Ammayi garu Serial Today Episode దీపక్‌ కళ్లు తిరిగి పడిపోయేలా చేసింది ముసుగులో వచ్చిన రాజు అని తెలుసుకొని అందరూ షాక్ అయిపోతారు. రాజు వేసుకున్న బుర్కా తీయించిన సూర్య ప్రతాప్ రాజు కాలర్ పట్టుకొని ఎందుకురా ఇలా చేశావ్ అని అడుగుతాడు.

రాజు: దీపక్ మందారానికి అన్యాయం చేస్తున్నాడు. అందుకే ఇలా చేశాను.సూర్యప్రతాప్: రేయ్ మందారానికి అన్యాయం చేయడం ఏంట్రా. నువ్వు ఎందుకురా నా కుటుంబం మీద పగ పట్టావ్. మందారం చనిపోయింది కాబట్టే తన బిడ్డకు తల్లి కావాలని దీపక్ మరో పెళ్లి చేసుకుంటున్నాడు. దాన్ని కూడా నువ్వు నాశనం చేస్తున్నావ్ కదరా.రాజు: అది కాదు పెద్దయ్యా.సూర్యప్రతాప్: నోర్ముయ్ అని లాగిపెట్టి ఒకటి కొడతాడు. ఇంత మంది జీవితాలతో ఆడుకుంటున్నావ్ నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నిన్ను ఇలా కాదురా. ఇన్‌స్పెక్టర్.రూప: నాన్న రాజుని ఏం చేయొద్దు నాన్న.సూర్యప్రతాప్: ఆపు అసలు ఈ దరిద్రం అంతా నీ వల్లే జరిగింది. నిన్ను చూడాలి అన్నా నాకు అసహ్యంగా ఉంది. రేయ్ నువ్వు నా కూతుర్ని ప్రేమించి మొదటి తప్పు చేశావ్. నా కూతురు నిన్ను ప్రేమించింది అన్న కారణంతో నిన్ను వదిలేశా. తర్వాత నీ అహంకారంతో తనని దూరం పెట్టావ్. నా పర్సనల్ విషయాల్లో దూరి నాకు నచ్చని పేర్లు వినిపించేలా.. కనిపించేలా చేశావ్ (భార్య విరూపాక్షిని ఉద్దేశించి) అప్పటికే నువ్వు అల్లుడు స్థానంలో ఉండటం వల్ల నిన్ను చూసి చూడనట్లు వదిలేశా. నా బిడ్డ  బిడ్డ చావుకి కారణం అయ్యావ్. కానీ ఆ బిడ్డ నీకు బిడ్డే కాబట్టి వదిలేశా.  రూప: నాన్న దానికి కారణం రాజు కాదు నాన్న.సూర్యప్రతాప్: నువ్వు ఆపు అయినా నాకు నీతో మాట్లాడే అర్హత లేదు. చూడురా నువ్వు ఎన్ని ఘోరాలు చేసినా ఇది ఇంకా నిన్నే వెనకేసుకొస్తుంది. పింకీని తీసుకు వెళ్లి తప్పు చేశావ్. ఇన్ని సార్లు వదిలేసినా నువ్వు నా ఫ్యామిలీ మీద పగ పట్టావు అంటే ఇక నిన్ను వదలను. నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. ఇన్‌స్పెక్టర్‌ వీడు నా మేనల్లుడికి మత్తు మందు ఇచ్చాడు. మర్డర్ అట్మంట్ కింద కేసు పెట్టండి. వీడి వల్ల మా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడండి.రూప: రాజు.. రాజు.. నాన్న.. రాజు..సూర్యప్రతాప్: ఆగు వాడు అంత మోసం చేసినా నీ బతుకు నాశనం చేసినా వాడే కావాలి అంటే వెళ్లు కానీ ఒక్క సారి ఈ గుమ్మం దాటితే మళ్లీ ఈ గుమ్మంలో అడుగుపెట్టవు.

రూప ఏడుస్తూ వెనక్కి వెళ్లిపోతుంది. రాజుని పోలీసులు తీసుకెళ్లిపోతారు. రేపే దీపక్, మౌనికల పెళ్లి అని అందరితో చెప్తాడు. రాజుని బయటకు తీసుకురావాలి అంటే సీఎం సూర్య ప్రతాప్ కూతురిగానే తీసుకురాగలను అని రూప అనుకొని ఆగిపోతుంది. విజయాంబిక దీపక్‌తో రాజు రావడం మనకే మంచిదైందని రేపే పెళ్లి జరిగిపోతుందని అనుకుంటారు. రాజు బయటకు వస్తేనే ఈ పెళ్లి ఆగుతుందని రూప అనుకుంటుంది. మందారం వస్తే తప్ప ఈ పెళ్లి ఆగదని జీవన్‌కి కాల్ చేసి మందారం, రాఘవల మీద కన్నేసి ఉంచమని చెప్తుంది. దీపక్‌కి రేపే పెళ్లి అని చెప్తుంది.  మరోవైపు సూర్యప్రతాప్ వస్తుంటాడు. రూప తండ్రికి ఎదురై ఆగిపోతుంది. విజయాంబిక రాజుని తన తమ్ముడు అరెస్ట్ చేయించాడని చెప్తుంది. 

మందారం తన దగ్గరే ఉందని జీవన్ చెప్తాడు. విజయాంబిక షాక్ అయిపోతుంది. రాఘవ, మందారం తప్పించుకుంటూ ఉండగా జీవన్ చూసేసి ఇద్దరిని తన ఆధీనంలోకి తీసుకుంటారు. ఇద్దరూ తన దగ్గరే ఉన్నారని చెప్తాడు. ఇంతలో సూర్య, చంద్రలు గదిలోకి రావడంతో విజయాంబిక డెకరేషన్ గురించి మాట్లాడుతున్నట్లు కవర్ చేస్తుంది.  ఎవరు అని సూర్య అడిగితే జీవన్ అనేసి మళ్లీ అడగగానే జగన్ అని కవర్ చేస్తారు తల్లీకొడుకులు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరుగుతుందని బయట వాళ్లని పెళ్లికి రానివ్వొద్దని చంద్రతో చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.