Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప సుమిత్రను తన ఇంట్లో పూజకు పిలిస్తే సుమిత్ర తన ఇంట్లోనే పూజ చేయమని అంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న మా అమ్మ నా గురించి పట్టించుకోకుండా దీప పూజ చేయమని అంటుంది. దీప ఏదో తన సొంత కూతురిలా నేను పరాయి దానిలా నన్ను పట్టించుకోవడం లేదని కోపంతో నానమ్మ మీద విరుచుకుపడుతుంది. పూజ వెనక ఇంకేదో కారణం ఉందని అది మనం కనిపెట్టాలని జ్యోత్స్న అంటుంది.
దీప ఇంట్లో దీపం పెట్టుకుంటుంది. అనసూయ పాపని పడుకోబెడుతుంది. తర్వాత దీప అనసూయ దగ్గరకు వస్తుంది. అనసూయ దీపతో నువ్వు చేయాలనుకున్న పని మంచిదే కానీ ఇక్కడే ఆపేయ్ అంటుంది. కార్తీక్ బాబు కాబట్టి వాళ్ల తాత తిడితే పడ్డాడు కానీ వాళ్ల అమ్మ తట్టుకోలేదని అంటుంది. దానికి దీప సుమిత్రమ్మ బాధ చూడలేక ఇలా చేస్తున్నా అని అంటుంది. ఈ రెండు కుటుంబాలను కలపాల్సిన బాధ్యత తనదే అని తన వల్లే జ్యోత్స్న పెళ్లి ఆగిపోయింది కాబట్టి వీళ్లని కలిపి కార్తీక్ పెళ్లి చేసి వెళ్లిపోదామని అంటుంది. ఇక నర్శింహ పోలీసులకు దొరకలేదు కాబట్టి మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు కాబట్టి త్వరగా వెళ్లిపోదాం అంటుంది. ఇక నర్శింహ చాటుగా దీప ఇంటికి వచ్చుంటాడు. దీపని చంపి తన తల్లిని ఊరు పంపిస్తా అనుకుంటాడు.
దీప సుమిత్ర ఇంట్లో పూజకు అన్నీ సిద్ధం చేస్తుంది. శివనారాయణ, దశరథ్ కనిపించరు. అడగడానికి దీప సుమిత్ర దగ్గరకు వెళ్లుంది. సమిత్ర పాపని రెడీ చేస్తుంటుంది. దానికి సుమిత్ర బయటకు వెళ్లారని పూజకు రారు అని చెప్తుంది. దీప ఊపిరి పీల్చుకుంటుంది. వాళ్లు రాకుండా పూజ చేసేయొచ్చు అనుకొని కార్తీక్, కాంచనల్ని ఇంటికి రప్పించడానికి ఒప్పించాలి అనుకుంటుంది. ఇక సమిత్ర పాపకి బంగారు నగలు పెడుతుంది. దీప వద్దని మా స్థాయి అది కాదని అంటుంది. జ్యోత్స్న, పారిజాతం కూడా అక్కడికి వస్తారు. ఇంతలో కార్తీక్ వాళ్లు రావడంతో అనసూయ దీపని పిలుస్తుంది. దీప వాళ్ల దగ్గరకు వెళ్తుంది. పూజ మీ పుట్టింట్లో అని దీప కాంచన వాళ్లతో చెప్తుంది.
కాంచన: అబద్ధం చెప్పి మమల్ని రప్పించావ్ కదూ.
దీప: క్షమించండి అమ్మ పూజ మా ఇంటి దగ్గరే అనుకుంటే సుమిత్రమ్మ అక్కడికి మార్చారు.
కార్తీక్: ఆ విషయం మాకు ఫోన్ చేసి చెప్పి ఉంటే ఇంటి దగ్గరే ఆగిపోయే వాళ్లం కదా. ఈ ఇంటి వాళ్లకి నువ్వు సొంత మనిషివేమో కానీ మేం ఇప్పుడు పరాయి వాళ్లం.
దీప: కాదు బాబు దూరంగా ఉన్నంత మాత్రాన మీరు దూరం కాదు దగ్గర ఉన్న నేను సొంతం కాదు. ఎప్పటికైనా మీరు సొంతమైన వాళ్లు ఈ పరాయి దాని కోసం ఇంత దూరం వచ్చారు ఆ గుమ్మంలోకి రాలేరా. మీ తాతయ్య వాళ్లు కూడా లేరు. మీరు వస్తున్న మాట ఎవరికీ తెలీదు.
కాంచన: మా నాన్న అన్నయ్య ఇంట్లో లేకపోయినా నేను ఆ ఇంటికి రాలేను. పద కార్తీక్.
దీప: అలా అనొద్దమ్మా అక్కడ పూజ చేసేది నేను నా కోసం రండి. అక్కడ మిమల్ని ఆపేవాళ్లు లేరు.
కాంచన: ఆ ఇంటికి రావాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు దీప
దీప: నా కోసం నా మనుషులుగా రండి అమ్మా.
కాంచన: నువ్వేంమంటావ్ రా.
కార్తీక్: నీ ఇష్టం అమ్మ కానీ అక్కడ నిన్ను ఎవరు ఏమన్నా నేను ఊరుకోను.
ఇంతలో శౌర్య వస్తుంది. కాంచన రెండు చేతులు జోడించి శౌర్య నిజంగానే బాలాత్రిపుర సుందరిలానే ఉందని అంటుంది. దీప కార్తీక్‌తో అమ్మవారే పిలుస్తున్నారు రండి అని అంటుంది. ఇక కార్తీక్ వాళ్లు వచ్చిన విషయం చెప్పడానికి సుమిత్ర దగ్గరకు దీప వెళ్తుంది. అందరూ హాల్‌లో ఉంటారు. సుమిత్రతో దీప పూజకు నాకు తెలిసిన వాళ్లని పిలిచాను పర్లేదా అంటుంది. దానికి పారిజాతం సెటైర్లు వేస్తుంది. శౌర్య సుమిత్రతో అమ్మమ్మా ఎవరు వచ్చారో చూడు అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. జ్యోత్స్న, పారిజాతం, సుమిత్ర చాలా సంతోషిస్తారు.
సుమిత్ర కాంచనను పట్టుకొని ఏడుస్తుంది. మన కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందని ఏడుస్తారు. కొద్ది రోజులు ఓపిక పట్టు వదినా మళ్లీ మనం అంతా కలుస్తాం అని సుమిత్ర చెప్తుంది. ఇక కాంచన గోడ మీద ఫ్యామిలీ ఫొటో లేకపోవడం చూసి ఏమైందని అడుగుతుంది. నాన్న తీసి విసిరేశాడా అని అడుగుతుంది. మా ఫొటోలకే ఇంట్లో చోటు లేకపోతే ఇంట్లో ఏం చోటు ఉంటుందని అంటుంది. మేం ఇప్పుడు దీప మనుషుల్లా వచ్చాం అని కాంచన అంటే దానికి జ్యోత్స్న దీప కోసం వస్తే దీప మనుషులు అయిపోతారా అత్త నువ్వు ఎప్పటికీ ఇంటి ఇంటి ఆడబిడ్డవే అని అంటుంది. ఇక దీపతో మేం చేయలేని పని నువ్వు చేశావ్ థ్యాంక్స్ దీప అని చెప్తుంది. పారిజాతం కూడా దీపను పొగుడుగుతుంది. సుమిత్ర కూడా దీపకు థ్యాంక్స్ చెప్తుంది. ఇక శివనారాయణ, దశరథ్ పెళ్లి సంబంధం మాట్లాడుకొని ఇంటికి వస్తుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.