Nindu Noorella Saavasam Serial Today Episode:   తను కొద్ది రోజులో భూలోకంలోనే ఉండాలనుకుంటుంది ఆరు. అందుకోసం గుప్తను సాయం అడుగుతుంది. గుప్త చేయలేనని చెప్తాడు. అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను. అంటూ అసలు అస్థికలు నదిలో కలపకపోతే నేను ఇక్కడే ఉండొచ్చు కదా అంటుంది. అది సృష్టికి విరుద్దం అని గుప్త హెచ్చరించినా.. ఆరు వినకుండా ఇంటికి వెళ్తుంది. ఇంట్లో భాగీ ఆలోచిస్తుంది.

నిర్మల: మిస్సమ్మా… మిస్సమ్మా…

భాగీ: అత్తయ్యా అంత గట్టిగా అరిచారేంటి..?

నిర్మల: నా పిలుపు నీ చెవిలో పడలేదు కదా..? అందుకే అరిచాను

భాగీ: మీరు పిలిచారా…? ఏదో ఆలోచనలో ఉండి వినిపించలేదు

నిర్మల: వినిపించనంతగా ఆలోచిస్తున్నావా..? ఏం ఆలోచిస్తున్నావు మిస్సమ్మ.

భాగీ: ఇంతకు ముందు మనోహరి కిచెన్‌లోకి వచ్చి అదోలా చూసింది అత్తయ్యా..

అని భాగీ చెప్పగానే అవును నా రూం దగ్గరకు కూడా వచ్చి అదోలా చూసింది అని నిర్మల చెప్పగానే మనోహరి ఏదో చేస్తుందని భాగీ అనుమనంగా నిర్మలకు చెప్తుంది. దీంతో నిర్మల అసలు ఆ మనోహరి మాటలే అర్థం కావు.. ఇక ఏదో చేస్తుందా.? అదొక తిక్కబాగులది అంటుంది. ఇంట్లోకి వచ్చిన ఆరును ఆపడానికి గుప్త  ప్రయత్నిస్తాడు. ఆర ఆగదు.

గుప్త:  నువ్వు ఇది చేయడం సరికాదు బాలిక. సృష్టి విరుద్దం.

ఆరు: సరైంది  కాబట్టే ఆ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చారు గుప్తగారు.

అని ఆరు వేగంగా ఇంట్లోకి వెళ్లిపోతుంది. గుప్త ఏమీ చేయలేక యముడిని ప్రార్తిస్తాడు. వెంటనే యముడు ఆకాశంలో ప్రత్యక్షమవుతాడు.

యముడు: ఏంటి గుప్త ఎందుకు అంత కంగారు పడుతున్నావు.

గుప్త: ఏం లేదు ప్రభు.. ఆ బాలిక మనం ఎంత చెప్పినా వినదని చెప్పాను కదా..? మీరు నా మాట వినకపోతిరి. ఇప్పుడు చూడండి ఆస్తికలు నదిలో కలపకుండా అడ్డుపడుతుంది. ఇప్పుడేమి చేయాలి ప్రభు.

యముడు: చిత్ర విచిత్ర గుప్త.. నువ్వు ఏం చేసైనా ఆ బాలికను ఆపాలి.

గుప్త: ఏం చేసేనా అంటే ఏం చేయాలి ప్రభు నా దగ్గర శక్తులు లేకుండా అన్ని మీరే లాగేసుకున్నారు.

యముడు: ఆ బాలికకు ఏవైనా మాయ మాటలు చెప్పి యమపురికి తీసుకురా గుప్త

అంటూ చెప్పి యముడు మాయం అయిపోతాడు. ఆరును ఎలా ఆపాలా అని గుప్త తల పట్టుకుని కూర్చుంటాడు.  మరోవైపు మనోహరి, ఘోర దగ్గరకు వెళ్లి ఆస్తికల గురించి చెప్తుంది.

మనోహరి: ఆత్మ ఆచూకీ తెలుసుకోవడం  ఏమో కానీ నేను ఇవాళ అమర్‌కు దొరికపోయేదాన్ని..

ఘోర: ఏంటి మనోహరి నువ్వు చెప్పేది ఆత్మ ఎవరి ఒంట్లోకి ప్రవేశించలేదా..?

మనోహరి: అవును ఘోర.. అందరినీ చూశాను.. అయినా అది ఎవరిలో దూరకపోతే నేనేం చేయాలి.

ఘోర: అవును నువ్వేం చేయాలి రేపు ఆస్తికలు నదిలో కలిపితే ఆత్మ వెళ్లిపోతుంది. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అంతే కదా నీ మనసులో మాట.

మనోహరి: అది కాదు ఘోర.. అయినా ఈ పౌర్ణమికి శక్తి ఉందో లేదో

అని మనోహరి అనగానే .. ఘోర కోపంగా మంత్రం వేసి చూసి ఆత్మ ఆ ఇంట్లో మనిషిలో దూరింది మనోహరి అంటూ ఒక మాలను మనోహరికి ఇచ్చి ఇంట్లో ఉన్న అందరినీ టచ్‌ చేయ్‌ ఎవరిని టచ్‌ చేసినప్పుడు ఈ ముత్యం మెరుస్తుందో వారిలో ఆత్మ దూరినట్టు అని చెప్తాడు ఘోర. సరేనని వెళ్లిపోతుంది మనోహరి. ఇంట్లో అందరినీ బ్రేక్‌ ఫాస్ట్‌ చేయమని భాగీ పిలుస్తుంది. అందరూ వచ్చి టిఫిన్‌ చేస్తుంటారు. ఇంతలో భాగీ బయటకు వెళ్తుంది. మనోహరి రాగానే ఎక్కడికి వెళ్లావు మనోహరి అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే.. మనోహరి లోపలికి వెళ్తుంది. భాగీ అక్కడే నిలబడి చూస్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!