Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఫొటో గురించి ఇంట్లో జరిగిన రచ్చ గురించి ఆలోచిస్తుంటాడు. ఇక లక్ష్మీ విహారి తెలీకుండా విహారి చేత ఆశీర్వాదం తీసుకోవాలని అందుకు సాయం చేయమని పండుని తీసుకొని వెళ్తుంది. ఇద్దరూ విహారి గదికి అక్షింతలు తీసుకొని వెళ్తారు. విహారి లేచి లక్ష్మీ దగ్గరకు వెళ్లబోయి పడిపోబోతే లక్ష్మీ పట్టుకుంటుంది. విహారి థ్యాంక్స్ చెప్తాడు.
ఇంతలో పండు వచ్చి జ్యూస్ కావాలా టీ కావాలి అని హడావుడి చేస్తాడు. ఇక లక్ష్మీ విహారికి అక్షింతలు ఇచ్చి తులసి కోటకు పూజ చేశాను అని చెప్పి తల మీద వేసుకోమని చెప్తుంది. ఇక లక్ష్మీ ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి పక్కకు వెళ్తుంది. మరోవైపు సహస్ర కూడా విహారికి మందులు ఇవ్వడానికి అటుగా వస్తుంటుంది. లక్ష్మీ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి పండుకి సైగ చేస్తుంది. విహారి ట్యాబ్లెట్స్ ఇస్తున్నట్లు కింద పడేస్తుంది. వాటిని తీసుకోవడానికి విహారి కాళ్ల కింద కూర్చొంటుంది. ఆ టైంలో పండు విహారిని కూర్చొండి అని కంగారు పెట్టి విహారి చేతిలోని అక్షింతలు లక్ష్మీ తల మీద పడినట్లు విహారిని నెట్టుతాడు. లక్ష్మీ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషిస్తుంది. పండు సాయంతో విహారి పాదాలకు మొక్కుతుంది. అక్షింతలు కింద పడిపోయావని విహారి లక్ష్మీకి సారీ చెప్తాడు. లక్ష్మీ పర్వాలేదని అంటుంది. ఇంతలో సహస్ర వచ్చి లక్ష్మీ, పండులను అక్కడి నుంచి తరిమేస్తుంది. అయిన దానికి కాని దానికి రావొద్దని చెప్తుంది. అక్షింతలు గురించి సహస్ర అడిగితే అనుకోకుండా చేయి జారిపోయావని విహారి చెప్తాడు. ఇక విహారి కోసం తాను పూజ చేయించానని కంకణం కడతానని పండు అంటాడు.
సహస్ర వద్దని ఆపుతుంది. అభిమానంతో తెస్తే వద్దు అంటావేంటి అని విహారి అంటే బావకి ఏం చేసినా నేనే చేయాలి అని దాన్ని సహస్ర తీసుకొని విహారి చేతికి కడుతుంది. తర్వాత సహస్ర విహారిని బెడ్ మీద పడుకోపెడుతుంది. లక్ష్మీ ట్యాబ్లెట్స్ పట్టుకెళ్లిపోవడంతో లక్ష్మీ దగ్గరకు సహస్ర వెళ్తుంది. మరోవైపు అంబిక, సుభాష్‌లు ఫొటో స్టూడియోకి వెళ్తారు. అక్కడ విహారి, లక్ష్మీల పెళ్లి ఫొటో ఉంటుంది. అంబిక ఫోటో చూపించి ఫొటో మీరే తీశారా అని అడిగితే మేం తీయలేదు అని ఆయన చెప్తాడు. మీ అడ్రస్ ఎందుకు ఉందని అడిగితే ఎవరో పాపులర్ అయినా మా స్టూడియో ఫొటో పెట్టుకున్నారని అంటాడు. మొత్తానికి అంబిక వాళ్లని పంపేస్తాడు. ఆ స్టూడియో వ్యక్తి తమకు అబద్ధం చెప్తున్నాడని అంబిక సుభాష్‌తో అంటుంది. అలా ఏం కాదు అని సుభాష్ అంటాడు. తీరా చూస్తే ఆ స్టూడియోలో విహారి, సత్య ఉంటారు.
ఏఐలో చేసిందని చెప్పినా అంబికా అత్తయ్య ఎందుకు ఎంక్వైరీ చేస్తుందో అని ఇకపై జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. ఇక విహారి స్టూడియో అతనికి థ్యాంక్స్ చెప్తారు. ఇక అక్కడే ఉన్న విహారి, లక్ష్మీల ఫొటో విహారి చూస్తాడు. షాక్ అయిపోతాడు. ఆ ఫొటో విహారి తీసుకొని అంబిక చూడకపోవడం అదృష్టం అనుకుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే హాల్‌లో విహారి ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. పంతులు కూడా వస్తారు. అందరూ విహారిని పిలుస్తారు. విహారి జాతకం తెలుసుకున్నామని జాతకంలో కొన్ని లోపాలు ఉన్నాయని సహస్ర కుంకుమార్చన వ్రతం చేయాలని అంటున్నారని అందుకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని పెళ్లి అయిన వెంటనే సహస్రతో కుంకుమార్చన వ్రతం చేయాలని చెప్తారు. దానికి విహారి పెళ్లికి రెండు నెలలు ఆగుదామని అనుకున్నాం కదా అంటే అందరూ విహారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీని ఎదురుగా పెట్టుకొని సహస్రతో కొత్త జీవితం ప్రారంభించడానికి ఏదోలా ఉందని విహారి అనుకుంటాడు. విహారి చేతులు సహస్ర పట్టుకొని మనం ఒకటి అవ్వాలని అందరూ ఎదురు చూస్తుంటే నువ్వు ఎందుకు బావ వెనకడుగు వేస్తున్నావని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ మీ కన్న కొడుకు అని నాకు తెలుసు చిన్న మామయ్య: చక్రవర్తిని నిలదీసిన సత్య