Nindu Noorella Saavasam Serial Today Episode:  కాళీ జైలు నుంచి బయటకు వచ్చాడని మంగళ ఫోన్‌ చేసి మనోహరికి చెప్తుంది. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌గా మంగళను తిడుతుంది. దీంతో కాళీ నువ్వు చెప్పిన చోట ఉంటాడట నువ్వు రాకపోతే వెళ్లి అమరేంద్ర బాబును కలుస్తాడట అని చెప్తుండగానే మనోహరి కాల్ కట్‌ చేస్తుంది. ఇంతలో మళ్లీ ఫోన్‌ రింగ్‌ అవ్వగానే.. లిఫ్ట్‌ చేస్తుంది.

మనోహరి: వస్తున్నాను అని చెప్పాను కదా.. మళ్లీ ఎందుకు ఫోన్‌ చేస్తున్నావు

రణవీర్‌: మనోహరి నీకు కరెక్టుగా అరగంట టైం ఇస్తున్నాను. నా దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పనికి కారణం చెప్పి నన్ను కన్వీన్స్‌ చేయలేకపోతే నెక్ట్స్‌ ఫోన్‌ కాల్‌ అమరేంద్రకే పోతుంది.

మనోహరి:  సారీ రణవీర్‌ ఏదో టెన్షన్‌లో ఉండి..

రణవీర్‌:  నీ సారీలు నాకెందుకు ముందు నా దగ్గరకు రా

రణవీర్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో మనోహరి ఆలోచనలో పడిపోతుంది. ఎటు పోవాలో అర్థం కాక ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. రణవీర్‌ మూర్ఖుడు.. మంగళకే ఫోన్‌ చేద్దామని కాల్‌ చేస్తుంది. అర్జెంట్ పని ఉందని గంట తర్వాత వస్తానని అంతవరకు మీ తమ్ముడు ఈ ఇంటి గేటు దాటకుండా నువ్వే చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఆరు లక్షలు ఇవ్వు అలాగే చేస్తాను అంటుంది. మనోహరి సరే అంటుంది. బయటకు వెళ్తున్న మనోహరి కింద పడుతుంది. అప్పుడే భాగీ వస్తుంది.

భాగీ: అయ్యో బంగారు తల్లి ఏమైనా దెబ్బ తగిలిందా..

మను: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. ఏయ్‌ లూజు.. ఏం చేస్తున్నావు.

భాగీ: ( సిగ్గుగా) ఆయన కూడా ఇలాగే లూజు అని పిలుస్తాడు.. చూడు మనోహరి.. నేను అక్కలా సైలెంట్‌ కాదు.. చాలా వైలెంట్‌.. పిల్లల జోలికి వస్తే జాగ్రత్త

మను: నా జాగ్రత్త గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గమ్యం చేరే వరకు నా ప్రతి అడుగును నేనే సిద్దం చేసుకున్నాను.

భాగీ: అత్యాశకు పోయి మనకు కాని దాని కోసం తప్పటడుగులు వేస్తూ తప్పులు చేసుకుంటూ పోతే పోయేది నీ ప్రాణమే మను

మను: తప్పులు చేసుకుంటూ నేను ఇంత దూరం వచ్చాను. అయినా ఈ ఇంట్లో నెక్స్ట్‌ ఎవరైనా ఎదైనా కోల్పోతారు అంటే అది నువ్వే. నన్ను పట్టుకుందామని నువ్వు ఎంత తిరిగినా నన్ను నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు

భాగీ: ఆల్‌రెడీ పట్టుకున్నాను మను

మను: ఏయ్‌ తింగరి నేను అన్నది ఈ పట్టుకోవడం కాదు.. నేను తప్పు చేయడం గురించి.. అమర్‌ ముందు నేను చేసిన తప్పు పట్టుకోవడం గురించి

భాగీ: అవునా అయితే నువ్వు వెళ్లు

అని భాగీ చెప్పగానే.. మనోహరి కంగారుగా బయటకు వెళ్తుంది. గార్డెన్‌లో ఉన్న ఆరు, మనును చూసి ఇదేదో మళ్లీ ప్లాన్‌ చేస్తున్నట్టు ఉంది. దీన్ని ఫాలో అయి ఏం చేస్తుందో తెలుసుకుని భాగీకి చెప్పాలి అనుకుని ఆరు వెళ్లబోతుంటే.. చిత్రగుప్తుడు అడ్డుపడతాడు. బాలిక నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చేస్తాను. అని చెప్పగానే ఏంటి గుప్త గారు అని ఆరు అడుగుతుంది. దీంతో చిత్రగుప్తుడు నీకు అనామిక అనే నీలాగే ఉండే బాలకి శరీరం ఇస్తాను. అందులోకి నీ ఆత్మను ప్రవేశింపజేస్తాను అని చెప్తాడు. ఆరు ఆశ్చర్యపోతుంది. సరే అంటుంది. దీంతో ఆరుకు ఆనామికను చూపిస్తాడు గుప్త. మరోవైపు కారులో వెళ్తున్న అమర్‌, మనోహరిని అనుమానిస్తాడు. ఈ మధ్య మనోహరి ఏదో దాస్తుంది అని చెప్తాడు. రణవీర్‌ వచ్చినప్పటి నుంచి బాగా అడ్జర్వ్‌ చేస్తున్నాను తన బిహేవియర్‌ అనుమానంగా ఉందని అంటాడు. దీంతో రాథోడ్‌ ఇన్ని రోజులకు సరైన రూట్‌ లో ఆలోచిస్తున్నారు సార్‌ అంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!