Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరుకు హెల్ప్‌ చేస్తున్నాడన్న కారణంతో గుప్తను యముడు శిక్షించాలనుకుంటాడు. అందుకోసం యమభటుల చేత బంధించి శిక్ష అమలు చేయండని చెప్తాడు. ఇంతలో ఆరు ఏడుస్తూ నా కోసం నా కుటుంబం కోసం సాయం చేసిన నా అన్నను శిక్షించొద్దని.. కావాలంటే నేను యమలోకంలోనే ఉండిపోతానని చెప్తుంది. దీంతో యముడు సరే అంటాడు. గుప్త ఎమోషనల్‌ అవుతాడు. మరోవైపు అమర్‌ భాగీ కోసం ఇంట్లో వెతుకుతాడు. అప్పుడే బయటి నుంచి వస్తుంది భాగీ.

అమర్‌: ఎక్కడికి వెళ్లావు మిస్సమ్మ.. ఇంతసేపు ఫోన్‌ కూడా ట్రై చేశాను బిజీ వచ్చింది. ఏమైంది డల్లుగా ఉన్నావు.. హెల్త్ ఓకేనా..? మిస్సమ్మ ఏమైంది పలకవు..

శివరాం నిజం చెప్పొద్దని సైగ చేస్తుంటాడు. ఇంతలో మనోహరి వస్తుంది.

మనోహరి: మిస్సమ్మ.. అమర్‌ అడుగుతుంటే.. పలకవేంటి..?

భాగీ: ఎక్కడికి వెళ్లావు.. మీరు ఎక్కడికి వెళ్లారు

నిర్మల: అమర్‌ నువ్వు రణవీర్‌కు ఫోన్‌ చేసి అంజును ఎప్పుడు తీసుకొస్తాడో కనుక్కో

  అమర్‌ ఫోన్‌ చేయబోతుంటే.. రణవీర్‌, అంజును తీసుకుని వస్తాడు. మా అంజు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని అమర్‌ అడుగుతాడు. ఏం లేదని రణవీర్‌ చెప్పి ఇక వెళ్లొ్స్తాను అంటాడు. ఇంతలో అంజు అంకుల్‌ మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటుంది. అమర్‌ కూడా అవును ఇక్కడే ఉండండి హోటల్ లో ఎందుకు అంటాడు. రణవీర్‌ సరేనని లోపలికి వెళ్తాడు.   యమలోకంలో ఆరు ఏడుస్తుంది.

గుప్త: ఏమిటి బాలిక నువ్వు చేసిన పని.  నువ్వు తిరిగి భూలోకానికి వెళ్లుటకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదనుకుంటివి

ఆరు: మీ చిత్రగుప్తుల వారికి నన్ను యమలోకానికి తీసుకురావడానికి  క్షణం పట్టింది గుప్త గారు. నాకు తెలిసి మీకు కూడా అంతే టైం పట్టొచ్చు కానీ ఏనాడు నాకు కష్టం కలిగించలేదు. ఆరోజు మీరు నా కోసం నిలబడ్డారు. ఈరోజు నేను మీ కోసం నిలబడ్డాను

గుప్త: మాకు వచ్చిన కష్టం గురించి ఆలోచించి నీవు కోరి కష్టములు తెచ్చుకుంటివి. నీ పిల్ల పిచ్చుకను తీసుకెళ్లుటకు సన్నాహాలు మొదలు పెట్టిరి.. నీవు ఇక్కడ ఉంటే నీ పిల్ల పిచ్చుకలను ఎవరు కాపాడతారు

ఆరు: నా చెల్లెలు భాగీ ఉంది గుప్తగారు. తను కాపాడుతుందని నమ్మకం వచ్చింది. పర్వాలేదు గుప్త గారు. ఇక్కడ ఉండుటకు అలవాటు చేసుకుంటాను

గుప్త: బాలిక నువ్వు తిరిగి భూలోకం వెళ్లుటకు ఒక్క అవకాశం ఉంది.

ఆరు: ఎలా వెళ్లగలను.. నన్ను ఎవరు తీసుకెళ్లగలరు..?

గుప్త: మా చిత్రగుప్తుల వారే నిన్ను తీసుకెళ్లెదరు.

 అంటూ తన ప్లాన్‌ చెప్తాడు గుప్త.. దీంతో ఆరు అనుమానంగా మీ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా గుప్త గారు అని అడుగుతుంది. గుప్త కోపంగా చూస్తే.. సరే మీరు చెప్పినట్టే చేస్తాను అంటుంది ఆరు. అంజలి రూంలో పిల్లలకు తాను రణవీర్‌తో తిరిగిన ప్లేస్‌ గురించి చెప్తూ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది కూడా చెప్తుంది. అప్పుడే రూంలోకి వస్తున్న భాగీ హాస్పిటల్‌ ఏంటి అని అడుగుతుంది. అంజు ఏమీ చెప్పకుండా కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత రణవీర్‌, మనోహరి కలిసి మాట్లాడుకుంటూ అంజును కిడ్నాప్‌ చేయాలనుకుంటారు. వాళ్లిద్దరూ సీక్రెట్‌గా మాట్లాడుకోవడం భాగీ చూస్తుంది. భాగీని చూసిన మను, రణవీర్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!