Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు రూంలోకి వెళ్లిన అమర్‌కు ఆరు రాసిన డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసుకుని చదువుతాడు అమర్. అమర్ డైరీ చదవడం ఆరు చూస్తుంది.
ఆరు: గుప్త గారు ఆయన నా డైరీ మొత్తం చదివేస్తున్నారు
గుప్త: చదవవలెనని విధి లిఖితం బాలిక
అమర్ ఒక పేజీ చదువుతూ షాక్ అవుతాడు.
ఆరు: ఏంటి గుప్త గారు ఆయన చదువుతూ షాక్ అయ్యారు.. ఆ పేజీలో ఏముంది
గుప్త: నువ్వు దిన చర్య రాసిన దానివి నీకు గుర్తు ఉండదా..?
ఆరు: అప్పుడేం రాశానో ఇప్పుడేం గుర్తుకు ఉంటుంది గుప్తగారు.. ఆ గుర్తుకు వచ్చింది. అప్పట్లో నాకు మనోహరి మీద వచ్చిన కొన్ని అనుమానాల గురించి డైరీలో రాసినట్టు గుర్తు కొంపదీసి ఆయన ఆ పేజీ చదివేశారా..?
గుప్త: ఆ పుటను మనోహరి ఏనాడో చించివేసినది. నువ్వు రాసిన దినచర్య నుంచి ఆ పత్రము ఏనాడో తొలగించబడినది
ఆరు: మరి ఆయన ఏం చదువుతున్నారు
గుప్త: ఇన్ని మార్లు మమ్మలను అడుగుట ఏల నువ్వే నీ పతి దేవుని దగ్గరకు వెళ్లి ఆ పత్రమును చదువుము
ఆరు అమర్ దగ్గరకు వెళ్తుంది. అమర్ డైరీ తీసుకుని బయటకు వెళ్తాడు.
ఆరు: చ ఆ పేజీలో ఏముందో చూడలేకపోయాను గుప్త గారు
గుప్త: చింతించకుము బాలిక మరి కాసేపట్లో నీకు ఆ పుటలో ఏముందో తెలియును
ఆరు: ఎలా తెలుస్తుంది..?
గుప్త: నీ పతిదేవుడు చెప్పెదడు..
ఆరు: ఏం చెప్తారు..?
గప్త: నీవు గతంలో చేసిన నిర్వాకములన్నీయూ చెప్పును..
ఆరు: అంతగా నేనేం చేశాను..
గుప్త: నీవే ఆలకించుము పద బాలిక
అని ఇద్దరూ బయటికి వెళ్తారు. గార్డెన్ నిల్చుని చూస్తుంటారు. ఇంతలో భాగీ వస్తుంది.
ఆరు: గుప్త గారు నా చెల్లి వచ్చేసింది.. తనకు నిజం తెలిసిపోయినట్టు ఉంది.
గుప్త: నీ స్నేహితురాలు కూడా వచ్చింది బాలిక
భాగీ, రాథోడ్ లోపలికి వెళ్తారు.. వెనకే మనోహరి వెళ్తుంది.
భాగీ: ఏవండి నేను మీకు ఒక విషయం చెప్పాలి
అమర్: కాస్త ఆగు భాగీ
మనోహరి భయపడుతుంది.
ఆరు: గుప్త గారు ఇప్పుడు ఆయన చేతిలో దానికి ఉంటుంది. నన్ను చంపినందుకు దాన్ని రెండు చెంపలు వాయించి బయటకు పంపిస్తారు. పోలీసులను పిలిచి జైలుకు పంపిస్తారు. అది జీవితాంతం జైలులో ఉండిపోతుంది. రండి రండి చూద్దాం
రాథోడ్: సార్ మిస్సమ్మ చెప్పేది త్వరగా వినండి సార్
అమర్: నేనే మీకో విషయం చెప్పాలి. అదేంటంటే మనోహరి గురించి..
భాగీ: నేను చెప్పాలనుకుంటుంది కూడా తన గురించే అండి..
అమర్: ముందు నన్ను చెప్పనివ్వు
రాథోడ్: సార్ సార్ మిస్సమ్మ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ సార్
అమర్: నేను చెప్పేది కూడా ఇంపార్టేంటే..
ఆరు: ఆయన ఇప్పుడు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు గుప్త గారు.
గుప్త: నువ్వు దినచర్యలో లిఖించిన విషయం
అమర్: మనోహరి ఇలా రా.. ( మనోహరి దగ్గరకు వెళ్తుంది.) ఇదేంటో తెలుసా..? ఇది అరుంధతి డైరీ.. ఇందులో అరుంధతి ఏం రాసిందో తెలుసా..? నీకు సంబంధించిన విషయం ఒకటి రాసింది… ఇది ఇవాళ నాకు కనిపించింది. ఈ విషయం నీకు తెలియాలని బయటకు తీసుకొచ్చాను..
అని అమర్ చెప్తాడు. మనోహరి భయంతో వణికిపోతుంది. తర్వాత అమర్, భాగీ రూంలో నిద్రపోతుంటే.. సడెన్ గా భాగీకి మెలుకువ వస్తుంది. దెయ్యం పట్టిన వ్యక్తిలా లేచి ఆరు రూంలోకి వెళ్తుంది. అక్కడ ఆరు ఫోటో చూసి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!