Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో జరిగే గణపతి పూజకు రెడీ అయిన భాగీని చూసి రాథోడ్‌ మెచ్చుకుంటాడు. చాలా అందంగా రెడీ అయ్యావు అంటాడు. అసలు నువ్వు నువ్వేనా అని అనుమానంగా అడుగుతాడు.


భాగీ:  రాథోడ్‌ నీకెందుకు అనుమానం వచ్చింది.


రాథోడ్‌: అసలు పండగంతా నీ దగ్గరే ఉంది మిస్సమ్మ


భాగీ: పో రాథోడ్‌ నన్ను ఆట పట్టించకు..


రాథోడ్‌: నిజం చెప్తున్నాను మిస్సమ్మ ఈరోజు నువ్వు స్పెషల్‌గా కనిపిస్తున్నావు.


భాగీ: అయితే ఆ స్పెషల్‌కు కారణం ఈ శారీనే రాథోడ్‌.


రాథోడ్‌: అవును మిస్సమ్మ శారీ వల్ల నీకు అందం వచ్చిందో.. నీ వల్ల శారీకి అందం వచ్చిందో తెలియదు కానీ భలే ముద్దుగా ఉన్నావు.


భాగీ: రాథోడ్‌ ఈ శారీ ఆయన సెలెక్షనే..


రాథోడ్‌: నేను ముందే అనుకున్నా ఈ కలరు మా సారు ఫేవరెట్‌ కలరు అని


భాగీ: అయితే ఈరోజు నుంచి నా ఫెవరెట్‌ కలరు కూడా


రాథోడ్‌: ఏంటి మిస్సమ్మ మా సారును నీలోకి లాగేసుకుంటున్నావా..? లేదా సారే నీలో కలిసిపోతున్నారా..? అర్తం అయిపోయిందిలే.. సారు నువ్వు సగం సగం కాబోతున్నారన్న మాట. అర్థనారీశ్వరులు అన్నమాట


భాగీ: పో రాథోడ్‌ నువ్వు నాకు దిష్టి పెట్టకు.. నువ్వు దిష్టి పెట్టిన ప్రతిసారి నేను ఆయన్ని దిష్టి తీయమని అడగలేను


రాథోడ్‌: ఊరుకో మిస్సమ్మ నువ్వు ఎన్ని సార్లు దిష్టి తీయమన్నా మా సారు తీస్తారు అంతే.. అయ్యో నిన్ను పొగడటంలో మునిగి దేవుడి సామాన్లు తెచ్చిందే చెప్పడం మర్చిపోయాను చూద్దాం పద


అనగానే పద వెళ్దాం అని భాగీ, రాథోడ్‌ వెళ్లిపోతారు. వాళ్లను వెనక నుంచి గమనిస్తారు చిత్ర, మనోహరి. వాళ్లు వెళ్లిపోయాక


చిత్ర: అయిపోయింది మను నువ్వు బ్యాగ్‌ సర్దుకుని వెళ్లిపోవడం బెటర్‌


మను: ఎక్కడికి వెళ్లిపోవాలే


చిత్ర: కోల్‌కతాకు.. మను ఇక్కడుండి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. బావగారు నీకు ఎప్పటికీ దక్కరని పూర్తిగా భాగీ సొంతం కాబోతున్నారని అర్థం అవుతుంది కదా..? ఏంటి మను నీకు ఇంకా అర్థం కాలేదా..?


మను: ఆ మాట ఇంకొక్కసారి అన్నావంటే.. నిన్ను చంపేస్తాను.


చిత్ర: ఉన్నమాటే కదా మను అంటుంది. నిజాన్ని యాక్సెప్ట్‌ చేయాలి


మను: ఏంటే నిజం నేను ఇన్నాళ్లు ఎదురుచూసింది..


చిత్ర: మను నువ్వు ఇక ఎన్నాళ్లు వెయిట్‌ చేసినా నీ వయసు అయిపోతుంది తప్పా ప్రయోజనం లేదు. మను హాయిగా నువ్వు కొల్‌కతా వెళ్లి రణవీర్‌తో నీ కూతురును వెతుక్కో.. నీ టైం సేవ్‌ అయిపోతుంది.


మను: నీ కోసం నేను ఎంత రిస్క్‌  చేశానే..  చివరికి నాతోనే నువ్వు ఈ మాట అంటున్నావా..?


చిత్ర: నేను కూడా నీకు హెల్ప్‌ చేశాను మను. బట్‌ నో యూజ్‌ కదా..? ఇంకెన్నాళ్లని వాళ్లను చూసి కుళ్లుకుంటావు మను. ఎంచక్కా కోల్‌కతా వెళ్లి..


అని చిత్ర  చెప్తుంటే.. మనోహరి కోపంగా చిత్ర గొంతు నులిమి చంపేస్తాను అంటూ బెదిరిస్తుంది.


మను: ఇంకొక్కసారి నీ నోటి వెంట రణవీర్‌, కోల్‌కతా. నా లైఫ్‌ అనే పదాలు వచ్చాయో.? నీకే లైఫ్‌ లేకుండా చేస్తాను.


చిత్ర: మను వదులు మను..నీ వల్లే ఈ ఇంటికి కోడలు అయ్యాను. వినోద్‌కు భార్యను అయ్యాను. ఇప్పుడిప్పుడే ఒక షాపింగ్‌ మాల్‌కు ఓనరు అయ్యాను. ఫ్లీజ్‌ మను ఫ్లీజ్‌ నా డ్రీమ్స్‌ అన్ని ఒక్కోక్కటిగా ఫుల్‌ఫిల్‌ చేసుకుంటున్నాను నన్ను వదులు మను..


మను: ఏయ్‌ అవన్నీ పేకమేడలే నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో వాటినంతటినీ కూల్చేయగలను.. నిన్ను మళ్ళీ రోడ్డు మీదకు తీసుకురాగలను..


అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. చిత్ర భయంతో వద్దు మను ఫ్లీజ్‌ నన్ను వదలు అంటుంది. మనోహరి చిత్రను వదిలేసి బయటకు వెళ్తుంది. తర్వాత గణపతి పూజ స్టార్ట్‌ చేస్తారు. రణవీర్‌ ఇంట్లో చంభా కూడా పూజ చేసి  ఆరును బంధించేందుకు కాలాను పంపిస్తుంది. కాలా వెళ్లి ఆరును బంధిస్తుంటే.. వినాయకుడు వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!