Nindu Noorella Saavasam Serial Today Episode: వార్డెన్ ఫోన్ చేసి నిజం చెప్పగానే రాథోడ్ పరుగెత్తుకుని అమర్ దగ్గరకు వెళ్లి ఫోన్ ఇస్తాడు. రాథోడ్ పరుగెత్తడం చూసిన మిస్సమ్మ వెనకాలే వెళ్తుంది. ఫోన్ తీసుకున్న అమర్ మిస్సమ్మను చూసి ఫోన్ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. మిస్సమ్మ ఏమైందని ఆయన ఆలా వెళ్లిపోయారేంటని రాథోడ్‌ను అడుగుతుంది ఏం లేదని రాథోడ్ కూడా బయటకు వెళ్లిపోతాడు.
రాథోడ్: సార్ ఆ పెద్దాయనకు నిజం తెలిసి ఇక్కడికే వస్తున్నాడు ఇప్పుడు ఎలా
అమర్: ఏం జరిగినా నిజం మాత్రం నేను చెప్పను రాథోడ్
రాథోడ్: కోటి ప్రశ్నలతో మీ సమాధానం కోసం వచ్చే ఆ తండ్రికి మీరు ఏం సమాధానం చెప్పకపోతే ఎలా సార్.
అమర్: నిజం చెప్పి ఈ వయసులో ఆయనను బాధపెట్టలేను రాథోడ్ అంటాడు అమర్. మరోవైపు ఘోర దగ్గరకు వెళ్లిన మనోహరి.. నిన్న నిన్ను తిట్టినందుకు మనసులో పెట్టుకోకు ఘోర అంటుంది. ఆ బుడ్డది ఇంత పని చేస్తుందని అసలు అనుకోలేదు అంటుంది.
ఘోర: ఆ భాగమతికి నువ్వే అరుంధతిని చంపేశావని తెలిసిందేమో..?
మను: అది కొన్ని సార్లు తెలిసినట్టే నాతో మాట్లాడుతుంది. ఆ ఆరుంధతియే ఎప్పుడో చెప్పి ఉంటుంది. ( ఘోర నవ్వుతుంటే..) నా బాధను చూస్తే నీకు నవ్వుగా ఉందా..?
ఘోర: నీ పిచ్చితనం చూసి నవ్వొచ్చింది. కొన్ని నెలలు ఆ ఆత్మను చూసిన నాకే ఆరంధతి మంచితనం అర్తం అయింది. నీకు అర్థం కాలేదా..? ఆరు నిజం చెప్పడం ఎంత సేపు.. కానీ ఆరుందతి నిజం చెప్పలేదు.. ఎప్పటికీ చెప్పదు. ఎందుకంటే అరుంధతి తన పగ కంటే తన కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. స్నేహానికి ఒకవైపు నువ్వు ఉంటే రెండో వైపు అరుంధతి ఉంది. ప్రతి విషయంలో నువ్వు తప్పు వెతికితే.. నీ తప్పుల్లో కూడా మంచిని వెతికింది. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పౌర్ణమి రోజు ఆరుంధతికి శక్తులు రాగానే నీ అంతం చూస్తుంది జాగ్రత్తగా ఉండు మనోహరి.
మను: దాని ముఖం అదేం చేస్తుంది నన్ను..
అంటూ నెగ్లెక్ట్గా సమాధానం ఇస్తుంది మనోహరి. మరోవైపు గార్డెన్లో కూర్చున్న గుప్త సంతోషంగా నవ్వుతుంటే.. యముడు వచ్చి తిట్టి.. నీ చుట్టు ఏం జరగుతుందో తెలుసుకోవా..? ఆ రామ్మూర్తి నిజం తెలుసుకోవడానికి ఇంటికి వస్తున్నాడు అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో గుప్త వెంటనే ఇప్పుడు ఆ బాలికను ఇక్కడ ఉండనివ్వకూడదు అనుకుంటుండగానే ఆరు వస్తుంది.
గుప్త: బాలిక నేను నీకు ఇవాళ ఒక బహుమతి ఇద్దామనుకుంటున్నాను.
ఆరు: గిఫ్టా.. ఎందుకు గుప్త గారు..
గుప్త: ఎలాగూ మూడు రోజుల్లో మా లోకం వెళ్తున్నాం కదా అందుకే
ఆరు: అయితే వెళ్దాం పదండి గుప్త గారు
అని ఇద్దరూ కలిసి వెళ్తుంటే ఇంతలో రామ్మూర్తి కోపంగా గేటు ఓపెన్ చేసుకుని వస్తుంటాడు. రామ్మూర్తిని చూసిన ఆరు గిఫ్ట్ తర్వాత తీసుకుందాం ఈయనేంటి ఇంత కోపంగా వస్తున్నారు అని కిటికీ దగ్గరకు పరగెడుతుంది ఆరు. రామ్మూర్తి లోపలికి వెళ్లి కోపంగా అమర్ ఎక్కడ అని అడుగుతాడు. భాగీ, పిల్లలు, నిర్మల, శివరాం వచ్చి పలకరించినా.. కోపంతేనే వాళ్లను తిట్టి అమర్ ఎక్కడ నా పెద్ద కూతురు గురించి తనకు నిజం తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు అంట అరుస్తుంటే.. రూంలోంచి మనోహరి వచ్చి రామ్మూర్తిని తిడుతుంది. రామ్మూర్తి కోపంగా మనును కొట్టబోయి ఆగిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!