Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode హోమానికి శ్రీధర్ రావడంతో కార్తీక్ ఫైర్ అవుతాడు. ఈ మనిషి వచ్చి హోమం ఫలితం లేకుండా చేశాడని కార్తీక్ అంటాడు. దాంతో శ్రీధర్ నేను నీకు దేవుడిని అని అరుస్తాడు. నీ కూతురి ప్రాణాలు కాపాడటానికి డబ్బు ఇచ్చింది ఎవరో నీకు తెలుసా. పోనీ నేను చెప్పనా అని శ్రీధర్ అడుగుతాడు. దీప చాలా టెన్షన్ పడుతుంది. కావేరి ఎవరికీ చెప్పను అంది కదా అనుకుంటుంది. ఆమె వైపు తిరిగితే నేనేం చెప్పలేదని తలాడిస్తుంది. 


కావేరి: ఈయనకు ఎలా తెలుసు. నేను చెప్పలేదు కదా.
దీప: శ్రీధర్ గారికి నిజం తెలిసిపోయినట్లుంది. ఇప్పుడు కార్తీక్ బాబుకి నిజం తెలిస్తే ఏమైపోతారో. 
శ్రీధర్: నీ పేరు మీద డబ్బు కట్టిన ఆ మనిషి ఎవరో నాకు తెలుసురా.
కార్తీక్: నీకు ఎలా తెలుసు. చెప్పేసి మీరు దయచేయండి.
శ్రీధర్: ఆ మనిషి ఎవరో కాదు నేనే. 
కార్తీక్: నువ్వా..
కావేరి: ఎందుకు అబద్ధం చెప్తున్నారు.
శ్రీధర్: తమరు నోరు మూయండి శ్రీమతి గారు. మామూలుగా అయితే తమరి చెంప పగలగొట్టి బీరువాలో నగలు ఏమయ్యాయి. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏమయ్యాయి అని అడగాలి. కానీ నేను అడగను ఎందుకో తెలుసా. మామూలుగా అయితే జన్మని ఇవ్వడం తప్ప నేనేం చేయలేను అనే నా కొడుకుకి ఈ రోజు చెప్తున్నా నీ కూతురు కానీ కూతురికి ప్రాణ దానం చేసింది నేనేరా అని చెప్పడానికి. నేనే బ్యాంక్ ఆనంద్ రావుకి కాల్ చేసి కనుకున్నా శ్రీమతి గారు మీరు దొరికిపోయారు.
స్వప్న: నిజం చెప్పు మమ్మీ.
కావేరి: అవును నేనే ఇచ్చాను. అవి నా డబ్బులు నాకు వాటికి ఏం సంబంధం లేదు.
స్వప్న: మమ్మీ తన డబ్బులు అని చెప్తుంది కదా మీవి అన్నట్లు బిల్డప్‌ ఇస్తారేంటి.
శ్రీధర్: నేను మీ అమ్మకే కాదు అమ్మ ఆస్తికి మొగుడినే. ఈ కార్తీక్ గారు తల తిరుగుతుందా. ఛీ ఛీ వీళ్ల డబ్బుతో ఆపరేషన్ జరిగిందా అని లోలోపల ఎవరో కెలికేసినట్లు ఉందా. లేక నీ మీద నీకే అసహస్యంగా ఉందా.
కావేరి: ఇక చాలు ఆపండి. కార్తీక్ అవి నా డబ్బులు నేను ఇస్తే తీసుకోరు అని నేనే ఎవరికీ తెలీకుండా ఇచ్చాను. 
శ్రీధర్: నా భార్య నన్ను మోసం చేసినట్లే నీ భార్య కూడా నన్ను మోసం చేసింది. రేయ్ కార్తీక్ నా భార్య నీ కూతురి కోసం డబ్బులు ఇచ్చిన విషయం నీ భార్యకి తెలుసురా. కానీ నిజం నీ దగ్గర దాచింది.
కార్తీక్: ఆ పెద్ద మనిషి చెప్పింది నిజమేనా. నీకు తెలుసా లేదా. చెప్పు దీప.
దీప: తెలుసు. 
శ్రీధర్: పాపం కార్తీక్ గారు భార్య చేతిలో మోసపోయారు.
కావేరి: నిజం తెలీకుండా మాట్లాకండి ఎవరికీ చెప్పొద్దని నేనే దీప దగ్గర మాట తీసుకున్నాను. 
శ్రీధర్: నా డబ్బు వద్దన్నావ్. నా సాయం వద్దన్నావ్ ఇప్పుడు ఏమైంది మీ ఇంట్లో వెలుగు నా వల్ల వచ్చింది. ఈ సాయానికి మీరంతా నాకు జీవితాంతం రుణ పడి ఉంటారు. ఓరేయ్ కార్తీక్ గుర్తు పెట్టుకో నీ కూతురి ప్రాణం నేను పెట్టిన భిక్ష. నేను చెప్పాలి అనుకున్నది చెప్పేసి. ఈ సారి ఎవరూ  ఓవర్ చేయకుండా నాకు రెస్పెక్ట్ చేయండి.
కావేరి: కార్తీక్ ఇందులో దీప తప్పులేదు.
శ్రీధర్: కాంచన నువ్వు వద్దన్న మనిషి నీ ఇంటి సంతోషానికి కారణం అయ్యాడని గుర్తు పెట్టుకో.


కావేరిని తీసుకొని శ్రీధర్ వెళ్లిపోతాడు. కార్తీక్‌ని చూసి అందరూ ఏడుస్తారు. అందరి ముందు పరువు తీయాలా అని మిమల్ని ఎవరు పిలిచారు అని కావేరి అడుగుతుంది. స్వప్న తండ్రి గురించి అంటే నా గురించి తెలిసిపోయింది కాబట్టి ఇలా లేదంటే నీ భర్తకి ఎవరు ఉన్నారో ఏం తెలుసు అని అంటాడు. నా భర్తని నీతో పోల్చుకోకు అని అరుస్తుంది. తండ్రీ కూతుళ్లు ఇద్దరూ తిట్టుకుంటారు. కార్తీక్ బయటకు వెళ్లి తండ్రి మాటలు తలచుకొని బాధ పడతాడు. దీప అక్కడికి వస్తుంది. నువ్వేంటో అర్థమయ్యేలా ఆ పెద్దమనిషి చెప్పాడని.. వందల సార్లు మనం పాపకి సాయం చేసింది ఎవరు అని మాట్లాడుకున్నాం ఒక్కసారి కూడా చెప్పాలి అనిపించలేదా అని  అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!