Nuvvunte Naa Jathaga Serial Today February 10th: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా, మిధున పోస్టర్ చూసిన పురుషోత్తం దేవాకి మిధునని వదులించుకోమని సలహా ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode భాను దేవాకి ఫొటో గురించి నిలదీస్తుంది. ఆ పోరి అంటే నీకు ఇష్టం అందుకే ఇలా ఫొటో వేయించావ్ అని గోల చేస్తుంది. దానికి దేవా నాకేంటే అవసరం అని ఫొటో వేసిన వాళ్ల అంతు చూస్తా అని వెళ్తాడు. మిధున నవ్వుకుంటుంది.
మరోవైపు ఆ పోస్టర్ చూసిన జడ్జి హరివర్ధన్‌కి తన ఫ్రెండ్ కాల్ చేసి మీ కూతురికి పెళ్లి అయిందని చెప్పనే లేదని పోస్టర్ గురించి చెప్తాడు. దాంతో హరివర్థన్ తన కూతిరికి పెళ్లి కాలేదని చెప్తాడు. వెళ్తూ దారిలో పోస్టర్ చూసి చాలా చిరాకు పడతాడు. చాలా మంది కాల్ చేస్తే ఫోన్ పడేసి ఇంటికి వెళ్లిపోతాడు. మరోవైపు దేవా తన ఫ్రెండ్స్‌ని కొడతాడు. ఎందుకు కొడుతున్నావని అందరూ అడిగితే నాకు తెలీకుండా ఫోటోలు వేస్తారా అని అంటాడు. మా ఫొటోలు భార్య భర్తల్లా వేసి పబ్లిసిటీ చేస్తారా అని కొడతాడు. దాంతో దేవా ఫ్రెండ్స్ మచ్చ నువ్వే ఫొటో పంపి నువ్వే మమల్ని కొడతావా అని అడుగుతారు. ఫోన్‌లో దేవా ఫొటో పంపినట్లు చూపిస్తారు. దేవా షాక్ అయిపోతాడు. తనకు తెలీకుండా తన ఫోన్ నుంచి ఎవరు ఫొటో పంపారా అని అనుకుంటాడు.
మిధున దేవా విసిరేసిన పోస్టర్ తమ గదిలో అతికించుకుంటుంది. నువ్వే తాళి బంధాన్ని గౌరవిస్తావ్ జీవితాంతం కలిసుంటామని దేవా ఫొటో ముట్టుకుంటుంది. ఇంతలో భాను వచ్చి నా రాజా మీద చేయి తీయ్ అంటే మిధున మళ్లీ చేయి వేయమని అంటుంది. ఇద్దరూ నేను దేవా పెళ్లాం అంటే నేను దేవా పెళ్లాం అని కొట్టుకుంటారు. దేవానే ఫొటో పంపాడని కావాలంటే తన ఫ్రెండ్స్‌ని అడుగని అంటుంది. దేవా మనసులో తన మీద ప్రేమ ఉందని కానీ అందరి ముందు చెప్పలేక ఇలా చేశాడని మిధున అంటుంది. దేవా నా భర్తే అని భాను అంటే మిధున తిట్టి భానుని పంపేస్తుంది.
పురుషోత్తం రావడంతో దేవా హడావుడి చేస్తాడు. దేవా ఫ్రెండ్స్ దేవాకి మంచి పదవి ఇవ్వమని అంటే పురుషోత్తం తమ్ముడిగా ఉంటానని దేవా అంటాడు. ఇక పురుషోత్తం దేవాతో నా గురించి నీకు అన్నీ తెలుసు నీ కోసం నాకు అన్నీ తెలియాలి కదా మరి నీ పెళ్లి గురించి చెప్పలేదని అంటాడు. దాంతో దేవా అది పెళ్లి కాదు పెద్ద యాక్సిడెంట్ అని అంటాడు. మిధున పెద్ద జడ్జి కూతురని నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుతాడు. ఇక పురుషోత్తం తనకి ఎమ్మెల్యే అయితే పూర్తి ప్రజాసేవకి అంకితం అయిపోదామని దందాలు తగ్గించేద్దామని చెప్పి ఆ జడ్జి కూతురిని నీ జీవితం నుంచి పంపేయమని అంటాడు. ఇక మిధున ఇంట్లోకి పోస్టర్ చేరుతుంది. అందరూ షాక్ అవుతారు.
దేవా మిధునకి భార్య స్థానం ఇచ్చాడని బామ్మ అంటుంది. మిధున అన్నయ్య సిటీ అంతా విషయం తెలిసిపోయిందని అరుస్తాడు. ఇంతలో జడ్జి ఇంటికి వస్తాడు. అందరూ నీ కూతురికి పెళ్లి అయిందా అని అడిగి పరువు తీస్తున్నారని కేకలేస్తాడు. మిధున తల్లి ఏడుస్తుంది. దానికి త్రిపుర దేవా కావాలనే ఇలా చేశాడని మిధునని భార్యగా ఒప్పుకోను అని అంటూనే పోస్టర్లు వేయించాడంటే ఏదో పెద్ద ప్లాన్ వేశాడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Aalso Read: సత్యభామ సీరియల్: ఇంకా లేదేంటా అనుకుంటే వచ్చేసిందిగా సంధ్యకి సవతి.. అమ్మాయిలంతా ఇలాంటి వెదవలకే పడతారేంట్రా!