Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, మనోహరిని కలకతా వెళ్లమని చెప్పగానే మనోహరి ఏడుస్తూ.. నేను ఇక్కడే ఉంటానని నేను ఎక్కడికి వెళ్లినా వాడు నన్ను బతకనివ్వడని.. ఇక్కడ ఉంటేనే సేఫ్‌గా ఉంటాను అమర్ అంటుంది. దీంతో అమర్ సరే ఇక్కడే ఉండు కానీ ఎట్టి పరిస్థుల్లోనూ బయటకు వెళ్లకు అని జాగ్రత్తలు చెప్తాడు. సరేనని లోపలికి వెళ్తుంది మనోహరి. తర్వాత నిర్మల అమర్‌ను కాళ్లు కడుక్కుని రమ్మని భోజనం పెడతానని చెప్తుంది. సరేనని అమర్ వెళ్తాడు. ఇంతలో నిర్మలకు భాగీ ఫోన్ చేస్తుంది. పిల్లల గురించి, శివరాం గురించి ఆరా తీస్తుంది. దీంతో నిర్మల, శివరాం ఏమోషనల్ అవుతారు. ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు.
భాగీ: హలో అత్తయ్యా వినబడుతుందా..?
శివరాం: వినబడటం లేదు మిస్సమ్మ మా మీద నీకున్న ప్రేమ కనబడుతుంది. నీ మంచి మనసుకు ఈ ఇల్లు గుడి కట్టాల్సింది పోయి. నిన్ను అవమానించి ఇంట్లోంచి బయటకు పంపించింది. అంత ధ్వేషిస్తున్నా… ఇంతలా ఎలా ప్రేమిస్తున్నావు మిస్సమ్మ.
భాగీ: అదేంటి మామయ్యా నేనేదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతున్నారు. నా కుటుంబం నాకేదో ఇస్తుందని ప్రేమిస్తామా..? ఒక మాట అన్నారని వదిలేస్తామా..? మన అనుకుంటేనే కదా మామయ్యా మనసు విప్పి మాట్లుకునేది. పిల్లలు తిన్నారా..? మామయ్య.
శివరాం: ఆ విషయం గురించి ఏం అడుగుతావులే మిస్సమ్మ
నిర్మల: నీ చేతి వంట తిని నాలుకకు నా వంట రుచించటం లేదు మిస్సమ్మ
శివరాం: మిస్సమ్మ నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి మిస్సమ్మ.
అమర్ వచ్చి నిర్మలను పిలుస్తాడు. అమర్ వచ్చాడు మళ్లీ చేస్తానని నిర్మల చెప్పగానే ఫోన్ కట్ చేయోద్దని ఆయన మాటలైన వింటానని అంటుంది మిస్సమ్మ సరేనని ఫోన్ తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతుంది. అమర్ మాట్లాడుతుంటే భాగీ వింటుంది. అమర్ పిల్లలను పిలిచి ఎందుకు భోజనం చేయలేదు అంటూ అందరూ ఇవాళ బయట తిందామని అమర్ చెప్తాడు. మరుసటి రోజు పిల్లలకు టిఫిన్ బాక్స్ రెడీ చేస్తుంది భాగీ. రామ్మూర్తికి ఇచ్చి పంపిస్తుంది. భాగీ రాథోడ్ కు ఫోన్ చేస్తుంది.
రాథోడ్: చెప్పు మిస్సమ్మ..
భాగీ: రాథోడ్ పిల్లలు స్కూల్ కు బయలుదేరారా..?
రాథోడ్: ఇంకా లేదు మిస్సమ్మ ఇప్పుడే తినడానికి కూర్చున్నారు.
భాగీ: పరిస్థితి ఏంటి..?
రాథోడ్: అసలు వర్కవుట్ అయ్యేలా లేదు మిస్సమ్మ..
భాగీ: అవునా.. నాన్నతో టిఫిన్ పంపిస్తున్నాను. వాళ్లు బయట ఎక్కడ తినకుండా స్కూల్ కు వచ్చేలా చూడు.
రాథోడ్: సరే మిస్సమ్మ..
భాగీ: నాన్నా పిల్లలు ఇంట్లో కూడా తినేలా లేరు. వాళ్లతో మొత్తం తినిపించండి.
రామ్మూర్తి: వాళ్లకు నేను తినిపిస్తాను. నువ్వు రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడైనా కొంచెం తిని తల్లి.
భాగీ: లేదు నాన్నా.. పిల్లలు తిన్నాకే నేను తింటాను నాన్నా.. నా గురించి ఆలోచించకండి. ముందు బయలుదేరండి.
మంగళ: ఇంట్లో తినడానికి తిండి లేదు కానీ బయట వాళ్లకు పెడుతున్నావా..?
అని మంగళ అడ్డు పడగానే రామ్మూర్తి తిట్టి వెళ్లిపోతాడు. తర్వాత వాకింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చిన శివరాం భాగీని గుర్తు చేసుకుని ఎమోషన్ అవుతాడు. రాథోడ్ డల్లుగా వచ్చి పేపర్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇంతలో రూంలోకి వచ్చిన మనోహరి.. అనుమానంగా శివరాంను చూస్తూ… ఒక్కరోజుకే అది లేకుండా ఉండలేకపోతున్నాడు టైం వస్తే మిమ్మల్ని చంపేస్తాను అని మనసులో అనుకుంటుంది. శివరాం మాత్రం డల్లుగా లోపలికి వెళ్తాడు. మరోవైపు హాల్లో కి వచ్చిన అమర్ గట్టిగా మిస్సమ్మ కాఫీ.. అంటూ అడుగుతాడు. తర్వాత మిస్సమ్మ ఇంట్లోంచి వెళ్లిపోయిందని గుర్తు చేసుకుని ఆగిపోతాడు. నిర్మలను పిలుస్తాడు. నిర్మల వెళ్తుంటే..
శివరాం: ఆగు ఎక్కడికి వెళ్తున్నావు.
నిర్మల: అబ్బాయి కాఫీ అడుగుతున్నాడు కదండి.
శివరాం: అడిగిందల్లా నువ్వు ఇంస్తుంటే వాడికి మిస్సమ్మ విలువ ఎప్పుడు తెలస్తుంది. నీ తల్లి మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నిర్మల. కానీ కొద్ది రోజులు ఓపిక పట్టు.
అని చెప్పి హాల్ లోకి వస్తాడు శివరాం. శివరాంను చూసి అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడగ్గానే పడుకుందని చెప్తాడు శివరాం. ఇంతలో రాథోడ్ రాగానే..
శివరాం: మన ఇంట్లో మిస్సమ్మ లేదు కదా..? ఒక వంట మనిషి కావాలి. అలాగే ఒక పనిమనిషి కావాలి. పిల్లలకు ఒక కేర్ టేకర్ కూడా కావాలి. మంచి వాళ్లను చూడు.
రాథోడ్: అవునను సార్ అలాగే.. కానీ కష్టేమ సార్ కానీ ట్రై చేస్తాను.
శివరాం: రాథోడ్ నాకు నా భార్యకు వయసైపోయింది కదా..? మమ్మల్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ను చూడు.
రాథోడ్: ఒకే సార్ ఒక్క మిస్సమ్మ లేకపోతే ఇంత మంది అవసరం ఉందని బయట పడింది సార్.
శివరాం: ఇన్ని రోజులు తను ఈ ఇంటిని పట్టించుకుంది కాబట్టి. మనం పట్టించుకునే అవసరం రాలేదు.
అంటూ శివరాం చెప్తుంటే.. రాథోడ్ నవ్వుతుంటాడు. ఇంతలో అమర్ లేచి పిల్లలను రెడీ చేయమని చెప్పి స్కూల్ లో డ్రాప్ చేసి వెళ్దామని అంటాడు. రాథోడ్ సరే అంటాడు. పిల్లలు టిఫిన్ చేయడానిక వచ్చి టిఫిన్స్ చూసి భయపడుతుంటారు.ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!