TV Serial Actress Darshini Gowda:చూడగానే ఆకట్టుకునే రూపం....పరికిణి వేసిందా పదహారు అణాల తెలుగుదనం ఉట్టిపడుతుంది. చీరకట్టులో  అసలు, సిసలు అందం అదనంగా  కనిపిస్తుంది. నోరువిప్పి మాట్లాడితే చాలు....మూత్యాలు ఏరుకునేంత స్పష్టమైన భాష వినిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే తెలుగుదనం ఉట్టిపడే అందమైన తెలుగుమ్మాయి అంటే ఇలాగే ఉండాలనిపించేలా  ఉంటుంది ఆ అమ్మాయి ఆహార్యం...ఇంతకీ ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా....అదేనండీ ఇటీవల మాటీవీలో దుమ్మురేపుతూ దూసుకుపోతున్న  అక్కినేనివా రి అన్నపూర్ణ బ్యానర్‌పై ప్రసారమవుతున్నా లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్‌లో ప్రధాన పాత్రధారి అయినటువంటి శ్రీలక్ష్మీ అలియాస్‌ దర్శని గౌడ  గురించే. అదేంటి తెలుగమ్మాయి అంటున్నారు...మరి పేరేమోదర్శినిగౌడ  అని కన్నడ పేరులా ఉందని  అనుకుంటున్నారా...మీరు చదివింది నిజమేనండీ  ఆ అమ్మాయి అసలుసిసలు  కన్నడ కుట్టీనే...                      బెంగళూరులో  పుట్టి పెరిగిన దర్శినగౌడ....1993 జూన్‌ 17న జన్మించింది.ఆమెకు  ఓ సోదరుడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఎంతో చలాకీగా ఉండే దర్శిని....ఆటపాటల్లోనూ, స్కూల్‌ ఫంక్షన్‌లోనూ  ముందుండేది. అలాగని చదువును ఏం నిర్లక్ష్యం చేయలేదండోయ్‌....బెంగళూరు  యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూషన్‌ చేసింది.  ఆ తర్వాత నటనపై మక్కువతో  బుల్లితెరపై మెరిసింది. తొలుత కన్నడలో యాంకరింగ్‌ చేసిన దర్శిన  ఆ తర్వాత తమిళంలో అడుగుపెట్టింది. 2021లో  తొలుత కన్నడలో ఎంతో పాపులర్‌ అయిన ఉదయ్‌ మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా అడుగుపెట్టినా....తనకు  తొలి సీరియల్ ఛాన్స్‌ మాత్రం తమిళంలోనే  వచ్చింది. సిలూన్‌ ఔర్‌ కాదల్‌ అనే తమిళ సీరియల్‌లో తొలిసారి దర్శిని తళుక్కుమంది. తొలి సీరియల్‌లోనే  అద్భుతంగా నటించి  బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అనతికాలంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. మాతృభాష కన్నడ అయినప్పుటికీ  ఎంతో స్పష్టంగా  తమిళ డైలాగ్‌లు పలకడంతోపాటు  చక్కని హావభావాలతో  ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. వెంటనే  నాగపంచమి, ఆహా కల్యాణం సీరియల్‌లో అవకాశాలు వచ్చాయి. బుల్లితెరతోపాటు వెండితెరపైనా ఈ అమ్మడు తళుక్కమంది. తొలిచిత్రంతోనే  బాలీవుడ్‌లోఅడుగుపెట్టింది. అభిషేక్‌బచ్చన్  ప్రధాన పాత్రలో ఆయన క్రికెట్‌ కోచ్‌గా నటించిన హిట్‌ చిత్రం గూమర్‌ చిత్రంలో  ఓ పాత్రలో దర్శిని కనిపించింది. అలాగే కన్నడలోనూ  ఓ సినిమాలో దర్శిని నటించింది.

Continues below advertisement

                         కన్నడ, తమిళ భాషల్లో దూసుకుపోతున్న  దర్శని గౌడ తెలుగులోనూ  అడుగుపెట్టింది. జీ తెలుగులో ప్రసారమైన నాగపంచమి సీరియల్‌లో ఆమె తొలుత నటించింది. ఈ సీరియల్‌లో  పంచమి ప్రధాన పాత్ర పోషించి  అందరినీ ఆకట్టుకుంది. అప్పుడే లక్ష్మీరావే మా ఇంటి ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ సీరియల్‌  మాటీవీలో ప్రసారమవుతుండగా...జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింంగ్‌లో ఉంది. చక్కనైన రూపంతో  అచ్చతెలుగు ఆడపిల్లను మరిపించేలా ఉన్న దర్శినియే ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రధారి.   కేవలం సినిమాలు, సీరియల్‌లే కాకుండా  సోషల్‌ మీడియాలోనూ  దర్శిని ఎంతో యాక్టివ్‌...సంప్రదాయ పద్దతిలో లంగా,ఓణీ, చీరతోపాటు  మోడ్రన్‌ డ్రెస్‌లు,  జీన్స్‌,షర్ట్‌లతోనూ  అదరగొడుతుంది. వాటిని ఎప్పటికప్పుడు తన ఇన్‌స్ట్రాలో పోస్టు చేస్తుంది. ఇన్‌స్టాలో ఆమెకు  100K ఫోలోవర్స్‌ ఉన్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు కొత్త  సినిమా చూడాల్సిందేనంటున్న  దర్శినికి మూవీస్‌ అంటే చాలా పిచ్చి. యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించి  సీరియల్స్‌ ద్వారా  ప్రజలకు చేరువైన దర్శిని.. అప్పుడప్పుడు సినిమాల్లోనూ  తళుక్కుమంటోంది. మాతృభాష కన్నడ అయినప్పటికీ...తమిళం, తెలుగులోనూ  మంచి సీరియల్స్‌లో నటిస్తోంది. చక్కని హావభావాలు ప్రదర్శించడం కోసం ఆమె తెలుగు,తమిళ్‌ కూడా నేర్చుకుంది.

Continues below advertisement