Satyabhama Serial Today Episode మైత్రిని ఫారిన్ పంపించడం కోసం హర్ష లోన్ కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకు తన ఫ్రెండ్‌తో ఆరు బయట ఫోన్‌లో మాట్లాడుతుంటే మైత్రి అక్కడికి వస్తుంది. లోన్ అవసరం ఏంటి సంధ్య పెళ్లి కోసమా? ఇంటి కోసమా? ఇంట్లో వాళ్ల కంటే ముఖ్యమైన మనిషి ఎవరైనా ఉన్నారా? అంత ముఖ్యమైన మనిషి ఎవరో నాకు చెప్పకూడదు అంటే చెప్పుకు అని మైత్రి అంటుంది. దానికి హర్ష ఆ లోన్ నీకోసమే అంటాడు. మైత్రి వెనక్కి తిరిగి చాలా సంతోషపడుతుంది. వెంటనే ఎమోషనల్ అయినట్లు నేను అంటే నీకు ఇంత అభిమానం ఎందుకని ప్రశ్నిస్తుంది.


హర్ష: మైత్రి ఇప్పుడు నీకు నీ భవిష్యత్ ముఖ్యం ఓ స్నేహితుడిగా నీకు సాయం చేయాలి అనుకుంటున్నాను. దాని గురించి ఎక్కువ ఆలోచించకు.  నువ్వు సెటిల్ అయితే నాకు చాలు.
మైత్రి: మనసులో గీత గీసుకొని మాట్లాడుతున్నాడు అది దాటడం లేదు.
హర్ష: మైత్రి నువ్వు ఎక్కువ ఆలోచించకు.
మైత్రి: మా ఇళ్లు అమ్మేశాను. 
హర్ష: అది మీ అమ్మానాన్నల గుర్తు అది అమ్మడం నాకు ఇష్టం లేదు.
మైత్రి: నాకు కావాల్సింది లోన్ కాదు హర్ష. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదలను.



క్రిష్‌ వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. రేణుకకి ప్రమాదం జరిగిందని అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. క్రిష్ ఫోన్స్ చేస్తుంటే ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైందా అని కంగారు పడతారు. జయమ్మ అయితే భయంగా ఉందని హాస్పిటల్‌కి వెళ్లమని చెప్తుంది. దాంతో మహదేవయ్య, భైరవి, క్రిష్‌ బయల్దేరుతారు. ఇంతలో సత్య రేణుకని తీసుకొని వస్తుంది. రేణుక చాలా ఏడుస్తుంది. రుద్ర భయపడతాడు.


మహదేవయ్య: అలా ముఖాలు చూసుకుంటారేంటిరా ఏం జరిగిందో చెప్పండి.
సత్య: అదేంటి బావగారు అందరూ అంత ఆరాట పడుతుంటే చెప్పరేంటి నన్ను చెప్పమంటారా. 
క్రిష్‌: ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా ఏం జరిగిందో చెప్పు సత్య.
సత్య: అక్కకి కడుపు పోయింది. అంతే కాదు ఇంకెప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పింది. (మహదేవయ్య కూలబడిపోతాడు)
జయమ్మ: ఏంటమ్మ నువ్వు చెప్పేది నిజమేనా.
భైరవి: మేం పొద్దున్న వెళ్లేటప్పుడు బాగానే ఉంది కదా నవ్వుతూ సరదాగా ఉంది కదా.
మహదేవయ్య: వారసుడి కోసం మస్త్ కలలు కన్నా వాడు భూమి మీద పడగానే పండగ చేద్దాం అనుకున్నా వాడి కోసం బంగారు మొలతాడు కూడా చేసి ఉంచా. ఇప్పుడు అసలు వారసుడు లేడు అసలు రాడు అంటున్నారు అసలేం జరుగుతుంది ఏం జరుగుతుందిరా (ఏడుస్తూ) 
క్రిష్‌: బాపు జరంత ధైర్యంగా ఉండు.
జయమ్మ: ఆరు నెలలు కడుపులో మోసింది ఇంతలో ఇలా ఏంట్రా.
భైరవి: దాని నుదిటిన అమ్మా అని పిలిపించుకునే అదృష్టం లేకపోతే మనం ఏం చేస్తాం.


ఇంతలో పోలీసులు ఇంటికి వస్తారు. సత్య నేనే పిలిచిపించానని అంటుంది. హంతకుడికి అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్తుంది. రుద్ర చాలా భయపడతాడు. ఏంటి ఇదంతా అని మహదేవయ్య, భైరవి అడిగితే వారుసుడిని చంపిన హంతకుడిని అరెస్ట్ చేయడానికే పోలీసులు వచ్చారని సత్య చెప్తుంది.


మహదేవయ్య: వారసుడిని చంపాడా ఎవరో అది చెప్పమ్మా వాడిని పోలీసులు తీసుకెళ్లడం కాదు నేనే చంపేస్తా. ఎవడు ఆడు
సత్య: మీ పెద్ద కొడుకు రుద్ర ప్రతాప్ గారు.
రుద్ర: అబద్ధం నాకేం  తెలీదు ఇదంతా కట్టుకథ.
భైరవి: చెప్పే కట్టు కథ అయినా అతికి నట్లు ఉండాలి కదా లోకంలో ఏ తండ్రి అయినా తన బిడ్డను చంపుకుంటాడా. చంపి ఇలా అందరి ముందు ధైర్యంగా నిలబడతాడా. పెనిమిటి మాయమాటలు చెప్పి ఇంట్లో గొడవలు పెట్టాలి అనుకుంటుంది. 
మహదేవయ్య: నిజంగా నా పెద్ద కొడుకు వారసుడిని చంపాడా.
సత్య: అవును నా కళ్లతో చూశాను. 
మహదేవయ్య: సాక్ష్యం ఉందా.
సత్య: ఉంది భార్య చెప్పే మాట కంటే సాక్ష్యం ఇంకేముంటుంది. అక్క ఏం జరిగిందో జరిగింది జరిగినట్లు చెప్పు.
రేణుక: సత్య పొరపాటు పడి కంప్లైంట్ ఇచ్చింది. మెట్ల మీద నుంచి నేనే కింద పడిపోయా. అందుకే ఇలా అయింది. నా పెనిమిటీ తప్పు ఏం లేదు. పక్కనుండి నన్ను కాపాడుకున్నాడు. 
సత్య: అక్కా.. 


రేణుక మాటతో క్రిష్‌తో పాటు అందరూ సత్యని తిడతారు. పోలీసులు కూడా సత్యనే అంటారు. క్రిష్ పోలీసులకు సారీ చెప్పి పంపేస్తాడు. జయమ్మ కూడా సత్యని పరువు పోయే పని చేశావ్ అని తిడతుంది. ఆడదానివి అయి తోటి ఆడదాని మీద ఇలా చేస్తావా అని క్రిష్ అంటాడు. సత్యకి శిక్ష పడాలని భైరవి అంటుంది. సత్య అక్క చేసిన మోసానికి ఉలకదు పలకదు. అలా ఉండిపోతుంది. ఇంట్లో అందరూ సత్యకి శిక్ష పడాలి అంటే క్రిష్ కూడా ఏం అనడు. సత్యకి మహదేవయ్య శిక్ష వేయబోతే రేణుక మామని ఆపుతుంది. నాకు శిక్ష వేయండి మామయ్య తప్పు చెప్పింది నేను అని అంటుంది. రుద్ర ఆపినా రేణుక నిజం చెప్తుంది. 


రేణుక: సత్య చెప్పిందే నిజం నా భర్త నన్ను కొట్టి మెట్ల మీద నుంచి పడిపోయేలా చేశాడు. నా కడుపులో బిడ్డ చనిపోవడానికి మీ పెద్ద కొడుకే కారణం. ఈ ఇంటి పరువు రోడ్డున పడకూడదని పోలీసుల ముందు అలా చెప్పాను. నా పెనిమిటి జైలు పాలు కాకుండా ఉండాలని నా కళ్లకు కనిపించకుండా పోయిన నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ నిజం ఎందుకు చెప్పానంటే ఓ మంచి మనసున్న దేవత లాంటి సత్యని అందరూ అవమానిస్తుంటే చూస్తూ ఉండలేకపోయా. సత్య నన్ను క్షమించు.
సత్య: వద్దు అక్కా ప్లీజ్..
రేణుక: నా మొగుడిని కాపాడుకోవడానికే అబద్దం చెప్పా అంతే కానీ నీకు ద్రోహం చేయాలని కాదు.


మహదేవయ్య చావరా అని రుద్రని తన్ని తన్ని చితక్కొడతాడు. ఎందరు అడ్డుకున్నా మహదేవయ్య ఊరుకోడు. నీ ముఖం చూడాలంటే రోత పుడుతుందని అంటాడు. భైరవి కూడా నా కడుపున చెడ పుట్టావురా అని ఏడుస్తుంది. భైరవి రేణుక కడుపు పట్టుకొని ఏడుస్తుంది.  సత్యని ఎలా అనుమానించావ్ అని రేణుక క్రిష్‌ని అడుగుతుంది. ఇక మరోవైపు నందిని గదిలో గేమ్ ఆడుకుంటే హర్ష అక్కడికి వెళ్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా నవ్వు ఇలా అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తుంటే బాలేదని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాంచన, కార్తీక్.. దీపకు జ్యోత్స్న, పారులు కూడా థ్యాంక్స్ చెప్పారే.. జ్యో పెళ్లి ఫిక్స్!