Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ రామ్మూర్తితో మాట్లాడుతూ ఎమోషనల్‌ అవుతూ వెంటనే అమర్‌ ను హగ్‌ చేసుకుంటుంది. ఆరు షాక్‌ అవుతుంది. ఏడుస్తూ భాగీ వైపు కోపంగా చూస్తుంది. పక్కనే ఉన్న రాథోడ్‌ ను కొడుతుంది. రాథోడ్‌ అటూఇటూ చూస్తాడు ఎవ్వరూ కనిపించరు.

గుప్త: వీక్షించకూడనివి వీక్షించినచో మనోవేదనకు గురి అయ్యెదవు రమ్ము. వెళదాం.

రాథోడ్‌: అమ్మో పిల్లలు వచ్చే టైం అయింది. ( భాగీ దగ్గరకు వెళ్లి) మిస్సమ్మ పిల్లలు వచ్చే టైం అయింది. బాగోదు.

 అనగానే అమర్‌, మిస్సమ్మకు దూరం జరుగుతాడు. మిస్సమ్మ సిగ్గుపడుతుంది.

అమర్‌: నేను బయటకు వెళ్లి వస్తాను.

కరుణ: ఓ పోరి అటు కాదు ఇటు

అనగానే బయటకు వెళ్తున్న మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. మరోవైపు ఘోర ఏవో పూజలు చేస్తుంటాడు. మనోహరి ఇంటికి వచ్చి గార్డెన్‌ లోకి చూస్తూ కోపంగా తిడుతుంది.

మనోహరి: ఎందుకే.. ఎందుకు చిన్నప్పటి నుంచి దేవుడు ఎప్పుడూ నీ వైపే ఉంటున్నాడు. ఇద్దరం అనాథలం ఇద్దరి తలరాత ఒకటే అవ్వాలి కదా? నీ సంతోషంలోంచి పుట్టిన స్వార్థం ఆరు ఇంది. నీ సంతోషం పూర్తిగా నాశనం అయితే తప్ప నా స్వార్థం పోదు. శక్తులు వచ్చాయని ఆనంద పడుతున్నావు కదా? రేపటితో నీ ఆశల ఆవిరి చేస్తాను.

 అని చెప్పి లోపలికి వెళ్తుంది మనోహరి.

అంజు: ఆంటీ ఒక్కనిమిషం రేపు నా బర్తుడే కేక్‌ కటింగ్‌ ఉంటుంది మీరు  ఇంట్లోనే ఉండండి.

మనోహరి: ఏంటి రేపు నీ బర్తుడేనా..?

అంజు: అవును ఆంటీ..ఎందుకు అలా అడిగారు.

మనోహరి: ఏం లేదు ఊరికో.. అయితే దాన్ని మంత్రించిన పౌడర్‌ ముట్టుకునేలా చేయాలి.

 అని మనసులో అనుకుంటుంది మనోహరి. తర్వాత పిల్లలందరూ భయంగా అంజును కిందకు తీసుకెళ్తారు. ఇంట్లో కరెంట్‌ పోతుంది. అమ్ము కూడా అంజును వదిలేసి లోపలికి వెళ్లిపోతుంది. అంజు భయపడుతూ గట్టిగా అరుస్తుంది. ప్లీజ్‌ నన్ను కాపాడండి అంటూ ఏడుస్తుంది. ఇంతలో మెల్లగా లైట్స్‌ వస్తాయి. అంజుపై పూల వర్షం కురుస్తుంది. అంజు హ్యాపీగా ఫీలవుతుంది.  అందరూ ఒకేసారి వచ్చి అంజుకు బర్తుడే విషెష్‌ చెప్తారు.

అంజు: ఆపండి సర్‌ఫ్రైజ్‌ చేశారా? మీ క్రియేటివిటీ తగలేయా..

అమ్ము: మిస్సమ్మ.. డాడీ.. అమ్ము నన్ను కాపాడండి..

అంటూ అమ్ము వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో కోపంగా అంజు, అమ్ము మీదకు వెళ్తుంది.

శివరాం: అమ్మా ఆగు అంజు..

అంజు: నన్ను వదులు తాతయ్యా ఇవాళ వీళ్ల సంగతి చెప్తా..డాడ్‌ మీరు కూడా నవ్వుతున్నారా? అసలు మీరెలా ఒప్పుకున్నారు ఇదంతా..?

అమర్: నాదేం లేదు ఇదిగో ఇదంతా మిస్సమ్మ ప్లాన్‌.

అంజు: మిస్సమ్మ నిన్నూ..

 నిర్మల: సరదాకు చేసిందిలే ఇవాళకు వదిలేయ్‌..

అంజు: నేను వదలను ఇవాళ మిస్సమ్మ పని చెప్తాల్సిందే.

భాగీ: అమ్ము సింహం భయపడుతుందా?

అమ్ము: సింహం భయపడదు కానీ అంజు భయపడుతుంది.

ఆకాష్‌: అంజు బ్రేవరీ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ ఎప్పుడు వెళ్దాం.

అంటూ అందరూ న్వవుకుంటుంటే.. ఇక చాలు కేక్‌ కట్‌ చేద్దామని అంజును రెడీ కామని చెప్తాడు. అలాగేనని అంజు వెళ్లిపోతుంది. మరోవైపు మనోహరి టెన్షన్‌ పడుతుంది. ఏదో ఒకటి చేసి అమర్‌ కు నిజం చెప్పకుండా రణవీర్‌ ను ఆపాలని అనుకుంటుంది. ఇంతలో ఘోర కిటికి దగ్గరకు వచ్చి మనోహరిని పిలుస్తాడు. ఘోరను చూసిన మనోహరి మరింత టెన్షన్‌ పడుతుంది. అమర్‌ చూస్తే పరిస్థితేంటని భయపడుతుంది. అయితే ఈ ఒక్కరోజు నువ్వు తెగిస్తే మనం గెలుస్తాం అని చెప్తాడు. అయితే నువ్వు నా రూంలోనే ఉండు అని మనోహరి చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గౌరిని  సేవ్‌ చేసిన శంకర్‌ – వినయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు