Nindu Noorella Saavasam Serial Today Episode: పంతులును కలిసిన భాగీకి ఈసారి బుజ్జమ్మకు గండం పొంచి ఉందని చెప్తాడు పంతులు. దీంతో భాగీ భయపడుతుంది. పంతులు మాటలకు కరుణ కోపంగా తిట్టి పంతులును వెళ్లిపో అంటుంది. పంతులు వెళ్లిపోతాడు.

కరుణ: ఏయ్‌ పోరీ ఈ పంతులు ఊకెనే భయపెడుతుండు. బుజ్జమ్మకు ఏమీ కాదు

భాగీ: అది కాదే నేను బుజ్జమ్మ విషయంలో రిస్క్‌ తీసుకోలేను తనకు ఏదైనా జరిగితే నేన తట్టుకోలేను

కరుణ: ఏమైతదే.. ఎందుకు తట్టుకోలేవు..

భాగీ: అది కాదు కరుణ బుజ్జమ్మ మళ్లీ పుట్టిన మా అరుంధతి అక్కా అనుకున్నాము. తనను ఆ జన్మలో చాలా మిస్‌ అయ్యాను. ఈ జన్మలో అయినా తనను నేను కాపాడుకోవాలి

కరుణ: ఏయ్‌ ఏందే దమాక్‌ గిట్ల కరాబ్ అయిందా ఏంటి..? బుజ్జమ్మ జోలికి వస్తే ఆ మనోహరి తోలు తీయలేమా ఏంది..?

భాగీ: మనోహరితో నేను ఎంతైనా పోరాడతానే కానీ బుజ్జమ్మకు ఏమైనా అయితే

కరుణ: ఏయ్‌ చల్‌ పోరీ దేవుడు ఉన్నాడే పసిపిల్లల జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా..? ఈరోజు అమ్ము జోలికి వెళ్లితే దేవుడు ఏం చేసిండు.. నువ్వు ధైర్యంగా ఉండు.. బుజ్జమ్మకు ఏమీ కాదు పా పోదాం అరేయ్‌ ఇంకా ఏం సోర్చాయిస్తున్నావే.. పద వెళ్దాం..

అంటూ అక్కడి నుంచి భాగీని తీసుకుని వెళ్లిపోతుంది కరుణ. ఇక పంతులు మనోహరి దగ్గరకు వెళ్తాడు.

పంతులు: నమస్కారం అమ్మా లక్ష్మీదేవి

మనోహరి: నా పేరు లక్ష్మీదేవి కాదు పంతులు మనోహరి

చంభా: మనోహరి నీకు ఇంకా అర్థం కాలేదా..? పంతులు గారికి నువ్వు ఇంకా డబ్బులు ఇస్తున్నావు కదా..? అందుకే నువ్వు ఆయనకు లక్ష్మీదేవివే..!

పంతులు: మంచి మాట చెప్పారు అమ్మా

మనోహరి: నేను చెప్పిన పని ఏం చేశారు పంతులు గారు

పంతులు: అమ్మా ఇప్పుడే భాగీ ఎదురుపడ్డారమ్మా మీరు చెప్పమన్నట్టు ఈ సారి జాతకం మారింది ఇప్పుడు ప్రమాదం అమ్ముకు కాదు..  అరుంధతికి అని చెప్పేశానమ్మా..?

మనోహరి: భాగీ నమ్మేసిందా

పంతులు: నమ్మడమేంటమ్మా.. బాగా భయపడిపోతేనూ..

మనోహరి: అయితే మీరు బయలుదేరండి..

పంతులు: మరి డబ్బులు..

మనోహరి: మీ అకౌంట్‌లో పడతాయి. మీరేం టెన్షన్‌ పడొద్దు వెళ్లండి

పంతులు: సంతోషం తల్లి మీకు వెయ్యి శుభములు కలుగుగాక

చంభా: (మనసులో) చేసేది చెడ్డ పని మళ్లీ దీవెనలు

మనోహరి: ఇప్పుడు చెప్పు చంభా నా అదృష్టం తిరగబడింది. నాకు చెడు రోజులు వచ్చేశాయి. భాగీ నా ప్లాన్‌ కనిపెట్టింది. నాకు గడ్డు కాలం అని ఏదేదో అన్నావు కదా..? ఇప్పుడు ఏమంటావు.. భాగీ పంతులును కలుస్తుందని మళ్లీ జాతకం గురించి అడుగుతుందని నేను గెస్ చేశాను. అందుకే ఈ సారి అపాయం అమ్ముకు కాదు అరుందతికి అని చెప్పించి భాగీని బాగా భయపెట్టాను.. ఈ దెబ్బతో భాగీ పారిపోతుంది

చంభా: పంతులు అలా చెప్పగానే పారిపోతుంది అంటావా..?

మనోహరి: లేదు మనం అరుంధతిపై అటాక్‌ చేయించబోతున్నాం కదా..? ఆ చిన్న పిల్లపై చిన్న గీత పడినా భాగీ బాడీలో చిన్న షివరింగ్‌ వస్తుంది

చంభా: భాగీని వణికించడం అటు ఉంచు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా..? అరుంధతితో.. మళ్లీ పుట్టిన అరుందతితో ముందు జన్మలో అరుందతిని నువ్వు చంపావ్‌.. కానీ ఈ జన్మలో అరుందతి నీ మృత్యువు ఆ పిల్ల మళ్లీ పుట్టిన అరుంధతి.. చచ్చి బతికిన అరుంధతి.. పుట్టుకతోనే శక్తులు ఉన్న అరుంధతి.. దేవుడి సాయం ఉన్న అరుందతి.. ఏమాంత్రం తేడా వచ్చినా నువ్వు మిగలవు మనోహరి.. చచ్చిపోతావు.. ఆ అరుంధతి చంపేస్తుంది

మనోహరి: ఆపు చంభా ఆ పిల్ల అరుంధతికి నువ్వు ఇచ్చిన ఎలివేషన్ చాలు.. నేను చెప్పిన అరైంజ్‌మెంట్స్‌ అన్ని చేశావు కదా..?

చంభా: ఆ ఏర్పాట్లు అన్ని ఎప్పుడో అయిపోయాయి..

మనోహరి: పద అక్కడికి వెళ్లి ఆ పిల్ల అరుంధతిని మళ్లీ చంపేద్దాం

అనుకుని వెళ్లిపోతారు. తర్వాత ఇంట్లో అమర్‌ ఫైల్స్ చూస్తుంటే.. పిల్లుల అమర్‌ దగ్గరకు వెళ్తారు. రేపు స్కూల్‌లో రిపబ్లిక్‌ డే ఉంది పేరెంట్స్‌ను తీసుకుని రమ్మని చెప్తారు మీరు స్కూల్‌కు రావాలని అడుగుతారు. అమర్‌ సరే వస్తాను. బుజ్జమ్మ కోసం కూడా వస్తాను అని చెప్పగానే.. మనోహరి వని చంభా దగ్గరకు వెళ్లి బుజ్జమ్మను స్కూల్‌ లో చంపాలి అని చెప్తుంది. చంభా సరే అంటూ బయటకు వెళ్లి గద్దను పిలుస్తుంది. గద్ద చంభా దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!