Nindu Noorella Saavasam Serial Today Episode: నగలు తీసుకుని బయటకు వెళ్తున్న నీలను రాథోడ్ అపడంతో నీల భయపడుతుంది. ఏంటి బ్యాగులో అని అడుగుతాడు రాథోడ్. పాడయిపోయిన కూరగాయలు బయట పేదవాళ్లకు ఇద్దామని తీసుకెళ్తున్నానని చెప్తుంది నీల. అయితే డౌటుగానే రాథోడ్ లోపలికి వెళ్లిపోతాడు. నీల బ్యాగుతో వెళ్లడం చూసిన ఆరుంధతి దగ్గరకు వెళ్లి ఏంటి అడుగుతుంది. వినడబనట్లు నీల నడుచుకుంటూ వెళ్తూ.. కిందపడిపోతుంది. దీంతో బ్యాగులో ఉన్న నగలు కిందపడతాయి. నగలు చూసిన అరుంధతి షాక్ అవుతుంది. నీల అటూ ఇటూ చూస్తూ ఎవరూ చూడలేదని బ్యాగు సర్ధుకుని వెళ్లిపోతుంది. రాథోడ్ మిస్సమ్మ దగ్గరకు వెళ్తాడు.
రాథోడ్: మిస్సమ్మ.. ఆ నీల, మనోహరి అమ్మగారు కలిసి ఏదో చేస్తున్నారమ్మా...
మిస్సమ్మ: ఏమంటున్నావు రాథోడ్ నాకేం అర్థం అవ్వటం లేదు.
రాథోడ్: పనిమనిషి నీల బ్యాగు తీసుకుని బయటకు వెళ్లింది. ఎవరైనా చూస్తారేమోనన్న కంగారు ఎవరికైనా దొరికిపోతామేమో అన్న కంగారు ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించాయి.
మిస్సమ్మ: మరి ఈ ఇంటికి కాబోయే పెద్దమనిషి ఎక్కడుంది.?
రాథోడ్: ఆవిడ కూడా ఎక్కడికో వెళ్తుంది మిస్సమ్మ..
మిస్సమ్మ: అయితే పక్కాగా ఈ పెద్దమనిషి ఎదో చేయబోతుంది. దానికి సంబంధించిందే పనిమనిషికి ఇచ్చి పంపించింది. ఇప్పుడు మనం మనోహరిని ఫాలో చేస్తే ఇద్దరు చేసే గూడుపుఠాణి కనిపెట్టొచ్చు. పదండి వెళ్దాం..
అంటూ ఇద్దరూ బయటకు వెళ్తారు. మరోవైపు ఒక దగ్గర నిలబడ్డ నీల భయపడుతూ మనోహరి కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో అరుంధతి నీల దగ్గరకు వచ్చి నగలు ఎందుకు దొంగతనంగా ఇక్కడికి తీసుకొచ్చావు అంటూ అడుగుతుంది. నీలకు వినబడకపోవడంతో అలాగే చూస్తుండిపోతుంది. దీంతో కోపంగా అరుంధతి గట్టిగా అరిచేసరికి నీల అదిరిపడుతుంది.
నీల: ఎవరు నా చెవిలో అరిచింది ఎవరు? కొంపదీసి అరుంధతి అమ్మగారు ఆవిడ నగలు తీసుకెళ్తున్నానని నావెంట వచ్చిందా?
అరుంధతి: వచ్చానే.. వచ్చాను కాబట్టే నీ అసలు రంగు బయటపడింది.
నీల: అరుంధతి అమ్మా మీరే కనుక ఇక్కడ ఉంటే ఈ నగలు నాకు ఇచ్చి ఇక్కడకు తీసుకురమ్మని చెప్పింది మనోహరి అమ్మగారేనమ్మా..
అనడంతో అరుంధతి షాక్ అవుతుంది. మీకు దండం పెడతానమ్మా ఇందులో నా తప్పేం లేదమ్మా అంటూ అక్కడి నుంచి మరోచోటికి వెళ్తుంది. మరోవైపు రాథోడ్, మిస్సమ్మ కారులో మనోహరిని ఫాలో అవుతుంటారు. ఇంతలో వాళ్లకు వేరే వెహికిల్ అడ్డురావడంతో మనోహరి తప్పించుకుని వెళ్లిపోతుంది. మనోహరి ఎటు వెళ్లిందోనని ఆలోచిస్తూ.. ఎటైతే అటేనని రైట్ వెళ్దాం అని మిస్సమ్మ చెప్పడంతో రాథోడ్ రైట్ సైడ్ వెళ్లిపోతారు. మరోవైపు నీల ఒక దగ్గర కూర్చుని భయపడుతుంటే వెనక నుంచి మనోహరి వచ్చి భుజం మీద చెయ్యి వెయ్యగానే మరింత భయంగా అరుస్తుంది. అరుంధతి వచ్చినట్లుంది అని చెప్పగానే అదేం లేదు అంటూ షాపు లోపలికి వెళ్లి తను తీసుకొచ్చిన నగలకు డూప్లికేట్ నగలు చేయాలని చెప్తుంది. ఇంతలో అక్కడికి అమర్ వస్తాడు. మను కారు ఇక్కడుందేంటి అంటూ షాప్ లోపలికి వెళ్తాడు. మను అంటూ పిలవగానే మనోహరి షాక్ అవుతుంది.
అమర్: ఇక్కడేం చేస్తున్నావు మనోహరి. ఏమైంది నన్ను చూసి ఎందుకు కంగారుపడుతున్నావు. ఈ షాపులో నీకేంటి పని.
అరుంధతి: మా ఆయనకు అడ్డగా దొరికిపోయావు మను
మనోహరి: అమర్ నీకోసమే వచ్చాను. నీకోసమే చైన్ చేయిద్దామని వచ్చాను.
అనగానే నాకెందుకు చైన్ అంటూ కానీ నీ సెంటిమెంట్‌ను నేను కాదనలేను అని చెప్తాడు. మరోవైపు మిస్సమ్మ, రాథోడ్ షాపు ముందర అమర్, మను కారు చూసి అక్కడే ఆగిపోతారు. బయటకు వచ్చిన అమర్‌ను మిస్సమ్మ మీరిక్కడ అని అడగ్గానే మనోహరి కారు ఇక్కడ కనిపించగానే ఆగాము అని చెప్తాడు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు రాంమూర్తి పంతులును పిలిపించి మిస్సమ్మ జాతకం చెప్పమంటాడు. జాతకం చూసి మంచి సంబంధం ఉంటే చెప్పండి అనగానే పంతులు మూడు రోజుల్లో ఈ అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు సంబంధాలు చూడమంటున్నారు అంటూ ప్రశ్నిస్తాడు పంతులు. దీంతో మంగళ, మూర్తి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: నెల్లూరు రెడ్లపై మండిపడ్డ కిరాక్ ఆర్పీ - ఇంతకీ ఏమైంది?