Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ సహస్ర డ్రస్ కుడుతుంది. డ్రస్ ఎప్పటిలా సిద్ధం చేసి యమునకు ఇస్తుంది. యమున చాలా సంతోషిస్తుంది. లక్ష్మీ పని తనానికి మెచ్చుకుంటుంది. ఇక ఆ డ్రస్‌ ఎవరు కట్ చేసుంటారా అని యమున అడుగుతుంది. ఇంట్లో ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అంటుంది. దానికి లక్ష్మీ ఎవరి మీద అనుమానం లేదని ఈ రోజు నిశ్చితార్థం కాబట్టి అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమని అంటుంది. ఇక ఇద్దరూ ఆ డ్రస్ సహస్రకి ఇవ్వడానికి వెళ్తారు. 


సహస్ర ఎంతో ఇష్టపడి సిద్ధ చేసుకున్న డ్రస్‌ని తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. అత్త ఇచ్చిన చీర కట్టుకొని డల్ అయిపోతుంది. ఇంతలో యమున వచ్చి ఈ డ్రస్ తీసుకోమని అంటుంది. ఎందుకు పనికి రాని డ్రస్‌ని లక్ష్మీ అందంగా తయారు చేసిందని అంటుంది. సహస్ర ఫ్రెండ్స్ లక్ష్మీని తెగ పొగిడేస్తారు. సహస్ర, పద్మాక్షిలు కోపంతో ఊగిపోతారు. సహస్ర తన ఫ్రెండ్స్‌ని ఆపమని అంటుంది. ఇక పద్మాక్షి లక్ష్మీతో తప్పు చేశావ్ కాబట్టే కప్పి పుచ్చుకోవడానికి ఇలా చేశారని అంటుంది. ఇక యమున ఆ డ్రస్ సహస్ర చేతిలో పెట్టి డ్రస్‌ల మూలంగా ఇంట్లో గొడవలు  వద్దని నీకు నచ్చిన డ్రస్ వేసుకొని రెడీ అయి రా అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు వసుధ ఫుల్ బంగారంతో ధగధగ మెరిసి పోతుంది. చారుకేశవ కనకం దగ్గర కొట్టేసిన నగలు మొత్తం తీసుకెళ్లి వసుధకి ఇస్తాడు. ఇక అంబిక చూసి నగలు చాలా బాగున్నాయని ఎక్కడివని అడుగుతుంది. దాంతో వసుధ మీ బావ కొన్నారని చెప్తుంది. అంబికకు నమ్మబుద్ధి కాక చారు కేశవ సెటైర్లు వేస్తుంది. ఒళ్లు వంగని వ్యక్తి ఇంత బంగారం తెచ్చారంటే నమ్మబుద్ధి కావడం లేదని అంటుంది. వసుధ చిన్నబుచ్చుకుంటుంది. ఇక వసుధ విహారికి చెప్తా ఉద్యోగం గురించి అని అంటుంది. చారు కేశవ సరే అంటాడు. 


మరోవైపు విహారి చక్కగా రెడీ అవుతాడు. విహారిని చూసి యమున చాలా సంతోషపడుతుంది. తల్లికి తన పిల్లలు ఎప్పుడూ గొప్పగానే కనిపిస్తారని విహారి అంటాడు. ఇంతలో పద్మాక్షి, ఆమె భర్త విహారి దగ్గరకు వస్తారు. అత్త కూతుర్నే కాలు కింద పెట్టకుండా చూసుకుంటుందని ఇక అల్లుడైన నిన్ను ఇంకెలా చూసుకుంటుందో అని అంటాడు. ఇక పద్మాక్షి బ్రేస్ లెట్ తీసుకొచ్చి కాబోయే అల్లుడికి చిరు కానుక అని అంటుంది. నీ దగ్గర ఎన్ని ఉన్నా నేను ఇచ్చింది నీ ఒంటి మీద ఉండాలని అంటుంది. ఇక పద్మాక్షి విహారి చేతికి బ్రేస్ లెట్ పెడుతుంది. ఆ టైంలో విహారి కనకాన్ని కనకంతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకొని చేయి కిందకి లాగేయడంతో బ్రేస్ లెట్ కింద పడిపోతుంది. ఇక మామ దాన్ని విహారి చేతికి పెడతాడు. 


పంతులు నిశ్చితార్థానికి అన్నీ సిద్ధం చేస్తాడు. ఇక ఆదికేశవ్ కనకానికి ఫోన్ చేస్తాడు. కనకం వంట గదిలో అక్షింతలు కలుపుతూ ఉంటుంది. ఇక కనకం గదికి వెళ్లి ఫోన్ చూసి తండ్రికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అనుకొని కంగారుగా ఫోన్ ఎత్తుతుంది. ఇక పిండి వంటలు అమెరికా పంపడం గురించి మాట్లాడుతారు. కనకం వద్దని చెప్తుంది. అల్లుడు గారితో మాట్లాడితే ఆయన సరే అన్నారని హైదరాబాద్‌లో ఫ్రెండ్‌కి ఇవ్వమని అన్నారని అంటాడు. చెకప్ కోసం హైదరాబాద్ వస్తున్నాం అని అంటాడు. కనకం షాక్ అయి ఏమైందని అడుగుతుంది. ఇక ఆదికేశవ్ మంత్రాలు విని ఏంటి అని అడిగితే పక్కనే గుడి ఉందని కనకం చెప్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత మోసం చేస్తున్నా అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: అమ్మాయి గారు సీరియల్: దీపక్ ఇద్దరి పెళ్లాల కొట్లాట.. కారులో రాజు, రూపలను సూర్యప్రతాప్ చూసేస్తాడా!