Nindu Noorella Saavasam Serial Today Episode: బాంబు ఉందని అమర్ చెప్పిన రెడ్ బాక్స్ గురించి వెతుకుతూ రాథోడ్ కిచెన్‌లో ఉన్న మంగళ దగ్గరకు వెళ్తాడు. మంగళను రెడ్ బాక్స్ గురించి అడుగుతాడు. దీంతో మంగళ తనకు తెలియదని చెప్తుంది. చాటు నుంచి మనోహరి, చంభా వింటుంటారు.
రాథోడ్: అంటే మీరు ఉదయం ఆ బాక్స్ ను కారులోంచి తీయలేదా..?
మంగళ: నేను ఎందుకు తీస్తాను. మీరు ఇద్దరు కదా రెండు కార్లలో లగేజీ తెచ్చి ఇంట్లో పెట్టారు
రాథోడ్: అన్ని బ్యాగులు పెట్టాము కానీ ఆ రెడ్ బ్యాగ్ ఒక్కటే కనిపించలేదు
చంభా: ఏంటి మనోహరి అన్ని సార్లు ఆ బాక్స్ గురించి అడుగుతున్నాడు. అంటే అమరేంద్రకు మన మీద అనుమానం వచ్చినట్టు ఉంది
మనోహరి: అనుమానం మన మీద కాదు ఆ మంగళ మీద నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు
రామ్మూర్తి కిచెన్‌లోకి వెళ్తాడు.
రామ్మూర్తి: ఏమోయ్ టిఫిన్లు రెడీ అయ్యాయా..? భాగీ, పిల్లలకు ఆకలి వేస్తుంటుంది
మంగళ: ఇదిగో ఆ పని మీదే ఉన్నాను
రామ్మూర్తి: ఏమయ్యా రాథోడ్ కాఫీ టీ కానీ ఏమైనా తాగుతావా
రాథోడ్: వద్దు సార్ మంగళ గారిని ఆ రెడ్ బాక్స్ గురించి అడగడానికి వచ్చాను
మంగళ: చూడండి ఆ బాక్స్ కనిపించడం లేదని నన్ను అడుగుతున్నారు
రాథోడ్: సార్ అది… సార్ అడగమన్నారు
మను: ఆ బాక్స్ గురించి అమర్ అడగమన్నాడా..?
చంభా: మనోహరి అందులో బాంబు ఉందని అమరేంద్రకు తెలిసిపోయిందేమో
రామ్మూర్తి: అవును ఆ బాక్స్ ఎక్కడ పెట్టావు
మంగళ: బాగుందండి మీరు కూడా నన్నే అడుగుతున్నారా..?
రామ్మూర్తి: అడగడం కాదు అనుమానిస్తున్నాను..నీ చేతి వాటం గురించి నాకు తెలియదా..? మర్యాదగా అల్లుడు గారి దగ్గరకు వెళ్లి ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పు
మంగళ: అయ్యో నిజంగా దాని గురించి నాకు ఏమీ తెలియదండి
చంభా: అయిపోయింది మనోహరి ఆ మంగళకు అంతా తెలుసు కదా..? అమరేంద్ర దగ్గర అంతా వాగేస్తుందేమో..?
రామ్మూర్తి: ఆ మరి దాన్ని నువ్వు కారులో ఎందుకు పెట్టావు..
మంగళ: అంటే అది మనోహరిది కదా అని కారులో పెట్టాను అంతే.. నాకు అంత వరకే తెలుసు..
మనోహరి, చంభా షాక్
చంభా: అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మన మెడకే చుట్టుకునేలా ఉంది.
మను: నువ్వు నోర్మూయ్ చంభా..
రామ్మూర్తి: మర్యాదగా నిజం చెప్పు మన ఊరిలో అల్లుడి గారి ముందు నా పరువువ తీయకు
మంగళ: మీ మీద ఒట్టు ఆ రెడ్ బాక్స్ కారులో పెట్టడం వరకు మాత్రమే నాకు తెలుసు..? ఆ తర్వాత అది ఏమైపోయిందో కూడా నాకు తెలియదు
రామ్మూర్తి: నేను నిన్ను నమ్మనే.. మర్యాదగా నిజం చెప్పు
రాథోడ్: సార్ ఆవిడ తీయలేదని చెప్తుంది కదా..? వదిలేయండి నాకు కొంచెం పని ఉంది వెళ్తాను
రామ్మూర్తి: త్వరగా టిఫిన్ చేసి తగలడు
మంగళ: ( మనసులో) ఇది మరీ బాగుంది. ఆ బాక్స్ కనబడకపోతే దానికి నేనేనా కారణం
బయటకు వెళ్లిన రాథోడ్ అమర్ దగ్గరకు వెళ్తాడు. వెనకే బయటకు వెళ్లిన మనోహరి, చంభా ఇద్దరూ కారు చాటున నిలబడి అమర్, రాథోడ్ మాటలు వింటుంటారు.
రాథోడ్: సార్ మంగళ గారికి ఆ బాక్స్ గురించి తెలియదంట సార్ తాను తీయలేదని అంటున్నారు.
అమర్: మరి ఎవరు తీశారు రాథోడ్ అందులో బాంబు ఉందని తెలిసి తీశారా..? లేక తెలియక తీశారా..?
అంటూ అమర్ కోపంగా అరవడంతో అది విన్న మనోహరి, చంభా షాక్ అవుతారు. అమర్‌కు అందులో బాంబు ఉందని ఎలా తెలిసిందని కంగారు పడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!