Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీని చంపేందుకు చిత్ర, మనోహరి వాష్‌రూంలో కరెంట్‌ వైర్‌ కట్‌ చేయడంతో భాగీని ఎలాగైనా రక్షించుకోవాలని ఆరు పరుగున ఇంట్లోకి వస్తుంది. అప్పుడే మనోహరి ఆరు రూంలోకి వెళ్లి ఫోటో ముందు ఉన్న పూలు తీసేస్తుంది.


భాగీ: అదేంటి వాటర్‌ వస్తున్నాయి. వెళ్లినప్పుడు నేను అన్ని ఆఫ్‌ చేసే వెళ్లాను కదా


మనోహరి: గుడ్‌ బై ఆరు భూమి మీద నుంచి పర్మినెంట్‌గా వెళ్లిపోతున్నావు కదా అందుకే నీకు తోడుగా నీ చెల్లిని కూడా పంపిస్తున్నాము తీసుకుని వెళ్లు (అనుకుంటూ పూలు తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేస్తుంది.) నిన్ను బాగా మిస్‌ అవుతాను నేను


మరోవైపు వాష్‌రూంలోకి భాగీ అడుగుపెడుతుంటే వెనక నుంచి చిత్ర వచ్చి చేయి పట్టి లాగేస్తుంది.


చిత్ర: భాగీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..?


భాగీ: నేనేం చేశాను.. వాటర్‌ లీక్‌ అవుతుంటే టాప్‌ ఆఫ్‌ చేద్దామనుకున్నాను  


చిత్ర:  అది ఒక్కటే కాదు. ఇటురా చూపిస్తాను అదిగో చూడు


అని వాష్‌ రూంలో  తెగిపడిన కరెంట్‌ వైర్‌ చూపిస్తుంది. భాగీ షాక్‌ అవుతుంది. అప్పుడే రూంలోంచి బయటకు వచ్చిన మనోహరి మిస్సమ్మ రూం వైపు చూస్తుంది.


మనోహరి:  డోర్‌ ఓపెన్‌ చేసుకుని ఇంత సైలెంట్‌గా ఉందంటే కరెంట్‌ షాక్ గట్టిగానే తగిలినట్టుంది. ఇది కచ్చితంగా పోయి ఉంటుంది


భాగీ: అమ్మో చిత్ర థాంక్స్‌ చిత్ర నువ్వు రాకపోయి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది


చిత్ర: పర్వాలేదులే భాగీ ఇంకోసారి అలా జరగకుండా చూసుకో.. సరే కిందకు వెళ్లి మెయిన్‌ ఆఫ్‌ చేసి రాపో


భాగీ: సరే చిత్ర


అని చెప్పి రూంలోంచి భాగీ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన భాగీని చూసి మనోహరి షాక్ అవుతుంది. కంగారుగా దగ్గరకు వెళ్తుంది.


మనోహరి: ఏయ్‌ భాగీ ఆగు ఎక్కడికి అంత కంగారుగా వెళ్తున్నావు


భాగీ: మెయిన్‌ ఆఫ్‌ చేయడానికి


మనోహరి: ఏయ్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయడం ఏంటి..?


భాగీ: మా వాష్‌రూంలో గీజర్‌ ఉంది కదా దాని వైర్‌ కట్‌ అయి వాటర్‌ లో పడింది. నేను చూసుకోకుండా లోపలికి వెళ్లి టాప్‌ ఆఫ్‌ చేద్దామనుకున్నాను. చిత్ర వచ్చి నన్ను కాపాడింది సరే సరే నేను మెయిన్‌ ఆఫ్‌ చేయాలి


అంటూ భాగీ వెళ్లిపోతుంది. మనోహరి కోపంగా చిత్రను తిట్టుకుంటూ రూంలోకి వెళ్తుంది.


మనోహరి: ఏయ్‌ చిత్ర నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? నువ్వు దాన్ని కాపాడటమేంటి..? ఏయ్‌ చిత్ర నేను నీతోనే మాట్లాడుతున్నాను. దాన్ని ఎందుకు కాపాడావు


చిత్ర: నేను చిత్ర కాదు మనోహరి.. అరుంధతిని


అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే చిత్రలో దూరిన అరుందతి ఆత్మ మనోహరికి కనిపిస్తుంది. మనోహరి భయంతో కిందకు పారిపోతుంది. చిత్రలోంచి ఆరు ఆత్మ బయటకు వచ్చి గార్డెన్‌లోకి వెళ్తుంది. ఆరుకు గుప్త ఎదురొస్తాడు. ఏడుస్తూ ఆరు గుప్తను చూస్తుంది.   


ఆరు:  నేను భూలోకాన్ని వదిలి వేసే టైం వచ్చేసింది అంతే కదా గుప్త గారు..


గుప్త: నిన్ను ఇటులా చూడవలిసి వచ్చినందుకు మా గుండె భారంగా ఉంది బాలిక. కానీ కర్తవ్య నిర్వహణలో మాకు తప్పుట లేదు మమ్మలను క్షమించుము


ఆరు: పదండి గుప్తగారు వెళ్దాం.


గుప్త మంత్రం వేయగానే.. ఇద్దరూ అక్కడి నుంచి ఆకాశంలోంచి యమలోకానికి వెళ్తుంటారు. ఆరు అందరినీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ వెళ్తుంటుంది. రుణము తీరిన బంధాలను గుర్తు తెచ్చుకుని బాధపడకు బాలిక అని ఓదారుస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!