Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు అనుమానంతో నేను బాల్‌ ఎలా పట్టుకోగలిగాను అని గుప్తను అడుగుతుంది. నేను ఎలా చెప్పగలను అంటూ మీ మానవులకు అన్ని అనుమానాలే అంటూ తిడుతూ వెళ్తాడు. గుప్తను చూస్తుంటే ఏదో తేడాగా ఉందని విషయం ఏంటో నేనే కనిపెడతానంటూ ఆలోచిస్తుంది ఆరు. మరోవైపు వాటర్‌ తాగుతున్న మనోహరి దగ్గరకు అంజు అమ్మా అంటూ వచ్చి పిలుస్తుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. అంజును చూస్తూ ఫ్రీజ్‌ అయిపోతుంది.  తన కూతురు పుట్టినప్పుడు. తాను ఆశ్రమంలో వదిలేసి వెళ్లినప్పటి విషయాలు గుర్తు చేసుకుంటుంది.


మనోహరి: ఏం మాట్లాడుతున్నావు అంజు.


అంజు: ఏంటమ్మా అలా చూస్తున్నావు. నేను నీ కూతురినే కదా? నేను అమ్మా అనకూడదా?


మనోహరి: కానీ నన్నెందుకు అమ్మా అంటున్నావు. చెప్పు అంజు నన్నెందుక అమ్మా అని పిలిచావు.


అంజు: మిమ్మల్ని ఎవరు అన్నారు ఆంటీ పక్కకు జరగండి.


అనగానే మనోహరి పక్కకు జరుగుతుంది. వెనకాలే భాగీ ఉంటుంది.


అంజు: నేను అంటున్నది మా అమ్మని.. కాదు నా మిస్సమ్మని


మనోహరి: కాదు అంజు ఇందాక అమ్మా అన్నది నన్నే కదా? అంటే ఆ అమ్మను అంటాను లేదంటే ఈ అమ్మను అంటాను. అమ్మా…


భాగీ: నేను అమ్మను ఏంటి? నేను మిస్సమ్మను కదా?


అంజు: చూశావా? మిస్సమ్మలోనే అమ్మా ఉంది.


  అని అంజు సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్పగానే భాగీ పడిపోతుంది. అంజును ముద్దాడుతుంది. ఇంతలో పిల్లలు వచ్చి పదాలు విడదీసి నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావా? అని అడుగుతారు. దీంతో నలుగురు పిల్లలు గొడవపడతారు. అమర్‌ రాగానే అందరూ కామ్‌ గా అయిపోతారు. అమర్‌ ఆఫీసుకు వెళ్లొస్తాను అని చెప్పి వెళ్తాడు. బయట బాల్‌ తో ఆడుకుంటున్న రాథోడ్‌ ఎన్ని సార్లు పడేసినా బాల్‌ మళ్లీ తిరిగి రాదు. దీంతో ఇరిటేటింగ్‌ అవుతుటాడు. మరోవైపు రామ్మూర్తి స్కూల్‌ లో ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్లి జాబ్‌ అడుగుతాడు.


ప్రిన్సిపాల్‌: ఏంటండి ఇది స్కూల్‌ అనుకుంటున్నారా? ధర్మసత్రం అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్లిపోతారు. ఏంటిది.


రామ్మూర్తి: ప్రిన్సిపాల్‌ గారు పోయిన సారి ఒంట్లో బాగాలేకనే కదండి రాలేకపోయింది.


ప్రిన్సిపాల్‌: ముసలి వాళ్లు అయితే ఇలాగే ఒంట్లో జబ్బులు ఉంటాయి. మీ లాగా వచ్చే వాళ్లు వందల మంది ఉన్నారు రామ్మూర్తి. మీ లాగా రోగిస్టి వాళ్లను తీసుకోవాల్సిన అవసరం నాకేంటి. అయినా డబ్బుల కోసం మోసం చేసి మరీ నీ కూతురుని అమరేంద్రకు భార్యను చేశావు కదా?


రామ్మూర్తి: ప్రిన్సిపాల్‌ గారు మీకున్నా హోదాకి, స్థాయికి మీ నోటి నుంచి రావాల్సిన మాటలు కావు అవి. నేను మానవత్వం ఉన్నవాణ్ని . ఇప్పటికే నేను ఆయనకు చాలా రుణపడిపోయాను. అందుకే నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పని చేద్దామని అనుకుంటున్నాను.


   అని రామ్మూర్తి వేడుకుంటే  ప్రిన్సిపాల్‌ సరేనని మరోసారి చెప్పకుండా మానేస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంటాడు. నేను మళ్లీ ఇక్కడ పనిలో చేరినట్టు నా కూతురుకు కానీ అమరేద్ర బాబుకు కానీ చెప్పకండి అనగానే ప్రిన్సిపాల్‌ సరే అంటుంది. రామ్మూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే  భాగీ పిల్లల్ని తీసుకుని స్కూల్‌ కు వస్తుంది. భాగీని చూసిన రామ్మూర్తి గోడ చాటుకు వెళ్లి దాక్కుంటాడు. అయినా రామ్మూర్తిని చూసిన భాగీ నాన్నా అని పిలుస్తుంది. పిల్లలు తాతయ్యా మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. పిల్లల్ని చూడటానికి వచ్చాను అంటాడు. ఇంటికి రావొచ్చు కదా అని అడగ్గానే నేను అక్కడికి వస్తే మీరు నన్ను మొహమాట పెడతారని చెప్తాడు రామ్మూర్తి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!