Jagadhatri Serial Today Episode: ఆదిత్యపురంలో జరుగుతున్న విషయాలు మొత్తం ధాత్రి, కేదార్‌లకు చెప్తాడు సాధు. ఆ ఊరిలో ఉన్న గుడికి దేశం నలుమూలల నుంచి జనాలు రావడంతో ఆ ఊర్లో ఉన్న మహల్‌ను హోటల్‌గా మార్చారని.. సడెన్‌గా ఆ మహల్‌లో అనుమానాస్పద చావులు మొదలయ్యాయని చెప్తాడు.
ధాత్రి: మరి ఇంత జరుగుతుంటే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏమీ చేయలేదా..? సార్..
సాధు: ఎందుకు చేయలేదు.. ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లిన ఏ ఆఫీసరు కూడా తిరిగి మళ్లీ ప్రాణాలతో రాలేదు. చావులు పెరగడం మొదలయ్యాయి. ఊర్లో జనాలు కూడా చనిపోతుంటే.. ఇంకా అక్కడున్న ప్రజలు భయంతో ముందు చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా మారి ఊరి జనాల్ని చంపేస్తున్నారని భయంతో అందరూ ఊరును ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
కేదార్: ఒక మూఢనమ్మకాన్ని పట్టుకుని ఊరు ఊరంతా పుట్టిన ఊరుని పెరిగిన ఊరిని వదిలేసి వెళ్లిపోయారా..?
ధాత్రి: నమ్మడానికి కష్టంగా ఉన్నా కళ్ల ముందు జరుగుతున్న దాన్ని కాదనలేకపోతున్నాం సార్.
సాధు: అసలు అక్కడ దెయ్యం ఉందా..? లేదా అనేది పక్కన పెడితే జరిగిన మరణాల వెనక ఏదో ఒక మిస్టరీ ఉందని నాకు అనుమానంగా ఉంది.
ధాత్రి: కచ్చితంగా ఈ మర్డర్స్ వెనక ఏదో ఒక మిస్టరీ ఉంది సార్. లేదంటే ఇంత మంది రీజన్స్ లేకుండా ఫ్రూప్స్ లేకుండా చనిపోవడం ఏంటి..?
కేదార్: నేను జేడీ వెంటనే ఆ ఊరు వెళ్లి మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయో.. మేం కనిపెడతాం సార్.
ధాత్రి: అవును సార్ చాలా రోజుల తర్వాత ఒక చాలెంజింగ్ కేసు దొరికింది. అక్కడ ఏ దెయ్యమూ లేదని నిరూపించి.. దెయ్యం ముసుగులో ఊరందరినీ భయపెట్టిన వాళ్లను వెలుగులోకీ తీసుకొచ్చి మళ్లీ ఆ ఊరికి.. ఆ గుడికి జనాలు వచ్చేలా చేస్తాం సార్.
సాధు: మీరు వెళ్లడానికి ఒక చిక్కు ఉంది.
ధాత్రి: ఏంటి సార్..?
సాధు: ఐజీ గారు ఈ ఆపరేషన్స్‌కు పెళ్లి కాని వారినే పంపమన్నారు.
కేదార్: సార్ అదేం రూల్ సార్..
ధాత్రి: సార్ పెళ్లి అయిన వాళ్లు ఒకలా.. పెళ్లి కాని వాళ్లు ఒకలా ఇన్వెస్టిగేషన్ చేస్తారా..? సార్.
సమస్య అది కాదు. పెళ్లి అయిన వాళ్లు అక్కడికి వెళ్లి తిరిగిరాకపోతే వారి కుటుంబం చిక్కుల్లో పడినట్టు అవుతుందనేదే కారణం అని సాధు చెప్పగానే.. మరి మాకు మీరే సాయం చేయాలి సార్ అని కేదార్ అడుగుతాడు. అయితే మీరు పెళ్లి కాలేదని చెప్పాలి అంటాడు సాధు. సరే సార్ అంటారు ధాత్రి, కేదార్. మరోవైపు ఎమ్మార్వో.. కౌషికికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కలవదు. దీంతో ఎమ్మార్వో సుధాకర్ కు ఫోన్ చేస్తే.. సరే నేను కనుక్కుంటాను అని యువరాజ్‌ను అడిగితే తెలియదు అంటాడు. ఇంతలో కౌషికే ఫోన్ చేసి ఏడుస్తూ.. కాపాడండి బాబాయ్ అంటూ మామయ్య నన్ను చంపాలని చూస్తున్నారు అని ఏడుస్తుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది.
వైజయంతి: కౌషికికి ఏమైంది బా ఎందుకు అంత కంగారుపడుతున్నావు.
నిషిక: మామయ్యా.. నీకేం కాదు కాపాడతాను అంటున్నారు ఏంటి..?
సుధాకర్: పరంధామయ్య బావ తనను కారులో క్వారీ వైపు తీసుకెళ్తున్నాడట.. చంపుతాను అంటున్నాడు అట. వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. కౌషికిని కాపాడుకోవాలి.
యువరాజ్: ఏం చేస్తున్నారు నాన్నా..?
సుధాకర్: పోలీసులకు ఫోన్ చేస్తున్నానురా..? కౌషికిని కాపాడుకోవాలి.
యువరాజ్: ఎవరి నుంచి చనిపోయిన మామయ్య నుంచా..?
అని అడగ్గానే.. సుధాకర్ షాక్ అవుతాడు. కౌషికి అరిచిన అరుపులు గుర్తు చేసుకుంటాడు. యువరాజ్, నిషిక ఇద్దరూ కలిసి సుధాకర్‌ను కన్వీన్స్ చేయాలని చూస్తారు. మరోవైపు కారులో కౌషికిని తీసుకుని పరంధామయ్య వెళ్తుంటాడు. ఇంతలో కేదార్, ధాత్రి గమనించి కారును ఫాలో అవుతారు. మరోవైపు వైజయంతి సంతోషంగా ఒకటే దెబ్బకు కౌషికి మూలకు.. ఆ జగధాత్రి, కేదార్ బయటకు పెత్తనం మన చేతుల్లోకి అని హ్యపీగా ఫీలవుతుంటారు. మరోవైపు కారున ఫాలో అయిన ధాత్రి, కేదార్ కారుంలోచి పరంధామయ్య దిగి పారిపోవడం చూస్తారు. ఇంతలో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!