Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆస్థికలు గురించి జరగబోయే అనర్థాల గురించి ఆరు పునర్‌జన్మ గురించి అమర్ వాళ్లు చెప్పి వెళ్లిపోతాడు స్వామిజీ వేషంలో ఉన్న గుప్త. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు.
భాగీ: ఎవరండి ఈయన అక్క ఆస్థికలు గంగలో కలపమని చెప్తున్నాడు
అమర్: అరుంధతి మంచి కోసం అని చెప్పాడు కదా..? తను మళ్లీ పుట్టాలి. రాథోడ్ ఆస్థికలు నిమజ్జనం చేద్దాం ఆ ఏర్పాట్లు చూడు
రాథోడ్: అలాగే సార్
అని ఏర్పట్లు చేయడానికి వెళ్తాడు. అంతా చూస్తున్న ఆరు ఏడుస్తుంది. తర్వాత బయటి నుంచి వచ్చిన రాథోడ్, భాగీ దగ్గరకు వెళ్తాడు.
రాథోడ్: ఇతకీ సారుకు అసలు విషయం చెప్పావా లేదా
భాగీ: ఏం విషయం రాథోడ్
రాథోడ్: రణవీర్ వైఫ్ మనోహరి అన్న విషయం చెప్పావా లేదా..?
భాగీ: అది ఇంకా కన్ఫం కాలేదు కదా
రాథోడ్: కానీ మనోహరి బ్లడ్ అంజుకు మ్యాచ్ అయింది కదా..?
భాగీ: ఆ బ్లడ్ గ్రూప్ ఎవ్వరికైనా ఉండొచ్చు
రాథోడ్: ముందు నుంచి మనం డౌటు పడుతూనే ఉన్నాము కదా మిస్సమ్మ.. రణవీర్ వైఫ్.. అంజు పాప మథర్ మనోహరే అనటానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి.
భాగీ: ఆ సాక్ష్యం చెప్పాల్సింది సరస్వతి మేడం.. ఆవిడేమో మళ్లీ కనిపించకుండా పోయారు. ఎప్పుడు దొరుకుతారో ఏమో..
రాథోడ్: ఆవిడ కోసం వెయిట్ చేయడం వేస్ట్ మిస్సమ్మ.. మన మనసుల్లో డౌట్స్ సారుకు చెబితే.. ముందు మనోహరిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు.
భాగీ: ఆయన ఆ పని చేయరు చేయకూడదు కూడా
రాథోడ్: ఎందుకు మిస్సమ్మ
భాగీ: ఆయన అరుంధతి అక్కకు మాటిచ్చారు. ఈ విషయం ఆయనే నాతో స్వయంగా చెప్పారు. అందుకే మనోహరిని పంపించమని నేను ఆయనతో చెప్పలేను
రాథోడ్: అందుకని అరుందతి మేడంను చంపిన హంతకురాలిని.. కన్నబిడ్డను పురిటిలోనే వదిలించుకున్న కసాయిదాన్ని అలాగే వదిలేస్తావా మిస్సమ్మ.. తనకు శిక్ష పడేలా చేయవా..?
భాగీ: కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది రాథోడ్. మనోహరి దుర్మార్గాల గురించి ఆయనతో చెబితే వెంటనే తనను ఇంట్లోంచి పంపించేస్తారు. కానీ అక్కకు ఆయన ఇచ్చిన మాట పోతుంది.
రాథోడ్: కానీ తను నీ స్థానాన్ని ఆశిస్తుంది మిస్సమ్మ దాని కోసం తను ఎంత కైనా తెగిస్తుంది.
భాగీ: తెలుసు రాథోడ్.. తన వల్ల నాకు ప్రమాదం ఉందని తెలుసు.. తనన బయటకు పంపిస్తే.. ఆ ప్రమాదం ఆయనకో పిల్లలకో జరిగే అవకాశం ఉంది. మనోహరి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఆయన ఎప్పటికీ దక్కడనే కోపంతో మనోహరి దేనికైనా తెగించవచ్చు. నాకు ఏమైనా పర్వాలేదు రాథోడ్. కానీ ఆయనకు కానీ పిల్లలకు కానీ ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అందుకే ఓపిక పడుతున్నాను.. మంచిగా మారడానికి ఆ మనోహరికి అవకాశం ఇస్తున్నాను.. తను మారకపోతే కాలమే తనకు బుద్ది చెప్తుంది.
రాథోడ్: నీ మంచితనమే మనోహరికి బలమైంది మిస్సమ్మ.. మీరన్నట్టు దేవుడే తనను శిక్షించాలి.
అని ఎమోషనల్ గా రాథోడ్ అక్కడి నుంచి వెళ్లపోతాడు. తర్వాత మేజర్ ఇంట్లో పార్టీ కోసం భాగీని తీసుకుని వెళ్తాడు అమర్. వాళ్లిద్దరూ కలసి వెళ్లడం చూసిన మనోహరి తట్టుకోలేకపోతుంది. కోపంతో పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. తర్వాత నాగుకు ఫోన్ చేసి భాగీని చంపేయమని డబ్బులు సెండ్ చేస్తుంది. అలాగే భాగీ ఫోటో సెండ్ చేసి తను మేజర్ ఇంట్లో పార్టీకి వెళ్లిందని చెప్తుంది. నాగు తన మనుషులతో మేజర్ ఇంటికి బయలుదేరుతాడు. అటు పార్టీలో ఉన్న భాగీ పుల్లుగా మందు కొట్టి డాన్స్ చేస్తుంది. అమర్ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!