Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు కోపంగా భాగీకి నిజం చెప్పడానికి వెళ్లబోతుంటే గుప్త ఆపుతాడు. విధికి ఎదురు వెళ్లొద్దని నువ్వు నిజం చెప్పినచో నువ్వు ఎవరనేది భాగీకి తెలుస్తుందని నువ్వు విధికి ఎదురెళ్లిన ప్రతిసారి నీ కుటుంబానికి కష్టాలు తప్పవు అని హెచ్చరించి వెళ్తాడు. మరోవైపు రాథోడ్ పిల్లల్ని స్కూల్‌ లో డ్రాప్‌ చేసి వెళ్తాడు. పిల్లలను చూసిన రామ్మూర్తి దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు. పిల్లలు మాత్రం డల్లుగా రామ్మూర్తిని పలకరిస్తారు.


రామ్మూర్తి: ఏమైంది మా బంగారాలకు ఎందుకు అమ్మా అలా డల్లుగా ఉన్నారు.


అమ్ము: అది తాతయ్యా..


రామ్మూర్తి: ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అమ్మా.. లేకపోతే నాన్న ఏమైనా అన్నారా..?


అమ్ము: లేదు తాతయ్యా.. ప్రేయర్‌ కు లేట్‌ అవుతుంది వెళ్తాము.


ప్రిన్సిపాల్‌: వాచ్‌మెన్‌ ఎక్కడ చచ్చావు. నా చాంబర్‌లో టేబుల్ క్లీన్‌ చేయలేదు.


రామ్మూర్తి: అమ్మా ఇప్పుడే చేస్తాను..


అమ్ము: ఓరేయ్‌ మిస్సమ్మ తప్పు చేస్తే తాతయ్యతో ఎందుకు మాట్లాడకూడదు.


ఆకాష్‌: అసలు మిస్సమ్మ అమ్మ ఫోటో అలా చేస్తుందని మనం ఎప్పుడూ అనుకోలేదు.


అంజు: నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నా.. మీకు చెప్తూనే ఉన్నాను. ఇవాళ్టీ నుంచి మనం మిస్సమ్మకు సంబంధించిన వాళ్లతో ఎవరితో మాట్లాడకూడదు.


అని అంజు చెప్పగానే తాతయ్యకు హెల్ప్‌ చేద్దామని అమ్ము చెప్తే మేము చేయలేం అని ఆకాష్‌, ఆనంద్‌, అంజు వెళ్లిపోతారు. మరోవైపు మనోహరి రూంలోంచి బయటకు వచ్చి కత్తెర పట్టుకుని అటూ ఇటూ చూస్తుంది. కిటికీలోంచి గుప్త, ఆరు గమనిస్తుంటారు.


మనోహరి: భాగీ పిల్లల విషయంలో నీపై విషాన్ని నింపాను. ఇక అమర్‌ మనసులో కూడా నింపే కార్యక్రమం చూస్తున్నాను. అసలైన మనోహరిని పరిచయం చేసే టైం వచింది.


ఆరు: ఇది మిస్సమ్మ గదిలోకి ఎందుకు వెళ్తుంది.


గుప్త: విధ్వంసం సృష్టించేందుకు


ఆరు: ఏం మాట్లాడుతున్నారు గుప్త గారు.


గుప్త: అవును బాలిక. ఆ బాలిక చేయబోయే పని వలన ఇంట్లో వాళ్లు మనసులు ఇరిగిపోవును. మనఃశాంతి లేకుండా అయిపోవును.


ఆరు: మరి తెలిసి మీరెందుకు ఆపకుండా ఉండిపోయారు గుప్త గారు..


 అని ఆరు వెళ్లబోతుంటే గుప్త ఆపుతాడు. నువ్వు ఏం చేయోద్దని హెచ్చిరస్తాడు. ఇంతలో మనోహరి కత్తెర తీసుకుని వెళ్లి దేవుడి రూంకి ఉన్న కర్టెన్స్‌ కట్‌ చేసి వెళ్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన భాగీ కర్టెన్స్‌ చూసి ఎవరు ఇలా చేశారు అనుకుంటుంది. ఇంతలో మనోహరి వచ్చి పిల్లల అల్లరి రోజురోజుకు ఎక్కువై పోతుంది. ఉదయం అంజు కత్తెర పట్టుకుని తిరగడం చూశాను అని చెప్తుంది. అదే ఆరు అయితే పాత చీరలతో కర్టెన్స్‌ కుట్టేది అని మనోహరి చెప్పగానే సరే నేను కుడతాను అంటుంది భాగీ.


ఆరు: పాపం పిల్లల పేరు చెప్పగానే మనోహరి బుద్ది మర్చిపోయి మను చెప్పిన మాటలు వింటుంది మిస్సమ్మ. గుప్త గారు ఈ ఒక్కసారికి మిస్సమ్మను కాపాడే చాన్స్‌ ఇవ్వండి ఫ్లీజ్‌.


గుప్త: లేదు బాలిక ఇది ఆ బాలిక తీసుకున్న నిర్ణయం దానికి పూర్తి బాధ్యత ఆ బాలికే అనుభవించవలెను.


అని చెప్పి గుప్త వెళ్లిపోతాడు. మరోవైపు ఆరు చీరలు తీసుకొచ్చి భాగీకి ఇస్తుంది మనోహరి. కిటికీలోంచి చూసిన ఆరు షాక్‌ అవుతుంది.


భాగీ: ఎవరిది ఈ శారీ..


మనోహరి: ఇంట్లో పాత చీరల్నీ స్టోర్‌ రూంలో పెట్టి అవసరం ఉన్నప్పుడు బయటకు తీస్తారు.


భాగీ: అది ఈ చీర ఎవరిది..?


మనోహరి: ఆంటీ వాళ్ల చెల్లి కూతురుది అయ్యుంటుంది. ఎందుకలా అడుగుతున్నావు.


భాగీ: చీర పట్టుకోగానే ఎందుకో మనసుకు అదోలా అనిపించింది.


మనోహరి: అది మీ అక్క రక్తం అంటుకున్న చీర కాబట్టి.. మీ అక్క ప్రాణం పోయిన చీర కాబట్టి నీకలా అనిపించడం తప్పు కాదు. ( అని మనసులో అనుకుంటుంది మనోహరి.)


భాగీ: లేదు.. ఈ చీరతో నేను కర్టెన్‌ చేయలేను.


మనోహరి: ఏయ్‌ నీకేమైనా పిచ్చా.. అమర్‌ వచ్చే టైం అయింది. పిల్లల్ని కాపాడాలి అటే త్వరగా కర్టెన్‌ కుట్టు.. నీకు అంతగా చేతగాకపోతే ఇలా ఇవ్వు


 అంటూ మనోహరి ఆ చీరను లాక్కోగానే వద్దులే నేను కుడతాను అని చీర తీసుకుని వెళ్లిపోతుంది భాగీ. దీంతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. కిటికీలోంచి చూస్తున్న ఆరు ఇప్పుడెలా అనుకుంటూ ఏడుస్తుంది. చీరను తీసుకుని వెళ్లిన భాగీ కర్టెన్‌ కుడుతుంది. ఆరు గార్డెన్‌ లోకి గుప్త దగ్గరకు వెళ్లి ఎలాగైనా మిస్సమ్మను కాపాడతాను అని అడుగుతుంది. గుప్త పలకడు. మరోవైపు లోపల భాగీ కర్టెన్‌ కుట్టి బాగుంది అనుకుని లోపలికి వెళ్తుంది. ఇంతలో అమర్‌ వస్తాడు. ఆరు కంగారుపడుతుంది. లోపలికి వెళ్లిన అమర్‌, నిర్మల, శివరాం కర్టెన్‌ చూసి షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!