Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ ఇంటికి సెక్యూరిటీగా స్పెషల్‌ ఫోర్స్‌ వస్తుంది. పిల్లలను మీకు కావాల్సిన వాళ్లను ఇంటికి రమ్మని చెప్పండి సార్‌ అని సెక్యూరిటీ వాళ్లు పొజిషన్‌ తీసుకుంటారు. అమర్‌ సరేనని రామ్మూర్తిని మంగళను కూడా ఇంటికి రమ్మనమని భాగీకి  చెప్తాడు. సరే అంటుంది భాగీ.


మనోహరి: అమర్‌.. ఆ స్లమ్‌ లో ఉన్నవాళ్లు మనకు కావాల్సిన వాళ్లు అని అస్సలు నమ్మరు. ఇలాంటప్పుడు అలాంటి వాళ్లను ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు..?


అమర్‌: అలాంటి వాళ్లు అంటే ఎలాంటి వాళ్లు మనోహరి.. వాళ్లు నా వాళ్లు.. ఆయన నా మామయ్య, ఆవిడ ఆయన భార్య. వాళ్లు ఎక్కడున్నా ఎలా ఉన్నా..? నా వాళ్లే..


మనోహరి: నువ్వు ఇంకోలా  అనుకున్నావు అమర్‌..


అమర్‌: ఎలా అనుకున్నా ఇంకోసారి వాళ్లను తక్కువ చేసి మాట్లాడకు.


 అంటూ మనోహరికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు అమర్‌. ఆరు పరుగెత్తుకుంటూ వెళ్తుంది.


ఆరు: గుప్త  గారు జరిగేది చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. నాకోసం ఒక్కసారి మాయా పేటికను తెరవండి.


గుప్త:  జరిగేది విధి లిఖితం. అది ముందే తెలుసుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఇంకోసారి ఆ మాయా పేటిక గురించి నాతో మళ్లీ మాట్లాడొద్దు.


 అని చెప్పి గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిస్సమ్మ, రామ్మూర్తికి ఫోన్‌ చేసి మీరు, పిన్ని అర్జెంట్‌ గా ఇంటికి రండి అని చెప్తుంది. దీంతో రామ్మూర్తి ఏంటమ్మా.. ఏమైంది ఏదైనా సమస్యా అని అడుగుతాడు.  ఏం లేదని మీరైతే ఇప్పుడే ఇంటికి రండి అని చెప్తుంది. ఇంటికి వెళ్లడానికి ప్రిన్సిపాల్‌ పర్మిషన్‌ ఇస్తుందో లేదో అనుకుంటూ రామ్మూర్తి మేడం దగ్గరకు వెళ్తాడు. 


రామ్మూర్తి: మేడం అర్జెంట్‌ గా పని పడింది. ఇంటికి వెళ్లాలి. కావాలంటే రేపు ఇంకా ఎక్కువ పనులు చేస్తాను.


ప్రిన్సిపాల్‌: ఎన్నిసార్లు చెప్పాలి మీరు ఇలా అడగొద్దని..


రామ్మూర్తి: ఎంతో అవసరం ఉంటేనే కదా మేడం అడిగేది.


ప్రిన్సిపాల్‌: సరే అయితే వెళ్లండి. పర్మినెంట్‌ గా వెళ్లిపోండి. ఉద్యోగంలోంచి తీసేస్తాను.


రామ్మూర్తి:  సరేలే మేడం ఏమీ వద్దు ఇక్కడే ఉంటాను


 అంటూ గేటు దగ్గరకు వెళ్లిపోతాడు రామ్మూర్తి.  అంజలి క్లాస్‌ దగ్గరకు వెళ్లి వినోద్‌ అంజలిని తీసుకుని వెళ్తుంటాడు. ఇంతలో రాథోడ్‌ స్కూల్‌ దగ్గరకు వస్తాడు. అక్కడ రామ్మూర్తిని చూసి సార్‌ మీరు మళ్లీ జాబ్‌ చేస్తున్నారా..? అని అడుగుతాడు. రామ్మూర్తి కంగారు పడి ఇంట్లో ఈ విషయం ఎవరికి చెప్పొద్దని.. నువ్వేంటి ఈ టైంలో వచ్చావని రామ్మూర్తి, రాథోడ్‌ ను అడుగుతాడు.


రాథోడ్‌: పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను సార్‌.


రామ్మూర్తి: అవును  ఇంతకముందే భాగీ కూడా నాకు ఫోన్‌ చేసి నన్ను మంగళను  ఇంటికి రమ్మని చెప్పింది ఏమైంది రాథోడ్‌.


రాథోడ్‌: మిస్సమ్మ మీకు చెప్పలేదా..? సార్‌


రామ్మూర్తి: విషయం ఏంటని చెప్పలేదు కానీ అర్జెంట్‌గా రమ్మంది. ఏదైనా సమస్యనా రాథోడ్‌


రాథోడ్‌: అయ్యో ఈయనకు నిజం తెలిస్తే ఇంకేమన్నా ఉందా..? ( అని మనసులో అనుకుని ) ఏదో గుడితో పూజ గురించి అని అనుకున్నారు సార్‌. అయినా మీరు ఉండండి నేను పిల్లలను తీసుకుని వస్తాను.


 అంటూ లోపలికి వెళ్లిన రాథోడ్‌, అమ్ము, అకాష్‌, ఆనంద్‌లను తీసుకుని అంజు క్లాస్‌ రూం దగ్గరకు వెళ్లి కనుక్కోగా టీచర్‌ ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకెళ్లారు అని చెప్తుంది. రాథోడ్‌ భయంగా టీచర్‌ ను తిట్టి ముగ్గురు పిల్లలను తీసుకుని అంజును వెతుకుతుంటాడు. మరోవైపు వినోద్‌ అంజును తీసుకుని వెళ్లడం గమనించిన రామ్మూర్తి వెళ్లి వినోద్‌ ను కొడతాడు. ఇంతలో రాథోడ్‌ పిల్లలు అక్కడకు వస్తారు. అందరూ కలిసి వినోద్‌ ను కొడుతుంటే వినోద్‌ పారిపోతాడు. అసలు ఏం జరుగుతుంది రాథోడ్‌ అని రామ్మూర్తి అడగ్గానే మీరైతే అర్జెంట్‌ గా ఇంటికి రండి సార్‌ అంటూ పిల్లలను తీసుకుని వెళ్లిపోతాడు రాథోడ్‌. మరోవైపు ఈ ఇంట్లో ఏదో జరగబోతుంది. అదేంటో మాయా దర్పణంలో చూద్దామనుకుని మంత్రం చదవగానే దర్పణం వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!