Nindu Noorella Saavasam Serial Today Episode:  ఎటువంటి పరిస్థితుల్లోనైనా హోం వర్క్‌ చేసే అమ్ము కూడా ఇవాళ చేయడం లేదంటే పాపం నా కోసం ఎంత ఆలోచిస్తుందో అని అంజు మనసులో అనుకుంటుంది. ఇంతలో అమ్ము కూడా ఏమీ అర్థం కావడం లేదురా..? అంటుంది. ఆనంద్‌, ఆకాష్‌ కూడా జరిగింది ఎలా మర్చిపోతాము అక్కా అంటారు. ఇంతలో అక్కడకు భాగీ వచ్చి వింటుంది. ఇక అంజు మీ ప్రేమ నాకు అర్థం అవుతుంది. ఇంత ప్రేమ నేను తట్టుకోలేను అంటుంది. దీంతో ఆనంద్‌, ఆకాష్‌, అమ్ము ప్రేమనా..? ఎవరి మీద అని అడుగుతాడు.


అంజు: మీరు అంటుందేంటో నాకు అర్థం కావడం లేదు. మీరు నాకోసమే కదా..? ఇంతలా బాధపడతున్నారు.


భాగీ: నాకు కూడా ఏమీ అర్థం కాలేదు.


 అంజు:  మీరు కిడ్నాప్‌ గురించే కదా బాధపడుతున్నారు.


ఆనంద్‌: చీచీ కాదు టూర్‌ కాన్సిల్ అయిందని..


ముగ్గురు అదే మాట చెప్పగానే అంజు షాక్‌ అవుతుంది. ఇంత సేపు నా మీద ఎంత ప్రేమ అనుకున్నాను కదరా అని మనసులో అనుకుంటుంది. మరోవైపు అరవింద్‌ పంపించిన వినోద్‌ అమర్‌ ఇంటి దగ్గరకు వచ్చి సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉందని అరవింద్‌కు ఫోన్‌ చేసి చెప్తాడు. ఎంత సెక్యూరిటీ ఉన్నా లోపలికి వెళ్తానని కానీ లోపల అమరేంద్ర ఉంటాడు కదా అంటాడు వినోద్‌. నువ్వు లోపలకి వెళ్తానంటే అమరేంద్ర అక్కడ లేకుండా చేస్తానని అరవింద్‌ చెప్తాడు. తర్వాత అరవింద్‌ అమర్‌కు కాల్‌ చేస్తాడు.


అమర్‌: రాథోడ్‌ ఏదో అనౌన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది. ఆఫీసుకు ఫోన్‌ చేసి ట్రేస్‌ చేయమని చెప్పు.


రాథోడ్‌: అలాగే సార్‌.. (అంటూ రాథోడ్‌ పక్కకు వెళ్లి వస్తాడు.) సార్‌ ట్రేస్‌ చేస్తున్నారు. మీరు కాల్‌ లిఫ్ట్ చేయండి.


అరవింద్‌:  హలో సార్‌ ఎలా ఉన్నారు కూతురు ఇంటికి వచ్చిందన్న ఆనందంలో ఉన్నట్లు ఉన్నారు,


అమర్‌: రేయ్‌ ఇంకోసారి నా పిల్లల జోలికి వస్తే చంపేస్తాను. నీకు కావాల్సింది నేనే కదా..? రా నేరుగా తేల్చుకుందాం.. అది వదిలేసి నా ఫ్యామిలీని ఎందుకు టచ్‌ చేస్తున్నావు.


అరవింద్‌: నాకు కావాల్సింది మీ చావే సార్‌. కానీ నేరుగా ఎదుర్కోలేను కదా..? కానీ గుర్తు పెట్టుకోండి సార్‌ నీ చావు నేనే.. 


అమర్‌: నేను గుర్తు పెట్టుకోవడం కాదు. నువ్వు గుర్తు పెట్టుకో నీ ఓటమి పేరు లెఫ్టినెంట్‌ అమరేంద్ర.


అరవింద్‌: మీరు రాత్రంతా కాపలా కాసినా మీ కుటుంబాన్ని కాపాడుకోలేరు సార్‌. మీరు చేస్తుంది ఓడిపోయే యుద్దం సార్‌.


అమర్‌: ఎముకలు గడ్డకట్టే చలిలో ప్రాణాలు లెక్క చేయకుండా దేశ రక్షణ చేసే ఇండియన్‌ ఆర్మీతో మాట్లాడుతున్నావని మర్చిపోవద్దు. కళ్ల ముందు శవాలు ఉన్నా… చుట్టూ శత్రువులు ఉన్నా.. భయం లేకుండా ముందుకు సాగే ఆర్మీతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు యుద్దం ఎలా చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నా..


అంటూ అమర్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఇంతలో రాథోడ్‌ ఆఫీసు నుంచి ఫోన్‌ వస్తుంది.  ఆ  టెర్రరిస్టు లోకేషన్‌ షేర్‌ చేశామని ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్తాడు. అమర్‌, రాథోడ్‌ను తీసుకుని ఆ లోకేషన్‌కు అమర్‌ వెళ్లబోతుంటే భాగీ వద్దని వారిస్తుంది. అయినా వినకుండా అమర్‌, రాథోడ్ వెళ్తారు. వాళ్లు వెళ్లిన తర్వాత బయట గమనిస్తూ ఉన్న వినోద్‌ వాళ్లు స్మోక్‌ బాంబులు వేయడంతో సెక్యూరిటీ వాళ్లు స్పృహ కోల్పోతారు. దీంతో గేట్లు తెరుచుకుని టెర్రరిస్టులు అమర్‌ ఇంట్లోకి వస్తారు. వాళ్లను చూసిన ఆరు భయంతో  కాపాడమని గుప్తను అడుగుతుంది.


    నువ్వు మా లోకానికి వస్తానని మాటిస్తే మీ వాళ్లను కాపాడతానని చెప్తాడు. మాట ఇవ్వలేనని ఆరు అంటుంది. ఇంతలో తాను వెళ్లిన దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో అమర్‌, రాథోడ్‌ రిటర్న్‌ అవుతారు. ఇంతలో మెయిన్‌ డోర్‌ దగ్గరకు వచ్చిన తీవ్రవాదులు డోర్‌ కొడుతుంటే మనోహరి, నిర్మల భయపడుదూ హాల్లో లోకి వస్తారు. శివరాం వచ్చి వాళ్లను లోపలకి పంపిస్తాడు. అమర్‌ ఫోన్‌ చేసి నేను వచ్చే వరుక వాళ్లను ఎలాగైనా డైవర్ట్‌ చేయమని చెప్తాడు. అలాగే అంటాడు శివరాం.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!