Ennallo Vechina Hrudayam Serial Today February 1st: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: తిరునాళ్లలో బాల సందడి.. వెంటే త్రిపుర.. బాలని చంపడానికి కుట్ర!
Ennallo Vechina Hrudayam Today Episode ఇంట్లో తెలీకుండా బాల తిరునాళ్లకి రావడం బాల బాబాయ్ పిన్నిలు అతన్ని చంపడానికి రౌడీలను పంపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ennallo Vechina Hrudayam Serial Today Episode రన్నింగ్‌లో బస్ ఎక్కిన బాల పడిపోకుండా త్రిపుర చేయి అందిస్తుంది. బాల త్రిపురని చూసి స్వప్న సుందరిగా ఊహించుకుంటాడు. సాగర కన్యని చూడటానికి వెళ్తున్నానని బాల త్రిపురకు చెప్తాడు. మీ వాళ్లు రాలేదా అని త్రిపుర అడిగితే చెప్పకుండా వచ్చానని చెప్తాడు. అలా రావడం తప్పు కదా అని త్రిపుర చెప్తుంది. ఇక కొందరు రౌడీలు ఆ బస్‌లో ఉంటారు. వాళ్లు బాలనే గమనిస్తూ ఉంటారు.
బాల చిన్నాన్న పిన్నిలు రౌడీలకు ఫోన్ చేసి బాలని ఎలా అయినా చంపేయ్మని చెప్తారు. చాలా సేపు నిల్చొన్న బాల ఓ బామ్మ ఒడిలో కూర్చొంటాడు. బామ్మ బాల మీద కోప్పడుతుంది. త్రిపుర బాలని తీసుకెళ్లి తన ప్లేస్ ఇస్తుంది. బాల త్రిపురని తన పక్కకు లాక్కొని కొంచెం ప్లేస్‌లో కూర్చొపెట్టుకుంటాడు. ఇక అనంత్ గాయత్రీ వాళ్ల ఆఫీస్‌కు వెళ్తాడు. గాయత్రీ అనంత్‌ని చూసి నవ్వి దగ్గరకు వెళ్తుంది.
అనంత్: మీ నవ్వు చాలా బాగుంది.
గాయత్రీ: అవునండీ మీ ఒంటికి తగిలిన గాయాలు తగ్గాయా.
అనంత్: ఒంటికి తగిలిన గాయాలు తగ్గాయి కానీ మనసుకి తగిలిన గాయం తగ్గేలాలేదు.
గాయత్రీ: ఏదో అంటున్నారు. మీకు నేను చూపించిన ల్యాండ్ నచ్చిందా.
అనంత్: నచ్చావ్.
గాయత్రీ: ఏంటి?
అనంత్: అదే అండీ ల్యాండ్ నచ్చింది. కమీట్ అయిపోమంటారా.
గాయత్రీ: ఏంటి.
అనంత్: అదే అండీ ల్యాండ్ సొంతం చేసుకోమంటారా.
గాయత్రీ: మీరు నిన్న వెళ్లిపోగానే వదిలేస్తారేమో అనుకున్నా.
అనంత్: ఏంటి?
గాయత్రీ: అదే అండీ ల్యాండ్ వద్దని వదిలేస్తారేమో అనుకున్నా.
అనంత్: మనసుకి నచ్చిన వాటిని ఎలా వదిలేసి వెళ్లిపోతాను. అదే అండీ ల్యాండ్‌ని త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటా.
ఇక కమీషన్ ఎంత ఇవ్వాలి అని అనంత్ గాయత్రీని అడిగితే అవసరం లేదని తాను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని కంపెనీ ఇస్తుందని చెప్తుంది. ఇక ఊరి చివర బాలా త్రిపుర సుందరి తిరునాళ్లు జరుగుతున్నాయి వాటికి వెళ్లాలి. అమ్మవారికి మనం ఏం కోరుకున్నా అది నెరవేరుతుంది అని గాయత్రీ అంటే నేను వస్తానని అనంత్ అంటాడు. తనకు ఓ ముఖ్యమైన కోరిక ఉందని దాని మీద జీవితం ఆధారపడి ఉందని అంటాడు. ఇద్దరూ తిరునాళ్లకి బయల్దేరుతారు. త్రిపుర స్కూల్ పిల్లల్ని కిందకు దించుతుంది. బాల బస్ దిగి వేషం వేసిన పులులు, తదితర అవతారాలు చూసి పిల్లల్ని తీసుకొని పరుగులు పెడతాడు. ఇక త్రిపుర బాలని ఒంటరిగా వదిలేయకూడదని అనుకుంటుంది. పులి వేషం చూసి బాల అరుస్తాడు. త్రిపుర బాల ఫ్యామిలీ, పేరు అడగాలని ప్రయత్నిస్తే బాల ఏం చెప్పడు. ఇక బాల అడుకోవడానికి పరుగులు పెడతాడు.
త్రిపుర తనకు పరిచయం ఉన్న పోలీస్ అతనికి చెప్పి బాలని అతని ఇంటికి అప్పగించమని చెప్తుంది. బాల రింగ్ ఆట ఆడుతూ షాప్ అతని డబ్బుల పెట్టే మీద రింగ్ వేసి నాదే అని గోల చేస్తాడు బాల. షాప్ అతను బతిమాలినా వినకుండా బాల లాక్కుంటాడు. ఇంతలో త్రిపుర వచ్చి అది గెలిచే వస్తువు కాదని ఇప్పించేస్తుంది. మరోవైపు బామ్మ బాల కోసం గదిలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ బాల నిద్ర పోతున్నా నన్ను ఎవరూ లేపొద్దని రాసి ఉంటుంది. బామ్మ చూసి గదిలో బాల లేకపోవడం గమనిస్తుంది. బాల బాల్యానీ డోర్ నుంచి కిందకి వెళ్లిపోయి ఉంటాడు. అది చూసి బామ్మ షాక్ అయిపోతుంది. ఇక బాల తిరునాళ్లలో చిన్న పిల్లాడిలా అన్నీ ఆటలు ఆడుకుంటాడు. గాయత్రీ, అనంత్ కూడా తిరునాళ్లకి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సంధ్యని లాక్కెళ్లిన తల్లి.. నా జీవితం నా ఇష్టం అంటూ ఫైర్.. పోలీసులకు కంప్లైంట్!