Nindu Noorella Saavasam Serial Today Episode:

  ఆరుకు స్పర్శ వచ్చిందనే విషయం తెలియకుండా చేయాలని గుప్త ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆరు అక్కడకు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదని ఇవాళ ఉదయం నుంచి నేను అనుకున్నవి జరిగిపోతున్నాయి. నాకు స్పర్శ శక్తి వచ్చింది ఎందుకు అని అడుగుతుంది. దీంతో గుప్త తనకేం తెలియదని చెప్తాడు. అయితే నేనే వెళ్లి తేల్చుకుంటాను అని లోపలికి వెళ్తుంటే నువ్వనుకున్నది నిజమే బాలిక అంటాడు గుప్త.


గుప్త: నాలుగు మండలముల పాటు ఆత్మ భూలోకంలో ఉన్నచో ఆ ఆత్మకు శక్తులు లభించును. నీవు దేనినైననూ తాకవచ్చును. నీ మనసును ఏదైనా సంకల్పించుకున్నచో అది కచ్చితంగా జరుగును. కానీ ఒక్కమాట నీ శక్తులను నువ్వు దుర్వినియోగ పరిచినచో ఆ వరమే నీకు శాపం అగును.


అని గుప్త చెప్పగానే ఆరు పలకకుండా గుప్తకు దూరంగా వెళ్లి అటూ ఇటూ చూసి తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంది. ఇంతలో స్కూల్‌ నుంచి వచ్చిన భాగీ కూడా ఆరుతో కలిసి డాన్స్‌ చేస్తుంది.


గుప్త: ఊ… బాగున్నది బాగున్నది..


భాగీ: అక్కా ఇప్పుడు చెప్పండి ఎందుకక్కా ఇంత ఆనందంగా ఉన్నారు.


ఆరు: మిస్సమ్మ ఈ కథలో ఎవ్వరూ ఊహించలేని ఒక అధ్బుతమైన ట్విస్ట్‌  ఒకటి జరిగింది. అంటే దొరికింది. ఆ ట్విస్టు వల్ల నాకైతే చాలా మేలు జరగనుంది. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను.


గుప్త: చిన్నారుల వల్లే ఒకరి సంతోషాన్ని ఒకరు ఎటుల పంచుకుంటున్నారు. ఇటువంటి వారిని ఎటుల విడదీయాలనిపించింది స్వామి. ఈ పరిచయం. ఈ కలయిక, ఈ స్నేహము, ఈ బంధము ఎటులకు దారి తీయునో.. ఎంతటి ప్రమాదం తెచ్చిపెట్టునో అని భయంగా ఉంది. జగన్నాథ నువ్వే రక్ష.


అనుకంటూ వెళ్లిపోతాడు. మరోవైపు మనోహరి ఘోరను కలవడానికి వెళ్తుంది.


మనోహరి: ఘోర ఏంటి ఇక్కడికి రమ్మన్నారు. ఈ ప్లేస్‌ ఏంటి ఇంత భయంకరంగా ఉంది.  నువ్వా పిలవొచ్చు కదా ఘెర. ప్రాణం పోయింది తెలుసా?


ఘోర: మనల్ని చూసి జనాలు భయపడాలి మనం భయపడకూడదు మనోహరి.


మనోహరి: అయినా నువ్వేంటి ఇక్కడికి మకాం మార్చావు.


ఘోర: తమరి ప్రేమ వల్లనా..


మనోహరి: సరే ఏంటి అర్జెంట్‌ గా కలవాలని ఫోన్ చేశావు.


ఘోర: ఆత్మ భూమి మీద ఉండబట్టి 4 మండలాలు దాటింది.


మనోహరి: అయితే రేపు జిల్లాలు కూడా దాటమని చెప్తానులే.


ఘోర: మనోహరి.. ఆ ఆత్మలో ఏవైనా మార్పులు గమనించావా?


మనోమరి: అది నాకు రోజు కనబడి హాయ్‌ చెప్తుంది. కలర్ తగ్గిందా? బరువు పెరిగిందా? అని చూడటానికి.


ఘోర: మనోహరి ఏంటలా మాట్లాడుతున్నావు. దయచేసి నేను అడిగిన వాటికే సమాధానం చెప్పు.


మనోహరి: నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు ఘోర. మార్పులు అంటే ఏంటి?


ఘోర: అనుమానాస్పదం లాంటివి.


మనోహరి: పొద్దున నేను దానితో మాట్లాడుతుంటే ఒక కొబ్బరి బొండం నీ మీద పడబోయింది.


ఘోర: ఇంకేం జరిగింది.


మనోహరి: ఇంతకు ముందు వస్తుంటే అక్కడ ఏమీ లేదు. కానీ ఏదో తగిలినట్టు కిందపడిపోయాను.


ఘోర: అయితే నా అనుమానం నిజం అయింది. నాలుగు మండలాలు ఆత్మ భూమ్మీద ఉంటే ఆత్మకు శక్తులు వచ్చాయి.


మనోహరి: ఏంటి ఘోర అసలు ఏం మాట్లాడుతున్నావు.. శక్తులు రావడం ఏంటి. అసలు ఏం శక్తులు వచ్చాయి ఘోర.  


అని మనోహరి అడగ్గానే ఘోర, ఆత్మకు స్పర్శ వచ్చిందని చెప్పగానే మనోహరి భయపడుతుంది. అది కచ్చితంగా నన్ను చంపేస్తుంది అనగానే ఆ ఆత్మ నిన్నేం చేయదు మనోహరి అంటూ ఆత్మను బంధించడం చాలా ఈజీ అవుతుంది అని చెప్తాడు ఘోర. మరోవైపు ఇంటికి వచ్చిన అమర్‌, మిస్సమ్మను పిలిచి అంజుకు బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్లాలని రమ్మని పిలుస్తాడు. సరే రెడీ అయి వస్తానని భాగీ లోపలికి వెళ్తుంది.


శివరాం: నిర్మల అబ్బాయికి నాకు టీ తీసుకుని రా..


నిర్మల: అలాగే నండి.


ఆరు: మీ మౌనం. ఆ మౌనం వల్ల మీరు పడుతున్న బాధ ఎవ్వరికీ చెప్పలేరు. ఎవరితోనూ పంచుకోలేరు.


 అంటూ అంజలి గురించి ఆలోచిస్తుంది ఆరు. తర్వాత గార్డెన్‌ లోకి వెళ్లి నిర్మల, శివరాం మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధగా కూర్చుని ఉంటుంది ఆరు. ఇంతలో అక్కడికి గుప్త వచ్చి ఏమైందని అడుగుతడు. అంజలి గురించి అందరి దగ్గర అబద్దం చెప్పినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు గుప్త గారు అని చెప్తుంది ఆరు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గురించి ఫీల్‌ అయిన గగన్‌ – అపూర్వకు నిజం చెప్పిన భూమి