Nindu Noorella Saavasam Serial Today Episode: రావు, ప్రమీల గార్లను సాయంత్రం వరకు ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులకు ఫోన్‌ చేస్తుంటాడు అమర్‌. ఇంతలో రాథోడ్‌ పరుగెత్తుకొచ్చి వారి ఆచూకి తెలిసింది సార్‌ అని చెప్తాడు. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి లోకేషన్‌కు బయలుదేరుతారు. ఇంట్లో ఎవ్వరూ లేరనుకుని మనోహరి చిత్ర, వినోద్‌ల పెళ్లి కోసం గుడికి బయలుదేరుతుంది. గార్డెన్‌లో ఉన్న ఆరు, మనును చూసి తిట్టుకుంటుంది.

ఆరు: అంతా దీనివల్లే జరుగుతుంది. ఇవాళ చిత్ర ఇంతదూరం వచ్చిందంటే అంతా దీనివల్లే

శివరాం:  అమ్మా మనోహరి

మనోహరి తిరిగి చూస్తే.. శివరాం, నిర్మల కనిపిస్తారు.

నిర్మల: అమ్మా మనోహరి బయటకు వెళ్తున్నావా..?

మనోహరి:  అవును ఆంటీ ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్తున్నాను. నేను లంచ్‌ బయటే చేస్తాను

శివరాం: అయితే మంచిది మనోహరి ఎలాగూ బయటకు వెళ్తున్నావు కదా మమ్మల్ని గుడి దగ్గర డ్రాప్‌ చేసి వెళ్లు

మనోహరి:  గుడి దగ్గరా..?

భాగీ: ఏంటి గుడా అని అలా దీర్ఘం తీస్తావేంటి మను.. గుడికే.. గుడి దగ్గర మమ్మల్ని డ్రాప్‌ చేసి వెళ్తావా..?

మనోహరి: ఇప్పుడు గుడికి దేనికి..? అయినా గుడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి..?

నిర్మల: గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు అమ్మా.. మనసు ప్రశాంతంగా ఉండటానికి.. మనసులోని కోరికెలు తీర్చడానికి ఆ భగవంతుడిని వేడుకోవడానికి

మనోహరి: అంటే ఇప్పుడు ఎందుకు అని.. ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయి కదా..? కావాలంటే ఆ పూజ ఏదో నేను చేయిస్తాను

భాగీ: పూజ చేయాలంటే మంచి మనసు ఉండాలి మను. అది నీకెలాగూ లేదు. మమ్మల్ని వెంకటేశ్వర స్వామి గుడిలో డ్రాప్‌ చేసేసి నువ్వు వెల్లొచ్చు

మనోహరి: వెంకటేశ్వర స్వామి గుడా

శివరాం: ఏమైందమ్మా నీకు మేము ఏం మాట్లాడినా అంతలా ఉలిక్కిపడుతున్నావు

మనోహరి: అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు శివాలయంకు వెళ్దాం

భాగీ: సరే మను ఫస్ట్‌ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం తర్వాత శివాలయానికి వెళ్దాం.. ఏమంటారు అత్తయ్యా

నిర్మల: ఎప్పుడు గుడికి రాని మనోహరి శివాలయం అని చెప్తుంది. అలాగే వెళ్దాం

భాగీ: లేటవుతుంది మను వెళ్దాం పద

అని అందరూ కారెక్కుతారు. మను బలవంతంగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంది.

ఆరు: హమ్మయ్యా అందరూ అక్కడికే వెళ్తున్నారు. దేవుడా ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోయేలా చూడు స్వామి

అని మొక్కుతుంది. గుడిలో చిత్రను కలుస్తాడు వినోద్‌. ఇద్దరూ కలిసి ప్రదిక్షణ చేస్తుంటారు. చిత్ర డల్లుగా కనిపిస్తుంది.

వినోద్‌: ఎందుకు చిత్ర ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేయమన్నావు ఇంట్లో అందరూ మన పెళ్లికి ఒప్పుకున్నారు కదా..?

చిత్ర: అంటే.. ఏం లేదు వినోద్‌.. ముందు దర్శనం చేసుకుందాం తర్వాత మనం మాట్లాడుకుందాం పద..

వినోద్‌: చిత్ర దర్శనం అయ్యాక ఇటు నుంచి ఇటే లంచ్‌కు వెళ్దామా..? రేపు నన్ను పెళ్లి కొడుకును చేస్తారు. మళ్లీ బయటకు రావడానికి కుదరదు... చిత్ర పలకవేంటి..? ఎందుకు అలా ఉన్నావు

అంటూ వినోద్‌ అడుగుతుండగా పక్కన లవర్స్‌ పెళ్లి జరుగుతుంది. అక్కడ గొడవ మొదలవుతుంది. వినోద్‌ వెళ్లి కలగజేసుకుంటాడు. ఇంతలో చిత్ర ఇప్పుడేం చేయాలో మనును అడుగుదాం అనుకుని పక్కకు వెళ్లి ఫోన్‌ చేస్తుంది. మనోహరి కాల్‌ లిఫ్ట్ చేయదు. మరోవైపు అమర్‌ చిత్ర పేరెంట్స్‌ను సేవ్‌ చేస్తాడు. వాళ్లు చిత్ర, వినోద్‌ ఇవాళ్లే ఇప్పుడే గుడిలో పెళ్లి చేసుకోబోతున్నారని అమర్‌కు చెప్తారు. వెంటనే అమర్‌ భాగీకి కాల్‌ చేసి విషయం చెప్తాడు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!