Nindu Noorella Saavasam Serial Today Episode:    అమావాస్య వచ్చింది ఆరు శక్తులు తగ్గి ఉంటాయి. ఘోర ఏమైనా ప్లాన్‌ చేశాడా..? అని మనోహరి అనుకుంటుంటే ఇంతలో వెనక నుంచి డోర్‌ సౌండ్‌ వినిపించి మనోహరి భయంతో ఏయ్‌ నేను నిన్ను ఏమీ అనలేదని నా దగ్గరకు రావొద్దు అంటుంది. వెనక నుంచి ఎవరో వచ్చి వీపు మీద చేయి వేయగానే భయంతో వణికిపోతుంది మనోహరి. ఇంతలో ఎందుకు మనోహరి అంత భయపడుతున్నావు అని భాగీ అడుగుతుంది. భాగీ వాయిస్‌ విన్న మనోహరి రిలాక్స్‌ గా ఊపిరి పీల్చుకుంటుంది.


భాగీ: చూడు మను సాటి ఆడపిల్లగా నీకొక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నీది కాని దానికోసం యుద్దం చేయడం వృథా. మనిషి ఏం చేసినా.. ఎంత సాధించినా దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే ఆ గెలుపుకు విలువ ఉండదు. నువ్వు చేసే యుద్దంలో గెలుసు నీదే అయితే నువ్వు అందరినీ కోల్పోతావు. నా మాట విని ఇదంతా ఇంతటితో ఆపేసి.. ఈ ఇంటికి ఇంట్లో వాళ్లకు దూరంగా వెళ్లిపో..


మనోహరి: ఏయ్‌ ఏంటి పిచ్చి కానీ పట్టిందా..? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. నేను నీ గురించి సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఇంకా ఇంట్లో ఉంటున్నావు. అదే నేను తలుచుకుంటే..


భాగీ: తలుచుకో.. నాకు చూడాలని ఉంది నువ్వు తలుచుకుంటే ఏం జరుగుతుందో.. కానీ నేను తలుచుకుంటే ఎం జరుగుతుదో తెలుసా..? పదే పది నిమిషాల్లో నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. చూడు మను అక్క చావుకు నువ్వే కారణం అని అనుమానంగా ఉంది. అది నిజం అని చిన్న సాక్ష్యం దొరికినా.. నిన్ను వదిలిపెట్టను. నా సహనానికి పరీక్ష పెట్టాలని చూస్తే నేనే తీసుకోబోయే నిర్ణయంతో చాలా బాధపడతావు.



   అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది భాగీ. మనోహరి ఇరిటేటింగ్‌ గా చూస్తుంది.  మరోవైపు అమర్‌ రూంలో అమర్‌ పక్కన బెడ్ మీద పడుకుని ఉంటుంది ఆరు. అమర్‌ కూడా నిద్ర మత్తులో ఆరు పక్కన ఉన్నట్లు మాట్లాడతాడు. నిద్ర లేవమని చెప్తాడు. ఆరు ఇవాళ ఆదివారం అని చెప్పడంతో అమర్‌ తిరిగి చూసి షాక్‌ అవుతాడు. ఇంతలో కాఫీ తీసుకుని భాగీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో ఎవరో చేయి వేసినట్టు అనిపించింది అని అమర్‌ చెప్పగానే నేను లేకున్నా ఉన్నట్టు కలగంటున్నారా..? అని భాగీ అడగ్గానే అమర్‌ కోపంగా భాగీని తిడతాడు. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశం జరుగుతుంది.


భాగీ: అయినా ఎప్పుడు లేనిది ఇప్పుడెందుకు ఎవరో చేయి వేసినట్టు అనిపించింది.


అమర్‌: అది ఎవరో కాదు..


భాగీ: మరి ఎవరు..?


అమర్: ఆరు.. ఆరులా అనిపించింది. గుండెల మీద తను వేసిన చేయి అచ్చం ఆరులానే అనిపించింది. తనను ఎంత మిస్‌ అవుతున్నానో నాకే తెలుసు. కానీ ఎందుకో తెలియదు తను నా చుట్టూనే ఉందన్న ఫీలింగ్‌ ఉంది.


అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు. భాగీ, అక్కడే ఉన్న ఆరు ఎమోషనల్ అవుతారు. మరోవైపు యముడు మయపాశం పట్టుకుని ఆరు కోసం రెడీగా ఉంటాడు. గుప్తను ఆ బాలిక వచ్చిందా..? అని అడుగుతాడు.. రాలేదని గుప్త చెప్తాడు.


యముడు: ఆ బాలికను తీసుకుని యమపురికి వెళ్లవలెనని నీకు ఉన్నదా..? లేదా..?


గుప్త: ఉన్నది ప్రభు


యముడు: అటులైన ఆ బాలిక కొరకు చూడకుండా నాకెందుకు లేదు అని చెప్తున్నావు. నిజము చెప్పు గుప్త. ఆ బాలిక సాకుతో నువ్వు కూడా ఇక్కడ సకల భోగాలు అనుభవిస్తున్నావు కదా..?


గుప్త: ఏమని సెలవిచ్చితిరి ప్రభు.. ఆ మాట అనుటకు మీకు నోరు ఎటుల వచ్చింది ప్రభు. ఈ పాపుల మధ్య నేను నలిగిపోతుంటిని ప్రభు.


అంటూ భూలోకం వచ్చినప్పటి నుంచి గుప్త పడిన కష్టాలు చెప్పి బాధపడుతాడు. దీంతో యముడు సరే కానీ ఆ బాలికను త్వరగా కనిపెట్టి మన లోకమునకు తీసుకెళ్లవలెను. ఇద్దరూ కలిసి వేషాలు మారుస్తారు. యముడు పాముగా గుప్త పాములోడిగా మారిపోతారు. ఈ వేషాల్లో నాటకం ఆడి ఆ బాలికను యమపురికి తీసుకెళ్లాలని అనుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


Also Read:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!