనుకుంటే ఇలా జరుగుతుందేంటి? అని మనసులో అనుకుని మెల్లగా లేచి మనోహరి ఇక నాకు బాగానే ఉందని హాస్పిటల్‌ కు ఎందుకని నేను కూడా మీతో పాటు పిక్నిక్‌ కు వస్తానని చెప్తుంది. దీంతో అమర్‌ సరే అని బయటకు వెళ్లిపోతాడు.


భాగీ: ఏంటీ మేమే బయటకు వెళ్లితే మా బంధం బలపడుతుందని భయపడుతున్నావా? అందుకే ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నావా? అయ్యో పిచ్చి మను. మా మధ్య బ్రహ్మముడి పడ్డప్పుడే మా బంధం బలపడిపోయింది. ఆయన ప్రేమకి నేను అర్హురాలినో కాదో నాకు తెలియదు. కానీ నువ్వింకో పది జన్మలు ఎత్తినా ఆయన నీడను కూడా తాకలేవు.


ఆరు: గుప్త గారు వాళ్లు బయటకు వెళ్లొద్దంటే ఆగడం లేదు. వెళితే ఏం జరుగుతుందో చెప్పమంటే మీరు చెప్పడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి.


అని ఆరు అడగ్గానే గుప్త మాయం అయిపోతాడు. షాక్‌ అయిన ఆరు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారుపడుతుంది. మరోవైపు లాయర్‌ తాగుతూ ఉంటాడు లాయర్ వచ్చి ఇంకా తాగుతూనే ఉంటావా? అని అడుగుతాడు. మనోహరి నీ జీవితంలో ముగిసిపోయిన చాప్టర్‌ అని చెప్తాడు. దీంతో లాయర్‌ గొంతు పట్టుకుని నేను మర్చిపోను అంటాడు. రూంలోకి తీసుకెళ్లి తన కూతురు ఫోటో చూపించి ఎమోషనల్‌ అవుతాడు.


లాయర్‌: ఏంటి రణవీర్‌ నీకు కూతురు ఉందా? నువ్వు ఇన్నాళ్ళుగా వెతుకుతుంది నీకు మనోహరికి పుట్టిన కూతురి కోసమా?


రణవీర్‌: అవును ఆ మనోహరి మనిషి కాదు. నా బిడ్డను నా నుంచి దూరం చేసిన రాక్షసి. అందుకే అది కనబడగానే చంపాలని చూశాను. కానీ నా కూతురుకు జన్మనిచ్చి అది ఆయుష్సు పోసుకుంది.  


 అంటూ ఏడుస్తూ తన కూతురును గుర్తు చేసుకుంటాడు రణవీర్‌. తన బిబ్బతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తాడు. దీంతో లాయర్‌ ఎమోషన్‌ అవుతాడు. మరోవైపు అందరూ కారులో పిక్నిక్‌ కు వెళ్తుంటారు. అంజు వెటకారంగా భాగీతో మాట్లాడుతుంది. వెనక కారులో మనోహరి, శివరాం, నిర్మల వస్తుంటారు. అందులో ఆరు కూర్చుని మనోహరిని తిడుతుంది. ఇంతలో కార్లు అమ్మ అనాథ శరణాలయం దగ్గర వచ్చి ఆగుతుంది.


శివరాం: అదేంటి అమర్‌ పిక్నిక్‌ అని ఇక్కడికి తీసుకొచ్చి ఆగావు.


అమర్‌: ఇది ఆరు, మనోహరి పెరిగిన ఆశ్రమం నాన్నా.. పిక్నిక్‌ కు వెళ్లకముందు ఎందుకో ఇక్కడికి ఒకసారి రావాలనిపించింది.


నిర్మల: మంచి పని చేశావు అమర్‌. పాపం ఆ పిల్లలను చూస్తుంటే మనసు ఎందుకో బాధగా ఉంది.


శివరాం: ఎలాగూ వచ్చాం కదా అమర్‌ వాళ్లకు  స్వీట్లు, చాక్లెట్స్‌ తీసుకొచ్చి ఉంటే బాగుండు.


అమర్: ఆల్‌రెడీ తీసుకొచ్చాను నాన్నా.. రాథోడ్‌.


రాథోడ్‌: అలాగే సార్‌.


 అని చెప్పి రాథోడ్‌ స్వీట్స్‌, ప్రూట్స్‌ తీసుకురావడానికి వెళ్తాడు. శివరాంను చూసి రాథోడ్‌ ఇక్కడికి వస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు కదా? అందుకే ఇలాంటిదేదో వస్తుందని కారులో ఒక ప్యాంటు తీసి పెట్టాను వేసుకోండని చెప్పగానే శివరాం వెళ్లి ప్యాంటు వేసుకుంటాడు. తర్వాత లోపలికి వెళ్లాక భాగీకి వాళ్ల అక్క గుర్తుకు వస్తుంది. ఎమోషనల్‌ గా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: రోడ్డు మీద డాన్స్ చేసిన భూమి – చెర్రీ చేతికి గాయం చూసి ఎమోషన్ అయిన గగన్