Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీతో మాట్లాడటానికి కరుణ ఫోన్‌ చేస్తుంది. భాగీ అక్కడ ఉండదు. అక్కడే ఉన్న  అమర్‌ చూస్తాడు. కంటిన్యూగా అలాగే ఫోన్‌ చేస్తుంటే అమర్‌ లిఫ్ట్‌ చేస్తాడు. వెంటనే కరుణ ఏదేదో మాట్లాడుతుంది. మాట్లాడుతూనే అంతా నేనే మాట్లాడుతున్నాను నువ్వేమీ మాట్లాడవా..? అంటూ అడుగుతుంది. దీంతో అమర్‌ అంతా నువ్వే మాట్లాడుతున్నావు నాకు టైం ఎక్కడ ఇచ్చావు అంటాడు. దీంతో కరుణ షాక్‌ అవుతుంది.


కరుణ:  అమరేంద్ర  గారు మా భాగీకి బైక్‌ నేర్పిస్తామన్నారు.. నేర్పించవచ్చు కదా..?  అప్పుడప్పుడు దాని గురించి జరంత పట్టించుకోండ్రి. దానికి ఇవ్వడమే తెలుసు కానీ అవసరమైనా అడగడం మాత్రం తెలియదు. నేనేమైనా తప్పుగా చెప్తున్నానా..?


అమర్‌: తప్పేం కాదు..


కరుణ: అయితే దానికి స్నానం చేశాక సాంబ్రాణి వేసుకోవడం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయ్యాక మొగుడితో సాంబ్రాణి వేయించుకుంటానని ఎప్పుడు చెప్పేది.


అంటూ కరుణ ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత అమర్‌ మెల్లగా కిచెన్‌ లోకి వెళ్లి ఎవ్వరూ చూడకుండా సాంబ్రాణి తీసుకుని వెళ్తుంటే నిర్మల చూస్తుంది. అమర్‌ ఏమైనా కావాలా..? అని అడుగుతుంది. అమర్‌ కంగారుగా ఏమీ వద్దని మీకేమైనా కావాలంటే రాథోడ్‌ ఉన్నాడేమోనని చూస్తున్నాను అంటూ వెళ్లిపోతుంటే శివరాం వస్తాడు.. ఏమైంది అమర్‌ చేతులు ఎందుకు వెనక్కి పెట్టుకున్నావు అని అడుగుతాడు. నేనేం దాయలేదని అమర్‌ చెప్తాడు. శివరాం అనుమానంగా వెళ్లిపోతాడు. ఇంతలో మనోహరి వచ్చి అమర్‌ ఏంటది దాస్తున్నావని అడుగుతుంది. ఏమీ లేదని చెప్తూ.. అమర్‌ వెళ్లిపోతాడు.  ఇంట్లో ఒక్క పని చేయడానికి ఇంత యుద్దం చేయాలా..? అనుకుంటూ రూంలోకి వెళ్లి సాంబ్రాణి దూపం వేస్తాడు. స్నానం చేసి బయటకు వచ్చిన భాగీ ఆశ్చర్యంగా చూస్తుంది.


భాగీ: ఏవండి ఏమో చేస్తున్నారు  ఏంటది..?


అమర్‌: సాంబ్రాణి దూపం వేస్తున్నాను.


భాగీ: అత్తయ్య ఇచ్చారా..? నేను తల స్నానం చేస్తానని గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చారా..? సారీ నేనే తెచ్చుకోవాల్సింది.


అమర్‌, మిస్సమ్మను రోమాంటిక్‌ గా చూస్తూ..


అమర్‌: అమ్మ ఇవ్వలేదు. నేనే తీసుకొచ్చాను.


భాగీ: ఎందుకని తెచ్చారు..?


అమర్‌:  నీకోసమే తీసుకొచ్చానని ఎలా చెప్పాలి (అని మనసులో అనుకుంటుంటే..)


భాగీ:  నాతో ఏదైనా మాట్లాడారా..?


అమర్‌: అవును సాంబ్రాణి నీకోసమే తీసుకొచ్చాను.


 అని అమర్‌ చెప్పగానే సరేనని సాంబ్రాణి తీసుకుని మిస్సమ్మ వెళ్తుంటే.. సాంబ్రాణి నేనే వేస్తాను అంటాడు అమర్‌. సరే అంటుంది మిస్సమ్మ. అమర్‌ సాంబ్రాణి వేస్తుంటే మిస్సమ్మ రొమాంటిక్‌ గా ఫీలవుతుంది. గార్డెన్‌లో ఉన్న గుప్త ఆరును బలవంతంగా అమర్‌ రూం దగ్గరకు తీసుకొచ్చి కిటికీలోంచి లోపల అమర్‌, భాగీకి సాంబ్రాణీ వేయడం చూపిస్తాడు. అది చూసిన ఆరు బాధపడుతుంది. ఇది చూపించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా..? అంటూ గుప్తను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గుప్త నవ్వుతూ వెళ్లిపోతాడు. 


పిల్లల్ని టిఫిన్‌ చేయండి అంటూ నిర్మల పిలుస్తుంది. బయటకు వచ్చిన అంజు, అమ్ము, ఆకాష్‌.. టిఫిన్‌ చేయబోతుంటే అంజు మాత్రం నిర్మల చేసిన టిఫిన్స్‌ మీద జోకులు వేస్తుంది. దీంతో నిర్మల అంజును తిడుతుంది. పైనుంచి రూంలోంచి వస్తున్న  ఆనంద్‌ భాగీ రూంలోంచి పొగలు రావడం చూసి కిందకు వచ్చి అందరికీ చెప్తాడు. అందరూ భయంగా పైకి వెళ్తారు. శివరాం భాగీని పిలుస్తాడు. రూంలోంచి పొగలు వస్తున్నాయి ఏంటని అడుగుతాడు. సాంబ్రాణి వేసుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో నిర్మల నేను వచ్చి సాయం చేయాలా..? అని అడుగుతుంది. దీంతో ఏమీ వద్దని మీ అబ్బాయి చెప్పమంటున్నాడు అత్తయ్యా అనగానే అందరూ నవ్వుతూ వెళ్లిపోతారు. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!