Prema Entha Madhuram Serial Today Episode: పాండు వచ్చి కంగారు పడుతుంటే గౌరి మాత్రం ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి ఆగదు అంటుంది. ఇంతలో పాండు వచ్చి పంతులును పెళ్లి త్వరగా చేయమని చెప్తాడు. దీంతో తాళిబొట్టు లేకుండా పెళ్లి ఎలా చేయాలంటాడు. శంకరే తాళిబొట్టు దాచి ఉంటాడని గౌరి అనుమానిస్తుంది. పాండు కూడా నిజమే అయ్యుండొచ్చు అంటాడు. ఇంతలో అసలు తాళి బొట్టు తీసుకొస్తే కదండి ఎవరైనా దాచడానికి అంటూ పంతులు బాంబు పేలుస్తాడు. దీంతో బాబాయ్ మా ఆచారం ప్రకారం అబ్బాయి వాళ్లే తాళిబొట్టు తీసుకురావాలని ఆ విషయం అబ్బాయికి కూడా చెప్పాను అంటాడు. వినయ్ కూడా చెప్పారని కానీ మర్చిపోయానని అంటాడు.
శంకర్: తాళి బొట్టు మర్చిపోయారంట గౌరి గారు మీకు కాబోయే శ్రీవారు.
గౌరి: తాళి లేదని పెళ్లి ఆగిపోతుందని ఎవరూ ఆనంద పడక్కర్లేదు. బంగారంతో చేసిందే తాళి కాదు పసుపు దారానికి పసుపుకొమ్ము కట్టిన సరిపోతుంది. పంతులు గారు ఆ పసుపుకొమ్ముకు దారం కట్టిండి.
శంకర్: గౌరి గారు ఈ మధ్యన పాత సినిమాలు బాగా చూసినట్టున్నారు. పంతులు గారు పసుపుకొమ్ముకే మీరు ఇంత టైం తీసుకుంటున్నారు. మరి మూడు ముళ్లు వేయడానికి ఎంత టైం తీసుకుంటారు. మామయ్యగారు వంటొళ్లను అమలాపురం నుంచే పిలిపించారు కదా? వాళ్లయితేనే బాగా చేస్తారండి.
యాదగిరి: సార్ ఈ సిచ్యుయేసన్ లో కామెడీ ఏంటీ సార్. అక్కడ తాళి బొట్టు రెడీ..మేం అందరం టెన్షన్ లో ఉంటే మీరేమో సెటైర్లు వేస్తున్నారు.
శంకర్: బాబాయ్ టెన్షన్ పడాల్సింది వాళ్లు.. మనం కాదు అయినా నువ్వెందుకు టెన్షన్ పడి బీపీ పెంచుకుంటున్నావు. హలో టాంకరూ ఏంటి పనిష్‌మెంట్ మాకు. పెళ్లికి ఇంత టైం పడుతుంది అంటే వెళ్లి భోజనాలు అయినా చేసేవాళ్లం కదా.
పాండు: అవుతుందయ్యా.. నువ్వు ఏం చేసినా పెళ్లి కాదనా..? అవుతుందనా..?
ఇంతలో శంకర్ శ్రీనుకు ఫోన్ చేసి ఏంట్రా లేటు అంటాడు. ఇంకో 5 నిమిషాల్లో అంతా అయిపోతుందన్నా అంటాడు. ఇంతలో పంతులు గారు పసుపుతాడు వినయ్ కు ఇచ్చి తాళి కట్టమని చెప్తాడు. వినయ్ పసుపు తాడు తీసుకుని కట్టబోతుంటే శంకర్ వన్ టూ త్రీ అంటూ ఫైవ్ వరకు లెక్కపెడతాడు. ఫైవ్ పూర్తి కాగానే పోలీసులు వచ్చి ఆపండి అంటారు. వెళ్లి వినయ్ ని పట్టుకుని వీడు పెద్ద దొంగ వీడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. పోలీసులు వినయ్ ని తీసుకెళ్తుంటే శంకర్ వాణ్ని కొడతాడు. ఇంతలో ప్లేటు ఫిరాయించిన పాండు ఓవర్ యాక్షన్ చేస్తుంటే శంకర్ వాణ్ని కొడతాడు.
శంకర్: బాబాయ్ ఓనరు గారిని జాగ్రత్తగా చూసుకో.. ఇప్పుడు చెప్పరా.. నీ వెనక ఎవరున్నారో చెప్పరా..?
వినయ్: ఎవరూ లేరండి ఇలా ఫ్రాడ్ చేసి కట్నం పేరుతో డబ్బులు తీసుకుని పారిపోవడమే నేను చేసే క్రైమ్ అండి.
జెండే: అబద్దం నీ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయించారు. లేదంటే పర్టికులర్ గా గౌరిగారినే ఎందుకు టార్గెట్ చేస్తావు చెప్పు. జలంధర్ కొడుకే కదూ నిన్ను పంపించింది.
వినయ్: జలంధర్ ఎవరండి మీరేం అంటున్నారో నాకు అర్థం కావడం లేదు.
జెండే: నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవురా..?
పోలీస్: సార్ మీ ట్రీట్‌మెంట్‌కు వీడు నిజం చెప్పడు కానీ మీరు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి.
అని వినయ్ ని తీసుకుని వెళ్లిపోతారు పోలీసులు. తర్వాత శంకర్, జెండే కలిసి పాండును పిచ్చకొట్టుడు కొడతారు. గౌరి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ కంగారుపడుతుంటే.. మీరేం కంగారుపడకండి గౌరి గారితో నేను మాట్లాడి తీసుకొస్తాను అని వెళ్తాడు శంకర్. గౌరి, శంకర్ ఇద్దరూ చిలిపిగా పోట్లాడుకుంటారు. ఇంతలో శంకర్ మీకు నాకు ఏదో జన్మల బంధం ఉన్నట్లుంది లేకపోతే మీ మొదటి పెళ్లి చెడగొట్టింది కూడా నేనే అంటూ అప్పుడు జరిగిన విషయం చెప్తాడు శంకర్. ఇంతలో అందరూ కలిసి ఇంటికి వెళ్లిపోతారు. తర్వాత జెండే గన్ తీసి పాండును బెదిరిస్తూ మీ వెనక ఉన్నది ఎవరు అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ ఇంటికి వచ్చిన కరుణ – రాథోడ్ ను కొట్టిన ఆరు