Nindu Noorella Saavasam Serial Today Episode:  రాథోడ్‌, అమర్‌ కారులో వెళ్తుంటారు. అమర్‌ డల్లుగా ఉండటాన్ని చూసిన రాథోడ్‌ ఏమైంది సార్‌ అని అడుగుతాడు. అంజు తల్లిదండ్రుల గురించి కనుక్కోవాలి అని అమర్‌ చెప్పగానే రాథోడ్‌ షాకింగ్‌ గా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు సార్‌. కోరి మీరు సమస్యను తెచ్చుకుంటుంన్నారేమో అనిపిస్తుంది. అంజు పాప తట్టుకోలేదు అంటూ చెప్తాడు రాథోడ్‌. ఇంతలో రోడ్డు పక్కన మనోహరి కారు చూస్తాడు అమర్‌. మనోహరి ఘోర దగ్గర పూజలో ఉంటుంది. అమర్, మనోహరికి ఫోన్‌ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు.


మనోహరి: నేను నా ఫ్రెండును కలవడానికి కాఫీ షాపుకు వచ్చాను. ఎందుకు అమర్‌.


అమర్‌: ఏం లేదు ఊరికే అడిగాను. సరే బాయ్‌.


ఘోర: ఏమైంది మనోహరి సమస్య ఏంటి ఎందుకు సతమతమవుతున్నావు.


మనోహరి: అమర్‌ సడెన్‌ గా కాల్‌ చేసి ఎక్కడ ఉన్నావని అడిగాడు. ఎప్పుడూ ఇలా అడగలేదు. తెలుసుకోవడానికి అడిగాడో.. కనుక్కోవడానికి అడిగాడో నాకు అర్థం కావడం లేదు ఘోర.


ఘోర: తెలుసుకోవడానికి అడిగాడేమో..?


మనోహరి: లేదు ఘోర ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అమర్‌ గురించి నాకు బాగా తెలుసు. కచ్చితంగా తెలుసుకోవడానికైతే కాదు. నేను ఎక్కడున్నానో తనకు ఎలా తెలుస్తుంది. నేను ఇక్కడకు వస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు కదా?


అమర్: మనోహరి కారు ఇక్కడ ఉంది. తనేమో ఫ్రెండును కలవడానికి కేఫ్‌ కు వెళ్లానని చెప్పింది. కారు ఇక్కడ పెట్టి వెళ్లిందా? లేదా అబద్దం చెప్తుందా?


రాథోడ్‌: డౌటుగా ఉండటమెందుకు సార్‌. లోపలికి వెళ్లి చూస్తే సరిపోతుంది కదా?


 అంటూ కారు దిగి రాథోడ్‌ ఇంట్లోకి వెళ్తుంటాడు. లోపల ఘోర మనోహరికి తాయెత్తు కడతాడు.  ఇంతల రాథోడ్‌ కు అమర్‌ ఫోన్‌ చేసి రమ్మని పిలుస్తాడు. రాథోడ్‌ ఫోన్‌ సౌండ్‌ విని బయటకు వచ్చి చూస్తారు ఘోర, మనోహరి. రాథోడ్‌, అమర్‌ వెళ్లిపోతారు. మరోవైపు పిల్లలు గార్డెన్‌ ఆడుకుంటుంటారు. ఆరు చూసి హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత అంజు కన్నవాళ్ల గురించి నిజం నీకు తెలిసిన రోజు నువ్వు తట్టుకుని నిలబడాలని దేవుడిని కోరుకుంటున్నాను అనుకుంటుంది.


గుప్త: బాలికా నీ పిల్ల పిచ్చుకలు ఎప్పుడూ ఇలా ఆటలు ఆడటమేనా? చదువు మీద ధ్యాస పెడతారా?


ఆరు: అంతటి ఆనందాన్ని, నిలువెత్తు బంగారాన్ని ఎలా వదులుకోవాలనుకున్నారు. అంజు లేని జీవితం ఊహించుకోవడమే బాధగా ఉంది. ఎవరూ మోసం చేసినా తట్టుకోగలం కానీ కన్నతల్లి మోసం చేసిందంటేనే తట్టుకోలేం.



 అంటూ ఆరు ఎమోషనల్‌ అవుతుంది. అంజలి కన్నవాళ్లను కనిపెట్టమని నేను డైరీలో రాశాను. మా ఆయన చదివారు. ఆయన కచ్చితంగా కనిపెడతారు అంటుంది ఆరు. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు గుప్త. అయితే నీకు నిజం తెలుసు కదా గుప్త గారు ఎవరో చెప్పండి అని అడుగుతుంది. దీంతో గుప్త నిజం తెలిసే టైం వచ్చినప్పుడే తెలుస్తుందని చెప్తాడు గుప్త. మరోవైపు రణవీర్‌ తన ఆస్తులు కాపాడుకోవడానికి కోర్టులో పిటిషన్‌ వేయాలని లాయర్‌ కు చెప్తాడు. మా నాన్న దుర్గ పేరు మీద కోట్ల ఆస్థులు రాశారు. దుర్గను కోర్టుకు తీసుకెళ్లి నా ఆస్థిని కాపాడుకోవాలి అంటాడు రణవీర్‌. మరోవైపు పిల్లలు గేమ్‌ ఆడుతుంటే మనోహరి వచ్చి బాల్‌ పట్టుకుంటుంది. ఘోర చెప్పినట్టు ఆత్మ ఉన్న దగ్గర చెట్లు ఊగుతుంటాయి. గాలి  వీస్తుంది అని చప్పింది గుర్తు చేసుకుని గేటు పక్కన చూస్తుంది. పిల్లలను లోపలికి పంపించి ఆరు ఆత్మ దగ్గరకు వెళ్తుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!