Nindu Noorella Saavasam Serial Today Episode:  రణవీర్‌, అమరేంద్రకు ఫోన్‌ చేసి కుటుంబ సమేతంగా ఈరోజు తమ ఇంటికి డిన్నర్‌ కు రావాలని ఇన్వైట్‌ చేస్తాడు. ఈరోజే ఎందుకని అమర్‌ అడుగుతాడు. ఏమైనా స్పెషలా అని అడగ్గానే.. స్పెషల్‌ ఏం లేదని.. మీ ఇంట్లో నేను చాలా సార్లు భోజనం చేశానని అందుకే అని రణవీర్‌ చెప్పగానే అమర్‌ పిల్లలకు ఎగ్జామ్స్‌ వస్తున్నాయి.. కదా.. అయినా మన మధ్య ఇలాంటివి ఎందుకు అంటాడు. అయినా వినకుండా రణవీర్‌ రావాలని రిక్వెస్ట్‌ చేస్తాడు. అమర్‌ సరే వస్తాం అని చెప్తాడు.  మరోవైపు భాగీ ఏదో ఆలోచిస్తుంటే.. రాథోడ్‌ వస్తాడు.


రాథోడ్‌: ఇదిగో మిస్సమ్మ ఈ కన్ఫీజన్‌ చూడలేక లోపలికి వెళ్లి ఆ అనామిక కాన్‌సట్రేషన్‌ మొత్తం పిల్లల మీద ఉండేలా చేశా..? ఇప్పటికైనా ఆ కన్ఫీజన్‌ పక్కన పెట్టు.


భాగీ: అయితే సరేలే..!


రాథోడ్‌: అన్నట్టు చెప్పడం మరిచా.. నేను కూడా ఇప్పటి నుంచి నిను మేడం అని పిలుస్తాను


భాగీ: ఎందుకు రాథోడ్‌.


రాథోడ్‌: ఇప్పుడు  నీ గుర్తింపు ఈ ఇంటి కేర్‌ టేకర్‌ మిస్సమ్మ కాదు. ఈ ఇంటి కోడలు భాగమతీ. మా సారే నీకు ఆ స్థానం ఇచ్చేశారు.


అమర్‌ వస్తాడు..


అమర్‌: భాగీ… భాగీ..


రాథోడ్‌: భాగీ అంటా.. ఏంటి మేడం అప్పుడే మా సార్‌ను కొంగున కట్టేసుకున్నారా..? ఎప్పుడు నీ నామ జపమే చేస్తున్నారు.


భాగీ: ఊరుకో రాథోడ్‌ నువ్వు మరీను..


రాథోడ్‌: సిగ్గే.. మా సార్‌ నిన్ను పిలుస్తున్నాడు.. ఇదిగో మేడం సిగ్గు పడింది చాలు. లోపల మా సార్‌ పిలిచింది చాలు వెళ్లండి.


భాగీ: అలా పిలవగానే ఇలా వెళితే ఎలా రాథోడ్‌. మధ్యలో కొంచెం స్పేస్‌ ఇవ్వాలి.


రాథోడ్‌: ఎందుకు మధ్యలో ఆ అనామిక వచ్చి సెటిల్ అవ్వడానికా..?


భాగీ: రాథోడ్‌..


రాథోడ్‌: లేకపోతే ఇంకేంటి మేడం.. ఇందాక మనం మాట్లాడినప్పుడు ఆ అనామిక ఏమంది. సార్‌ పిలిస్తేనే వెళ్లానని చెప్పింది.


భాగీ: రాథోడ్‌.. ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వస్తున్నాను అండి..


అమర్‌: ఏయ్‌ లూజ్‌ నువ్వేమన్నా చిన్నపిల్లవు అనుకున్నావా..? అలా పరుగెడుతున్నావు.. కాలు జారి కిందపడిపోతే


భాగీ: పట్టుకోవడానికి మీరు ఉన్నారు కదండి. సారీ ఇంకోసారి పరుగెత్తకుండా నిదానంగా వస్తాను.


అమర్: వెళ్లి రెడీ అవ్వు డిన్నర్‌కు వెళ్దాం..


భాగీ: డేట్‌కు తీసుకెళ్తున్నారేమో..? ( మనసులో అనుకుని) ఇంత సడెన్‌గా చెప్తే ఎలా అండి. ఈవెనింగ్‌ చెబితే చాలా బాగా రెడీ అయ్యేదాన్ని..


అమర్: ఇప్పుడు బాగానే ఉన్నావు కదా..?


భాగీ: మీరంటే ఇంత సింపుల్‌గా ఇలా అనేశారు కానీ నేనైతే ఈ మూమ్‌మెంట్‌ను ఎలా ఊహించుకున్నానో తెలుసా..?


అంటూ  భాగీ రొమాంటిక్‌గా మాట్లాడుతూ.. ఊహల్లో తేలిపోతుంది. దీంతో అమర్‌ కోపంగా చూస్తూ.. ఏయ్‌ లూజ్‌ నేనేం మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు. అని తిట్టగానే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో అమర్‌ రణవీర్‌ నిన్ను నన్ను పిల్లలను తమ ఇంటికి డిన్నర్‌కు రమ్మన్నారు వెళ్దాం పద అని చెప్తాడు. అందరూ కలిసి డిన్నర్‌కు రణవీర్‌ ఇంటికి వెళ్తారు. రణవీర్‌ అందరినీ రిసీవ్ చేసుకుని డిన్నర్‌ ఏర్పాట్లు చేస్తుంటాడు. ఇంతలో కాళీ, రణవీర్‌ను చంపడానికి ఇంట్లోకి వస్తాడు. కత్తితో రణవీర్‌ మీద దాడి చేయబోతుంటే.. రణవీర్‌ చూసి పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. కాళీ చేతిలో కత్తి కిందపడిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మనోహరి ఆ కత్తి తీసుకుని రణవీర్‌ను పొడిచేందుకు వెళ్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!