Jagadhatri Serial Today Episode: ఇంటికి వచ్చిన కేదార్‌, జగధాత్రిని ఇంట్లో వాళ్లందరూ అడ్డుకుంటారు. ఇంట్లోకి కాలు పెట్టొద్దని నిషిక, వైజయంతి, యువరాజు మండిపడతారు. మీకు సిగ్గులేకుండా ఎలా ఇంటికి వచ్చారని నిలదీస్తారు. దీంతో జగధాత్రి కేదార్ ఈ హత్య చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ వాళ్లు వినరు. మేం కళ్లతో చూసిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని నమ్మమంటారా అని అంటారు. కౌషికి, సుధాకర్‌ కూడా వెళ్లిపొమ్మని అంటారు. నేను ఇక్కడ నుంచి వెళ్లడం అంటూ జరిగితే ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే వెళ్తాను కానీ....హంతకుడిగా మాత్రం కాదని కేదార్ అంటాడు.నా కళ్లల్లోకి చూసి వెళ్లమని చెప్పు అక్కా అంటూ కౌషికిని అడుగుతాడు. దీంతో కౌషికి కొంత మెత్తబడుతుంది.అది చూసిన  నిషిక.వైజయంతి మరింత రెచ్చిపోతారు. వాళ్లను ఇంట్లోకి రానిస్తే వచ్చిన అవకాశం పోతుందని భావిస్తారు. ఆస్తికోసం మాయయ్యను చంపడానికి ప్రయత్నించిన వాడిని మళ్లీ ఎందుకు నమ్ముతున్నావని కౌషికి నిలదీస్తారు. దీంతో జగధాత్రి కల్పించుకుని కేదార్‌కు ఆస్తిమీద వ్యామోహం లేదన్న సంగతి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసునని....కేవలం మీ ప్రేమ,అనురాగాల కోసమే ఇక్కడికి వచ్చాడని జగధాత్రి అంటుంది.అలాంటప్పుడు కమలాకర్‌ మామయ్యను చంపాల్సిన అవసరం కేదార్‌కు ఎందుకు  ఉంటుదని ప్రశ్నిస్తుంది. ఈ మాటలకు కౌషికి కొంచెం చల్లబడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావని కౌషికి అడుగుతుంది. కేదార్ తప్పు చేయాలేదని నిరూపించుకోవాడనికి ఒక్క అవకాశం ఇవ్వమని ధాత్రి కోరుతుంది.                       కేదార్‌,జగధాత్రి మళ్లీ ఇంట్లోకి వచ్చేలా ఉన్నారని భావించిన యువరాజు లోపలికి వెళ్లి గన్‌ తీసుకుని వచ్చి కేదార్‌కు గురిపెడతాడు. మా అక్క చెప్పక్కర్లేదు...నేను చెబుతున్నాను మర్యాదగా వెళ్లిపోకపోతే కాల్చిపడేస్తానని అంటాడు.వెంటనే అతని చేతిలో గన్‌ను కౌషికిలాక్కుంటుంది. సుధాకర్‌ కూడా కొడుకుని మందలిస్తాడు. నువ్వు కూడా వాడిలాగే  హంతకుడిగా మారతావా అని అంటాడు. ఆ మాటలకు కేదార్‌కు మరింత బాధ కలుగుతుంది. అయితే 24 గంటల్లో  కేదార్ ఈ హత్యాయత్నం చేయలేదని నిరూపిస్తేనే మీకు ఈ ఇంట్లో చోటు  ఉంటుందని...నిరూపించలేకపోతే ఈ జన్మలో మీ ముఖాలు మాకు చూపించ వద్దని కౌషికి అంటుంది. వీళ్లను నమ్మి ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉంటామని యువరాజు అంటాడు. అర్థరాత్రి అందరినీ చంపినా చంపుతారని భయపెడతాడు. అయితే అప్పటి వరకు వీళ్లిద్దరూ ఔట్‌హౌస్‌లో ఉంటారని చెప్పడంతో నిషిక, యువరాజు కోపంతో వెళ్లిపోతారు. మన కళ్లతో చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్లని ఎందుకు నమ్ముతున్నావని సుధాకర్ అడగ్గా....నా మనసు ఎందుకో కేదార్ తప్పు చేయలేదని చెబుతోందని కౌషికి అంటుంది. 24 గంటల్లో ఆధారాలు తీసుకురాకపోతే వాళ్లే వెళ్లిపోతామన్నారు కదా అని అంటుంది.                       కమలాకర్‌ మామయ్యను కత్తితో నువ్వు పొడవకపోతే ఆ అవసరం ఇంకెవరికి ఉంటుందని ధాత్రి కేదార్‌తో  అంటుంది.నాకు అదే అర్థం కావడంలేదని అంటాడు. కేవలం బాబాయిపై హత్యాయత్నం చేసి నన్ను కేసులో ఇరికించాలనుకున్నారా లేక నిజంగానే కమలాకర్‌ను హత్య చేయాలనుకున్నారా అంటాడు. నన్ను ఈ కేసులో ఇరికించడానికి తాతయ్య అనే వాడిని పెట్టి పకడ్బందీగా ప్లాన్ చేశారని కేదార్ అంటాడు. బాగా  ఆలోచించి అసలు తాతయ్య వస్తున్నట్లు మనకు ఫోన్ చేసి చెప్పిన వాచ్‌మెన్ రంగా ఎక్కడ అంటూ ధాత్రి కేదార్‌ను అడుగుతుంది. అవును రంగాను పట్టుకుంటే గానీ ఈకేసు చిక్కుముడి వీడుతుందని అంటాడు.  అసలు ఈ కేసు వెనక ఎవరున్నారో అర్థం కావడం లేదని ధాత్రి అంటుంది. ఇప్పుడు నువ్వు బెయిల్‌పై బయటకు వచ్చావు కాబట్టి....ఖచ్చితంగా వాళ్లు కమలాకర్‌ను చంపి ఆ హత్యానేరం నీపై వేయాలని చూస్తారని...కావున మనం కమలాకర్‌ మామయ్యను కాపాడుకోవాలని అంటుంది.